- Telugu News Photo Gallery Technology photos Apple offering huge discount on iphone 14 and iphone 15, Check here for full details
iphone offer: ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్.. రూ. 35 వేలకే సొంతం చేసుకునే ఛాన్స్..
యాపిల్ బ్రాండ్‌కు టెక్ మార్కెట్లో ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రైవసీ, అధునాతన ఫీచర్లు, మంచి పర్ఫామెన్స్‌కు పెట్టింది పేరైన యాపిల్ ఫోన్స్‌ను కొనుగోలు చేయడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. అయితే యాపిల్ బ్రాండ్‌ను కొనుగోలు చేయాలని ఉన్నా.. ధరకు భయపడి చాలా మంది వెనుకడగు వేస్తుంటారు. అయితే ఇలాంటి వారి కోసమే యాపిల్ సూపర్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Dec 29, 2023 | 12:55 PM

ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. ఐఫోన్ 14 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ. 69,990కాగా 17 శాతం డిస్కౌంట్‌తో రూ. 57,999కి సొంతం చేసుకోవచ్చు. దీంతో పాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 1000 డిస్కౌంట్ పొందొచ్చు. ఇక పాత ఫోన్‌ను ఎక్స్ఛేజ్ చేసుకుంటే గరిష్టంగా రూ. 34,500 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఈ లెక్కన ఐఫోన్‌ను రూ. 35 వేలకే సొంతం చేసుకునే అవకాశం ఉంది.

ఐఫోన్ 15 స్మార్ట్ ఫోన్‌పై కూడా భారీ ఆఫర్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌పై రూ. 8000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఇక హెచ్‌డీఎఫ్‌సీ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.5,000 తగ్గింపు పొందొచ్చు. అలాగే పేమెంట్ పేజీలో రూ.3,000 అదనపు డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. దీంతో ఐఫోన్ 15ను రూ.71,990కే కొనుగోలు చేయవచ్చు.

ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. ఐఫోన్ 15లో 6.1 ఇంచెస్‌తో కూడిన సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. అలాగే ప్రొటెక్షన్ కోసం సెరామిక్ షీల్డ్ మెటీరియల్ కూడా అందుబాటులో ఉంది. ఐఫోన్ 14 ప్రోలో కూడా డైనమిక్ ఐల్యాండ్ ఫీచర్‌ను ఇచ్చారు.

ఐఫోన్ 15 ప్లస్‌లో 6.7 ఇంచెస్‌తో కూడిన సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఈ రెండు స్మార్ట్స్ ఫోన్స్‌లోనూ 48 మెగాపిక్సెల్‌తో కూడిన అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అందించారు. దీంతోపాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉంది. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12 మెగాపిక్సెల్ ట్రూడెప్త్ కెమెరాను ఇచ్చారు.

ఇక ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ మొబైల్స్ ఏ16 బయోనిక్ చిప్‌పై పనిచేస్తాయి. ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌ల్లోనూ ఈ ప్రాసెసర్‌ను అందించారు. ఇక ఇందులో టైప్ సీ పోర్టల్‌ను అందించిన విషయం తెలిసిందే.




