- Telugu News Photo Gallery Technology photos How Ayodhya Ram mandir will change in coming 26 years photos made by AI Technology
2050 నాటికి అయోధ్య రామ మందిరం ఇలా ఉంటుందా.? కృత్రిమ మేధ అద్భుతం..
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని శాసిస్తోంది. ఏఐ ఆధారిత ఫొటోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా అయోధ్య రామ మందిరానికి సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. 2050 నాటికి అంటే, మరో 27 ఏళ్ల నాటికి రామ మందిరం ఎలా మారనుందో వివరిస్తూ కొన్ని ఫొటోలు రూపొందించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి..
Updated on: Dec 29, 2023 | 6:13 PM

అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. జనవరి 22న విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనుంది. అంగరంగ వైభవంగా జరగనున్న ఈ వేడుకకు ప్రధాని మోదీ సహా 6 వేల మంది అతిథులు పాల్గొననున్నారు.

ఈ క్రమంలోనే అయోధ్య రామ మందిరానికి సంబంధించిన కొన్ని ఏఐ ఫొటోలను రూపొందించారు. 26 ఏళ్ల తర్వాత అయోధ్య ఎలా ఉండనుందన్న ఆలోచనతో ఈ ఫొటోలను రూపొందించారు.

మారుతోన్న టెక్నాలజీకి ఆధారంగా వచ్చే 26 ఏళ్లలో ఎయిర్ ట్యాక్సీలు అందుబాటులోకి వస్తున్న తరుణంలో భక్తులు అయోధ్య రామ మందిర దర్శనానికి ఇలాంటి ట్యాక్సీల్లోనే వస్తారన్న కాన్సెప్ట్‌తో ఈ ఏఐ ఫొటోలను డిజైన్ చేశారు.

ఇక మరో 26 ఏళ్లలో రోబోలకు హ్యూమన్ ఎమోషన్స్ వస్తాయన్న కాన్సెప్ట్‌తో ఈ ఏఐ ఫొటోలను డిజైన్ చేశారు. వీటిలో రోబోలు ధ్యానం చేస్తున్నట్లున్న ఫొటోలను రూపొందించారు.

రానున్న 26 ఏళ్లలో టెక్నాలజీ పూర్తిగా మారుతుందన్న కాన్సెప్ట్‌తో ఈ ఫొటోలను రూపొందించారు. అయితే ఎంత టెక్నాలజీ మారినా.. ఆలయం నిర్మాణంలో ఎలాంటి మార్పులు లేనట్లు ఈ ఫొటోల్లో చూపించారు.




