- Telugu News Photo Gallery Technology photos IQoo launch iQoo Neo 9 series iQoo Neo 9 and Neo 9 Pro features and price details
iQoo Neo 9 series: స్టన్నింగ్ లుక్, సూపర్ ఫీచర్స్.. ఐకూ నుంచి కొత్త ఫోన్..
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఐకూ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. ఐకూ నియో 9 సిరీస్ పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతం చైనా మార్కెట్లో తీసుకొచ్చిన ఈ స్మార్ట్ ఫోన్‌ను భారత మార్కెట్లోకి ఎప్పుడు తీసుకొస్తారన్న దానిపై కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇంతకీ ఐకూ నియో 9 సిరీస్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Dec 28, 2023 | 10:58 PM

ఐకూ నియో 8 స్మార్ట్‌ఫోన్‌కు కొనసాగింపుగా ఈ స్మార్ట్ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఈ స్మార్ట్ ఫోన్ రెడ్, వైట్ సోల్, నాటికల్ బ్లూ, ఫైటింగ్ బ్లాక్ కలర్స్ ఆప్షన్స్‌లో లాంచ్ చేశారు. ధర విషయానికొస్తే.. 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ధర రూ. 26,700, 16 జీబీ ర్యామ్,256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 29,000, 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ధర రూ. 32,600, 16 జీబీ ర్యామ్, 1 టీబీ స్టోరేజ్ ధర రూ. 37,200గా నిర్ణయించారు.

ఐకూ నియో 9 సిరీస్‌లో భాగంగా ఐకూ నియో 9, నియో 9 ప్రో పేరుతో రెండు ఫోన్‌లను లాంచ్ చేసింది. ఇక ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.78 ఇంచెస్‌తో కూడిన ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 1.5కే రిజల్యూషన్, 144 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌ను అందించారు.

ఈ స్మార్ట్ ఫోన్స్‌లో ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను అందించారు. ఐకూ క్యూ1 చిప్ ప్రాసెసర్‌తో మంచి గేమింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్స్‌లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌ను అందించారు.

కెమెరా విషయానికొస్తే ఐకూ నియో 9 సిరీస్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌లో 6కే వీసీ లిక్విడ్ కూలింగ్ 3డీ హీట్‌ను డిసిపేషన్‌ను అందించారు. దీంతో ఫోన్ హీట్ అవ్వదు.

బ్యాటరీ విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5160 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందిస్తున్నారు. అలాగే ఈ ఫోన్స్‌లో డ్యూయల్ స్పీకర్, ఐఆర్ బ్లాస్టర్, ఎక్స్-యాక్సిస్ లైనర్ మోటర్, వైఫై-7ను అందించారు. ఈ రెండు ఫోన్‌లు ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.





























