AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tongue Brunt Remedies: వేడి వేడి పదార్థాలు తిని నాలుక కాలిందా.. ఇలా చేస్తే సెట్!

సాధారణంగా వేడి వేడిగా ఆహారం తీసుకుంటూ ఉంటారు. ఒక్కోసారి పనుల మీద బయటకు వెళ్లే కంగారులో గాబరాగా వేడి ఆహారం తినడం, టీలు వంటివి తాగుతూ ఉంటారు. ఈ క్రమంలో అప్పుడప్పుడు నాలుక కాలిపోతూ ఉంటుంది. దీని వల్ల అసౌకర్యంగా ఉంటుంది. శరీరంలోనే అతి సున్నితమైన భాగాల్లో నాలుక కూడా ఒకటి. ఫుడ్ టేస్టీగా ఉంటుందని వేడిగా తింటాం కానీ.. నాలుక కాలితే వచ్చే నొప్పి మాత్రం రెండు, మూడు రోజుల వరకూ ఉంటుంది. చాలా మంది ఈ ఇబ్బందిని ఫేస్ చేసే ఉంటారు. అయితే ఈ సారి ఇలా జరిగితే..

Tongue Brunt Remedies: వేడి వేడి పదార్థాలు తిని నాలుక కాలిందా.. ఇలా చేస్తే సెట్!
Tongue Burunt
Chinni Enni
| Edited By: |

Updated on: Dec 29, 2023 | 4:19 PM

Share

సాధారణంగా వేడి వేడిగా ఆహారం తీసుకుంటూ ఉంటారు. ఒక్కోసారి పనుల మీద బయటకు వెళ్లే కంగారులో గాబరాగా వేడి ఆహారం తినడం, టీలు వంటివి తాగుతూ ఉంటారు. ఈ క్రమంలో అప్పుడప్పుడు నాలుక కాలిపోతూ ఉంటుంది. దీని వల్ల అసౌకర్యంగా ఉంటుంది. శరీరంలోనే అతి సున్నితమైన భాగాల్లో నాలుక కూడా ఒకటి. ఫుడ్ టేస్టీగా ఉంటుందని వేడిగా తింటాం కానీ.. నాలుక కాలితే వచ్చే నొప్పి మాత్రం రెండు, మూడు రోజుల వరకూ ఉంటుంది. చాలా మంది ఈ ఇబ్బందిని ఫేస్ చేసే ఉంటారు. అయితే ఈ సారి ఇలా జరిగితే.. ఈ చిట్కాలు మీకు బాగా హెల్ప్ చేస్తాయి.

పెరుగు:

సాధారణంగా ఎవరి ఇంట్లో అయినా పెరుగు కామన్ గా ఉంటుంది. నాలుక కాలినప్పుడు పెరుగును తింటే సరిపోతుంది. పెరుగు చల్లగా ఉండటమే కాకుండా మంటను కూడా తగ్గిస్తుంది. నోట్లో పెరుగును కాసేపు అలా ఉంచుకుంటే మంట, నొప్పి రెండూ తగ్గుతాయి. పెరుగు ఆరోగ్యం కూడా.

చక్కెర:

నాలుక కాలినప్పుడు ఉపశమనం కలిగించడంలో చక్కెర కూడా ఎఫెక్టీవ్‌గా పని చేస్తుంది. వేడి వేడిది తిన్నప్పుడు నోరు మంటల ఉంటే.. పంచదారను నోట్లో వేసుకుని కాసేపు అలానే ఉంచుకోండి. ఇలా తింటే నొప్పి, మంట వంటివి తగ్గుతాయి.

ఇవి కూడా చదవండి

తేనె:

నాలుక మంట, నొప్పిని తగ్గించడంలో తేనె కూడా బాగా పని చేస్తుంది. ఈ సమయంలో తేనెను నాకడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ సెప్టిక్ ఉండటం వల్ల ఇది తింటే ఆరోగ్యానికి కూడా మంచిదే.

ఐస్ క్యూబ్:

ఒక్కోసారి వేడిది తిన్నప్పుడే కాకుండా.. తినే కంగారులో నాలుక కూడా కరుచుకుంటూ ఉంటారు. ఇలాంటప్పుడు చాలా నొప్పిగా, మంటగా, అసౌకర్యంగా ఉంటుంది. ఇలాంటప్పుడు ఐస్ క్యూబ్ నోట్లో పెట్టుకోవడం వల్ల ఆ మంట, నొప్పి నుంచి రిలీఫ్ వస్తుంది.

సాధారణమైన ఆహారం తీసుకోవాలి:

నాలుక కాలినప్పుడు వీలైనంతగా సాధారణమైన, చల్లగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. స్పైసీ ఫుడ్ కి దూరంగా ఉంటే బెటర్. దీని వల్ల మీ నాలుక చల్లబడి.. నొప్పి, మంట తగ్గుతాయి. ఇలా ఇంట్లో ఉండే ఆహార పదార్థాలతో.. నాలుక మంట, నొప్పికి చెక్ పెట్టొచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.

Follow Us
కట్ చేసిన నిమ్మకాయలను ఇలా స్టోర్ చేస్తే.. వారమైనా చెడిపోవు
కట్ చేసిన నిమ్మకాయలను ఇలా స్టోర్ చేస్తే.. వారమైనా చెడిపోవు
మొదట్లో స్లో.. చివర్లో ఫుల్ స్పీడ్.. భారత్ గోల్డ్ బాక్స్ ఫుల్
మొదట్లో స్లో.. చివర్లో ఫుల్ స్పీడ్.. భారత్ గోల్డ్ బాక్స్ ఫుల్
చిన్నపిల్లని పెళ్లి చేసుకున్నా.. అందుకే ఇలా..
చిన్నపిల్లని పెళ్లి చేసుకున్నా.. అందుకే ఇలా..
దోశ పిండి పల్చగా మారిందా.. టెన్షనొద్దు.. ఈ సింపుల్ చిట్కాలతో
దోశ పిండి పల్చగా మారిందా.. టెన్షనొద్దు.. ఈ సింపుల్ చిట్కాలతో
తెలంగాణ ఓటర్లకు ECI గుడ్‌న్యూస్! నోటీసుల గందరగోళం,స్పెషల్ డ్రైవ్
తెలంగాణ ఓటర్లకు ECI గుడ్‌న్యూస్! నోటీసుల గందరగోళం,స్పెషల్ డ్రైవ్
చార్ట్ ప్రిపరేషన్ తర్వాత కూడా కన్ఫర్మ్ టికెట్ పొందొచ్చని తెలుసా?
చార్ట్ ప్రిపరేషన్ తర్వాత కూడా కన్ఫర్మ్ టికెట్ పొందొచ్చని తెలుసా?
చుండ్రు పదేపదే వస్తుందా? ఈ తప్పులే అసలు కారణం..
చుండ్రు పదేపదే వస్తుందా? ఈ తప్పులే అసలు కారణం..
ఆ హీరోకు చీరాల బీచ్‏లో రిసార్ట్.. ఇప్పుడు వందల కోట్ల ఆస్తి..
ఆ హీరోకు చీరాల బీచ్‏లో రిసార్ట్.. ఇప్పుడు వందల కోట్ల ఆస్తి..
ఈ ప్రాంతాల్లో రాబోయే 36 గంటల పాటు తాగునీటి సరఫరా బంద్!
ఈ ప్రాంతాల్లో రాబోయే 36 గంటల పాటు తాగునీటి సరఫరా బంద్!
డీమార్ట్‌‌తో బిజినెస్ డీల్.. మీ వస్తువులను అమ్మి లక్షలు..
డీమార్ట్‌‌తో బిజినెస్ డీల్.. మీ వస్తువులను అమ్మి లక్షలు..