Curd Benefits: అందుకే పెరుగు తినమని చెప్పేది.. రోజూ తింటే ఆ సమస్యలన్నీ హాంఫట్.. అవేంటో తెలుసుకోండి..

పెరుగు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు చేకూరుతాయి. పెరుగులో కార్బోహైడ్రేట్, చక్కెర, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం లాంటివి పుష్కలంగా ఉన్నాయి.

Curd Benefits: అందుకే పెరుగు తినమని చెప్పేది.. రోజూ తింటే ఆ సమస్యలన్నీ హాంఫట్.. అవేంటో తెలుసుకోండి..
Curd
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 12, 2022 | 9:53 PM

Curd Benefits For Health: పెరుగు తినడం వల్ల ఒకటి కాదు చాలా పెద్ద సమస్యలు కూడా నయమవుతాయి. దీన్ని తీసుకోవడం ద్వారా మీ శరీరానికి పుష్కలంగా పోషకాలు అందుతాయి. పెరుగు తినడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. దీంతోపాటు పొట్టకు చల్లదనం లభిస్తుంది. ఇంకా పెరుగు తినడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. పెరుగులో కార్బోహైడ్రేట్, చక్కెర, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, జింక్, కాపర్, సెలీనియం, విటమిన్ సి, విటమిన్ బి-6, విటమిన్ ఎ, బి వంటి పోషకాలు, విటమిన్ K, కొవ్వు ఆమ్లాలు మొదలైనవి పుష్కలంగా ఉన్నాయి. అందుకే పెరుగు తినాలని పేర్కొంటున్నారు వైద్య నిపుణులు.

రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది

పెరుగు తినడం వల్ల బలమైన రోగనిరోధక శక్తితోపాటు అనేక ప్రయోజనాలు లభిస్తాయి. రోజూ పెరుగు తీసుకుంటే రోగనిరోధక శక్తి బలంగా మారుతుంది. అందుకే అన్ని కాలాలలో వీటిని ఎక్కువగా తీసుకోవాలి. దీంతోపాటు గుండెకు మేలు జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

ఎముకలు బలంగా మారుతాయి

పెరుగు తినడం వల్ల ఎముకలు కూడా బలపడతాయి. వాస్తవానికి పెరుగులో కాల్షియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. ఇలా చేస్తే ఎముకలతో పాటు దంతాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.

బరువు తగ్గుతారు..

బరువు తగ్గాలనుకునే వ్యక్తులు.. ఈరోజు నుంచే ఆహారంలో పెరుగును చేర్చుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. పెరుగులో ప్రోటీన్ కనిపిస్తుంది. దీని లోపల ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉన్నాయి. ప్రతిరోజూ పెరుగు తీసుకుంటే, బరువు తగ్గడంతో పాటు, అధిక కొలెస్ట్రాల్ సమస్యను కూడా అధిగమించవచ్చు.

జీర్ణవ్యవస్థ బలంగా మారుతుంది..

పెరుగు తినడం వల్ల జీర్ణవ్యవస్థకు బలం చేకూరుతుంది. ప్రతిరోజూ పెరుగు తీసుకుంటే జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. పెరుగులో మంచి బ్యాక్టీరియా ఉంటుందని, దీని వల్ల మీకు చాలా ప్రయోజనాలు లభిస్తాయి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి