నెయ్యిలో ఒక రకమైన ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది. ఇది జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఫలితంగా అన్ని పోషకాలను గ్రహించే సామర్థ్యం పెరుగుతుంది. సరైన శరీర బరువును నిర్వహించడం సులభం అవుతుంది. నెయ్యిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. అంతేకాకుండా విటమిన్ ఎ, ఇ, డి వంటి కొవ్వులో కరిగే విటమిన్లు ఉంటాయి. ఇవి కాల్షియం శోషణలో సహాయపడతాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.