Diabetes: ఈ రోజుల్లో డయాబెటిస్ చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందరిని వెంటాడుతోంది. ఇంటింటికి డయాబెటిస్ రోగుల సంఖ్య పెరిగిపోతోంది. ఎందుకంటే మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, ఆహార నియమాలు తదితర కారణాల వల్ల మధుమేహం బారిప పడుతున్నారు. అయితే డయాబెటిస్ ఉన్న చాలా మంది ఆహార నియమాలు సరిగ్గా పాటించరు. సరైన సమయానికి మందులు వేసుకోవడం, ఆహారం తీసుకోవడం వంటివి పాటించడం చాలా ముఖ్యమంటున్నారు వైద్య నిపుణులు. డయాబెటోలోజియాలో ఇటీవల ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం నిర్ణీత సమయంలో తినడం ద్వారా శరీరంలోని జీవక్రియ మెరుగుపడుతుంది. ఎందుకంటే ఇది రాత్రిపూట ఉపవాసం సమయ పరిమితిని కూడా పెంచుతుంది. అయితే మధుమేహం ఉన్నవారు ఆహారం విషయంలో ఎంత గ్యాప్ ఉండాలన్నదానిపై పరిశోధన నిర్వహించారు. పరిశోధకులు టైప్ 2 డయాబెటిస్ ఉన్న రోగులలో హెపాటిక్ గ్లైకోజెన్ స్థాయిలు, ఇన్సులిన్ సెన్సిటివిటీని పరిశీలించారు. టైప్ 2 డయాబెటిస్ ఉన్న రోగులలో 24 గంటల గ్లూకోజ్ హోమియోస్టాసిస్‌ను మెరుగుపరచడానికి ఈ 10-గంటల ఉపవాసం సురక్షితమైన, ప్రభావవంతమైన మార్గం అని వారు కనుగొన్నారు.
రోగులు అతిగా ఉపవాసం చేయకుండా తినే ఆహారంతో టైప్ 2 డయాబెటిస్‌ను నయం చేయవచ్చని ఫరీదాబాద్‌లోని అకార్డ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఇంటర్నల్ మెడిసిన్, రుమటాలజీ సీనియర్ కన్సల్టెంట్, యూనిట్ హెడ్ డాక్టర్ జయంత్ ఠాకూరియా TV 9 కి తెలిపారు. చాలా మంది రోగులు తమ రాత్రి భోజనానికి, ఉదయం భోజనానికి మధ్య 12-14 గంటల గ్యాప్‌ని ఉండాలన్నారు. ఒక వ్యక్తి hbA1C 5.7-6.4 (ప్రీ-డయాబెటిస్) మధ్య ఉంటే అలాంటి వ్యక్తి భోజనంలో ఎనిమిది గంటల కంటే ఎక్కువ గ్యాప్ తీసుకోకపోతే అలాంటి వారు చక్కెర స్థాయిని నియంత్రించవచ్చన్నారు.
టైప్ 2 డయాబెటిస్ అంటే ఏమిటి?
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంచనాల ప్రకారం.. భారతదేశంలో 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న 77 మిలియన్ల మంది మధుమేహం (టైప్ 2) తో బాధపడుతున్నారు. దాదాపు 25 మిలియన్ల మంది ప్రీ-డయాబెటిక్‌తో బాధపడుతున్నారు. అంటే సమీప కాలంలో మధుమేహం వచ్చే అవకాశం ఉందన్నట్లు. 50 శాతం మందికి పైగా వారి పరిస్థితి గురించి తెలియలేదు. ఇది సకాలంలో గుర్తించి చికిత్స చేయకపోతే ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందని వివరిస్తున్నారు.
10 గంటల పాటు ఉపవాసం చేయడం వల్ల షుగర్ లెవెల్స్‌ని మెరుగ్గా నిర్వహించడంలో సహాయపడుతుందా?
డాక్టర్ ఠాకూరియా వివరాల ప్రకారం.. కనీసం 10 గంటల గ్యాప్‌ని ఉంచడం మంచి ఫలితాలను ఇస్తుందనే దానిపై ఖండించారు. ఒక వ్యక్తి అతిగా ఉపవాసం ఉండకూడదు. ఎందుకంటే ఇది శరీరంలో నిల్వ ఉన్న కొవ్వును విచ్ఛిన్నం చేస్తుంది. చక్కెరగా మారుతుంది. దీని వలన చక్కెర స్థాయి గణనీయంగా పెరుగుతుంది. డయాబెటిక్, ప్రీ-డయాబెటిక్ రోగులకు భోజనం మధ్య సరైన గ్యాప్ ఆరు-ఎనిమిది గంటల కంటే ఎక్కువ ఉండకూడదు.
షుగర్ లెవెల్ ఉదయం 4 గంటలకు పడిపోయి, ఉదయం 6 గంటలకు మళ్లీ పెరుగుతుంది. అధిక ఉపవాసం లేదా తక్కువ ఉపవాసానికి సంబంధించిన డయాబెటిక్ రోగులలో ప్రభావం ఎక్కువగా స్థూలకాయులలో కనిపిస్తుంది. ఎందుకంటే ఊబకాయం మధుమేహం ప్రారంభానికి సంకేతం.
ఆహారంలో తేడా ముఖ్యం
డయాబెటిక్ పేషెంట్లు మందులు తీసుకుంటే భోజనం మధ్య విరామం ఉండాలి. తద్వారా భోజనం తర్వాత ఇన్సులిన్ శరీరంలో తన పనిని ప్రారంభిస్తుందని డాక్టర్ ఠాకూరియా తెలిపారు. ఉదయం 8 గంటలకు అల్పాహారం, మధ్యాహ్నం 2 గంటలకు భోజనం, రాత్రి 8-9 గంటలకు రాత్రి భోజనం చేయాలి. మందులు తీసుకోని వారు కూడా ఈ ఆహార పద్దతిని పాటించాలి. సక్రమంగా సమయానికి భోజనం చేయడం వల్ల షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి