AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ లక్షణాలు యమ డేంజర్.. డయాబెటిస్ వల్ల ఏ కంటి వ్యాధి వస్తుందో తెలుసా..

డయాబెటిస్ కేవలం చక్కెర స్థాయిలను పెంచడమే కాదు, కళ్ళ ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. కాబట్టి డయాబెటిస్ కళ్ళను ఎలా దెబ్బతీస్తుంది.. దాని వల్ల కలిగే వ్యాధులు ఏమిటి..? దానిని ఎలా నివారించాలి..? నిపుణులు ఏం చెబుతున్నారు.. లాంటి వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం..

ఈ లక్షణాలు యమ డేంజర్.. డయాబెటిస్ వల్ల ఏ కంటి వ్యాధి వస్తుందో తెలుసా..
Diabetic Retinopathy
Shaik Madar Saheb
|

Updated on: Aug 25, 2025 | 2:48 PM

Share

డయాబెటిస్ కేసులు నిరంతరం పెరుగుతున్నాయి. ప్రస్తుత కాలంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ డయాబెటిస్ బారిన పడుతున్నారు.. శరీరంలో చక్కెర (గ్లూకోజ్) స్థాయి సాధారణం కంటే ఎక్కువగా ఉండే పరిస్థితి ఇది.. అయితే.. డయాబెటిస్‌లో టైప్ 1 – టైప్ 2 అనే రెండు రకాలున్నాయి. టైప్ 1 లో, శరీరం ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేకపోతుంది.. టైప్ 2 లో, శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించుకోలేకపోతుంది. డయాబెటిస్ కేసులు పెరగడానికి ప్రధాన కారణాలు అనారోగ్యకరమైన ఆహారం, ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం.. జన్యుపరమైన అంశాలు.. సకాలంలో జాగ్రత్త తీసుకోకపోతే, ఇది శరీర శక్తి, బరువును ప్రభావితం చేయడమే కాకుండా, కళ్ళు, మూత్రపిండాలు, గుండె వంటి ముఖ్యమైన అవయవాలను కూడా దెబ్బతీస్తుంది.

డయాబెటిస్ శరీరంలోని రక్త ప్రసరణ, రక్త నాళాలను ప్రభావితం చేస్తుంది. కళ్ళలోని చిన్న సిరలను కూడా దెబ్బతీస్తుంది. ఎక్కువ కాలం పాటు అధిక చక్కెర స్థాయిలు కళ్ళ సిరల్లో వాపు, స్రావాలకు కారణమవుతాయి. ఇది రెటీనాపై ఒత్తిడిని పెంచుతుంది. ఇది క్రమంగా దృష్టి కోల్పోయే ప్రమాదాన్ని పెంచుతుంది. డయాబెటిస్ కంటిశుక్లం, గ్లాకోమా, రెటినోపతి వంటి కంటి సమస్యలను కలిగిస్తుంది. అందువల్ల, క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేసుకోవడం చాలా ముఖ్యం..

డయాబెటిక్ రెటినోపతి లక్షణాలు

డయాబెటిస్ క్రమంగా కంటికి హాని కలిగిస్తుంది.. ఇది అనేక లక్షణాలను కలిగిస్తుంది. ప్రారంభంలో.. అస్పష్టమైన దృష్టి, కాంతిలో మెరుపులు లాంటివి కనిపించడం.. దగ్గరగా లేదా దూరంగా ఉన్న వస్తువులను స్పష్టంగా చూడలేకపోవడం సర్వసాధారణం. క్రమంగా, రెటీనా ప్రభావితమైనప్పుడు, దృష్టి నష్టం పెరుగుతుంది.. రంగులను గుర్తించడంలో ఇబ్బంది ఉండవచ్చు. కొంతమందికి అకస్మాత్తుగా వారి కళ్ళ ముందు మచ్చలు లేదా తేలియాడే నల్ల మచ్చలు కనిపించడం ప్రారంభమవుతుంది. దీనితో పాటు, చికాకు, ఎరుపు, పొడిబారడం లేదా తరచుగా కళ్ళు రెప్పవేయడం వంటి సమస్యలు కూడా కనిపిస్తాయి. సకాలంలో చికిత్స చేయకపోతే.. ఇది తీవ్రమైన కంటి వ్యాధికి లేదా అంధత్వానికి కూడా దారితీస్తుంది.

మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలి..

మీ రక్తంలో చక్కెర స్థాయిని ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోండి..

తక్కువ తీపి, తక్కువ నూనె పదార్థాలు కలిగిన ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి.

రోజూ వ్యాయామం, యోగా చేయండి.

ధూమపానం – మద్యం మానుకోండి.

కనీసం సంవత్సరానికి ఒకసారి పూర్తి కంటి పరీక్ష చేయించుకోండి..

మీ దృష్టిలో ఏవైనా మార్పులు లేదా ఏవైనా అసాధారణ లక్షణాలను గమనించినట్లయితే వెంటనే మీ వైద్యుడిని సంప్రదించండి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..