- Telugu News Photo Gallery Technology photos Specialist of amrit bharat express trains and features, technology details
Amrit Bharat Express: అమృత్ భారత్‌లో అదిరిపోయే ఫీచర్స్.. పుష్-పుల్ టెక్నాలజీతో పాటు..
భారతీయ రైల్వే ముఖచిత్రాన్ని మారుస్తూ త్వరలోనే కొత్త రైళ్లు అందుబాటులోకి వస్తున్న విషయం తెలిసిందే. అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ పేరుతో త్వరలోనే రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ప్రయాణికులకు అధునాతన ప్రయాణ సౌకర్యాలను కల్పించే లక్ష్యంతో తీసుకొస్తున్న ఈ రైళ్లలో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ఇంతకీ ఈ ట్రైన్స్ ప్రత్యేకత ఏంటి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Dec 29, 2023 | 1:55 PM

అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ పుష్-పుల్ టెక్నాలజీతో రానున్నాయి. ఇందులో వెనకా, ముందు రెండు ఇంజన్‌లు ఉంటాయి. ముందు ఇంజిన్ రైలును లాగినప్పటికీ, వెనుక ఇంజిన్ ఏకకాలంలో రైలును పుష్ చేస్తుంది. దీంతో రైలు వేగం పెరుగుతంది.

ఇక రైలు వేగంగా ప్రయాణించే సమయంలో వచ్చే కుదుపులను తగ్గించడానికి ఈ రైళ్లలో సెమీ-పర్మనెంట్ కప్లర్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే కుషన్డ్ సీట్లు, ప్రతి సీటు వద్ద ఛార్జింగ్ పాయింట్లు, స్లైడర్ ఆధారిత విండో గ్లాస్, ప్రయాణీకుల సమాచార వ్యవస్థ వంటి ఫీచర్లు ఉన్నాయి.

అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌లో నాన్-ఏసీ స్లీపర్ కమ్ అన్‌రిజర్వ్డ్ క్లాస్ కాన్ఫిగరేషన్‌ను అందించారు. అలాగే ఈ రైళ్లలో వీల్ చైర్ యాక్సెసిబిలిటీ ర్యాంప్‌లు, రైలు డ్రైవర్ల కోసం ఎయిర్ కండిషన్డ్ క్యాబిన్లను ప్రత్యేకంగా డిజైన్ చేశారు.

ఇక అధిక వేగంతో రైళ్లు ప్రయాణించే సమయంలో అధిక వేగంతో గాలి ఒత్తిడిని తగ్గించడానికి కోచ్‌ల మధ్య ఖాళీ పూర్తిగా కప్పబడి ఉంటుంది. ఇప్పటికే నిర్వహించిన ట్రయల్ రన్స్ విజయవంతమయ్యాయి.

ఇదిలా ఉంటే అమృత్ భారత్ రైళ్లను డిసెంబర్ 30వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. అయోధ్య నుండి దర్భంగా (బీహార్) వరకు ప్రారంభమవుతుంది.




