Bellam Tea: శీతాకాలంలో బెల్లం టీ తాగితే ఎంత మంచిదో తెలుసా?

టీలో ఎన్ని రకాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో టీ ఫేమస్. ఇప్పుడంటే టీలో ఎన్నో రకాలు వచ్చాయి కానీ.. ఒకప్పుడయితే టీలో బెల్లాన్ని కలుపుకుని తాగేవారు. అందులోనూ శీతా కాలంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన కేర్ తీసుకోవాలి. ఈ కాలంలో ఎక్కువగా అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ కాలంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే.. ఇమ్యూనిటీ లెవల్స్ కూడా..

Bellam Tea: శీతాకాలంలో బెల్లం టీ తాగితే ఎంత మంచిదో తెలుసా?
Bellam Tea
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Jan 16, 2024 | 9:00 AM

టీలో ఎన్ని రకాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో టీ ఫేమస్. ఇప్పుడంటే టీలో ఎన్నో రకాలు వచ్చాయి కానీ.. ఒకప్పుడయితే టీలో బెల్లాన్ని కలుపుకుని తాగేవారు. అందులోనూ శీతా కాలంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన కేర్ తీసుకోవాలి. ఈ కాలంలో ఎక్కువగా అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ కాలంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే.. ఇమ్యూనిటీ లెవల్స్ కూడా పెరుగుతాయి. బెల్లంలో భాస్వరం, ఐరన్, సుక్రోజ్, విటమిన్లు ఏ, బి, పలు ఖనిజాలు, పోషకాలు పుష్కలంగా ఉన్నందున ఈ శీతా కాలంలో బెల్లం టీ చాలా ఆరోగ్య కరంగా ఉంటుంది.

రోగ నిరోధక శక్తి పెరుగుతుంది:

శీతా కాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే.. తగినంత రోగ నిరోధక శక్తి అవసరం అవుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడానికి బెల్లం తీసుకోవడం చాలా మంచిది. బెల్లం తీసుకోవడం వల్ల అనేక పోషకాలు అందుతాయి. దీంతో శరీరంలో ఇమ్యూనిటీ లెవల్స్ అనేవి పెరుగుతాయి.

ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తుంది:

బెల్లం టీలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇది శరీరంలో ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించడంలో బాగా హెల్ప్ అవుతాయి. యాంటీ ఆక్సిడెంట్లు శక్తివంతమైన యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలతో సహా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.

ఇవి కూడా చదవండి

జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది:

జీర్ణ సమస్యల్ని తగ్గించడంలో బెల్లం బాగా సహాయ పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది మల బద్ధకాన్ని నివారించడంలో ఉపయోగ పడుతుంది. భోజనం తర్వాత మీరు తిన్న ఆహారం మెరుగ్గా జీర్ణం కావడానికి మీ టీలో బెల్లం చేర్చుకోవడం చాలా ముఖ్యం.

శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి:

శీతా కాలంలో జలుబు, దగ్గు వంటివి కారణంగా చాలా మంది శ్వాస కోశ సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటారు. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలన్నా.. శ్వాస కోశ మార్గాన్ని క్లియర్ చేయడానికి, గొంతు చికాకును తగ్గించడానికి బెల్లం టీ బాగా సహాయ పడుతుంది. అంతే కాకుండా జలుబు, దగ్గును కూడా నివారిస్తుంది.

రక్త స్థాయిలను నిర్వహిస్తుంది:

బెల్లం టీ తీసుకుంటే శరీరానికి ఐరన్ బాగా అందుతుంది. ఇది ఆరోగ్యకరమైన రక్త స్థాయిలను నిర్వహించడానికి చాలా ముఖ్యం. సరైన మొత్తంలో బెల్లం వాడితే ఆక్సిజన్ సమర్థవంతంగా అన్ని భాగాలకు చేరుస్తాయి ఎర్ర రక్త కణాలు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.

తన KCR సినిమా పోస్టర్స్ తనే గోడ మీద అతికిస్తోన్న రాకింగ్ రాకేష్
తన KCR సినిమా పోస్టర్స్ తనే గోడ మీద అతికిస్తోన్న రాకింగ్ రాకేష్
నెలలో ఈ ఐదు రోజులు ఉల్లి, వెల్లుల్లి తినొద్దు.. ఎందుకంటే..
నెలలో ఈ ఐదు రోజులు ఉల్లి, వెల్లుల్లి తినొద్దు.. ఎందుకంటే..
నార్త్‌లో సౌత్ సినిమాల జోరు.. బోల్తా కొడుతోన్న బాలీవుడ్..
నార్త్‌లో సౌత్ సినిమాల జోరు.. బోల్తా కొడుతోన్న బాలీవుడ్..
చైనాకు గట్టిపోటీస్తున్న భారత్.. ఆ రంగం వృద్ధిలో టాప్
చైనాకు గట్టిపోటీస్తున్న భారత్.. ఆ రంగం వృద్ధిలో టాప్
మెగా వేలంలో ఆ ఐదుగురు యువ ఆటగాళ్లు కోట్లు కొల్లగొట్టడం ఖాయం
మెగా వేలంలో ఆ ఐదుగురు యువ ఆటగాళ్లు కోట్లు కొల్లగొట్టడం ఖాయం
టెట్ అభ్యర్థులకు అలర్ట్.. మరికొన్ని గంటలే ఛాన్స్
టెట్ అభ్యర్థులకు అలర్ట్.. మరికొన్ని గంటలే ఛాన్స్
టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్.. ఆ యంగ్ ప్లేయర్ జట్టులోకి?
టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్.. ఆ యంగ్ ప్లేయర్ జట్టులోకి?
భారత ప్రాచీన శాస్త్ర విజ్ఞానం.. ఎన్నో అద్భుత ఆవిష్కరణలు..
భారత ప్రాచీన శాస్త్ర విజ్ఞానం.. ఎన్నో అద్భుత ఆవిష్కరణలు..
నారీ భారత్‌.. భారీగా ఉద్యోగాలు..ఆకాశనందే ప్యాకేజీలు
నారీ భారత్‌.. భారీగా ఉద్యోగాలు..ఆకాశనందే ప్యాకేజీలు
ఇది పుష్పగాడి సత్తా.. రికార్డులు కొల్లగొడుతున్న పుష్ప 2..
ఇది పుష్పగాడి సత్తా.. రికార్డులు కొల్లగొడుతున్న పుష్ప 2..