AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eyes: మీ కళ్లులో ఈ మార్పులను అస్సలు లైట్ తీసుకోకండి..! ఆ ప్రమాదకర వ్యాధికి సంకేతం కావచ్చు!

డయాబెటీస్.. దేశంలో వేగంగా పెరుగుతున్న ప్రమాదకర వ్యాధులలో ఇదీ ఒకటి. ఈ వ్యాధి ఇప్పుడు భారతదేశంలో ఒక అంటువ్యాధిగా మారింది. ICMR–INDIAB అధ్యయనం ప్రకారం, దేశంలో 100 మిలియన్లకు పైగా ప్రజలు మధుమేహంతో బాధపడుతున్నారు. ఈ వ్యాధిని ఎక్కువగా సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు ఎందుకంటే.. ఇది దాని ప్రారంభ లక్షణాలు తేలికపాటిగా ఉన్నప్పటికీ, క్రమంగా శరీరంలోని అనేక భాగాలను దెబ్బతీస్తాయి. కాబట్టి ఈ వ్యాధి లక్షణాలను గుర్తించి ముందే పరిష్కరించుకోవడం ముఖ్యం. అయితే ఈ వ్యాధి లక్షణాలును మనం ఎలా గుర్తించాలో ఇక్కడ తెలుసుకుందాం.

Eyes: మీ కళ్లులో ఈ మార్పులను అస్సలు లైట్ తీసుకోకండి..! ఆ ప్రమాదకర వ్యాధికి సంకేతం కావచ్చు!
Eyes
Anand T
|

Updated on: Nov 16, 2025 | 4:14 PM

Share

ప్రతి అనారోగ్యానికి ముందు మన శరీరం మనకు కచ్చితంగా హెచ్చరిక సంకేతాలను ఇస్తుంది. అలాగే మనం వాటిని ముందుగానే గుర్తించి సరైన సమయంలో చికిత్స తీసుకుంటే ఆ వ్యాధిని జయించవచ్చు. అయితే, ప్రజలు తరచుగా ఈ లక్షణాలను లైట్‌ తీసుకుంటారు, కానీ దీర్ఘకాలంలో ఇది తీవ్రమైన అనారోగ్యానికి దారితీస్తుంది. అయితే మన శరీరంలోని కొన్ని అవయవాలు ఈ వ్యాధి సంకేతాయిను సూచిస్తాయి. మీకు డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటే ఆ లక్షనాలను మీరు కళ్లలో గుర్తించవచ్చు.

కళ్లలో కనిపించే డయాబెటీస్ లక్షణాలు

నిపుణుల అభిప్రాయం ప్రకారం, డయాబెటిస్‌ను కొన్నిసార్లు కళ్ళ ద్వారా గుర్తించవచ్చు. సాధారణంగా ఉన్నపటి కంటే మీరు మీ కళ్లలో మార్పును గమనిస్తే.. దానిని అస్సలు నెగ్లేట్ చేయవద్దు. కంటిచూపు మందగించినా, కళ్లలో వాపు వచ్చినా.. దృష్టిలో తరచుగా మార్పులు లేదా ఆకస్మిక దృష్టి కోల్పోవడం ఇవన్నీ రక్తంలో చక్కెర అసమతుల్యతకు సంకేతాలు కావచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలను ఎక్కువ కాలం నియంత్రించకపోతే, అది డయాబెటిక్ రెటినోపతికి దారితీస్తుంది, ఈ పరిస్థితిలో రెటీనా (కంటి వెనుక)లోని చిన్న రక్త నాళాలు బలహీనపడతాయి. ఈ పరిస్థితిని గమనించకుండా వదిలేస్తే, మీరు కంటి చూపు కూడా కోల్పోవచ్చు.

మీరు లక్షణాలను విస్మరిస్తే ఏమి జరుగుతుంది?

డయాబెటిస్‌ను దాని ప్రారంభ దశలోనే నియంత్రించకపోతే, అది టైప్ 2 డయాబెటిస్ నుండి ఇన్సులిన్-ఆధారిత డయాబెటిస్‌గా అభివృద్ధి చెందుతుంది. ఈ సందర్భంలో, శరీరం ఇన్సులిన్ ఉత్పత్తిని ఆపివేస్తుంది, ఇలా జరిగితో ఆవ్యక్తి జీవితాంతం ఇంజెక్షన్లు లేదా మందులపై ఆధారపడి బతకాల్సి ఉంటుంది. కాబట్టి క్రమం తప్పకుండా టెస్ట్‌లు, ఆరోగ్యకరమైన ఆహారం, చురుకైన జీవనశైలితో ఈ పరిస్థితిని చాలావరకు తగ్గించుకోవచ్చు.

మధుమేహాన్ని నివారించే మార్గాలు

మధుమేహాన్ని నివారించడానికి సులభమైన మార్గం ఏమిటంటే సమతుల్య ఆహారం తీసుకోవడం, ప్రతిరోజూ వ్యాయామం చేయడం, ఒత్తిడి లేని జీవనశైలిని అలవాటు చేసుకోవడం. ఇందుకోసం మీరు ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు నడవడం, చక్కెర, తెల్ల పిండితో చేసిన వస్తువులకు దూరంగా ఉండండడం,తగినంత నిద్ర పొవడం ముఖ్యం. దానితో పాటు మీకు ధూమపానం లేదా మద్యం అలవాటు ఉంటే వెంటనే దాన్ని మానేయడం. ఇలా చేయడం ద్వారా మీరు డయాబెటీస్‌ నుంచి తప్పించుకోగలరు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.