Optical Illusion: ఈ dల మధ్య bలు ఉన్నాయి కనిపిస్తున్నాయా..? 10 సెకన్లలో కనుగొంటే మీరు జీనియస్..
పజిల్ ఒకటి తెరపైకి వచ్చింది.. ఇది ప్రజలను తికమక చేస్తోంది. ఈ పజిల్‌ను ఎలా పరిష్కరించాలో అర్థం కాక చాలామంది తలపట్టుకుంటున్నారు. దీనిని పరిష్కరించాలంటే మీ మెదడుకు పని చెప్పాల్సి ఉంటుంది.
Online puzzle photo: సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ వంటి గేమ్‌లను యూజర్లు బాగా ఇష్టపడుతున్నారు. వీటికి చాలామంది వ్యసనంగా మారుతున్నారు. వీటిని పరిష్కరించడానికి కూర్చుంటే సమయమే తెలియకుండా అయిపోతుంది. ఇది కేవలం సమయం వృధా అని చాలా మంది ప్రజలు, తల్లిదండ్రులు అనుకుంటారు. కానీ అలా అస్సలు కాదు. ఇది మన మెదడుకు వ్యాయామం లాంటిదని.. మనస్సును ఫిట్‌గా చేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ రోజుల్లో ఇలాంటి పజిల్ ఒకటి తెరపైకి వచ్చింది.. ఇది ప్రజలను తికమక చేస్తోంది. ఈ పజిల్‌ను ఎలా పరిష్కరించాలో అర్థం కాక చాలామంది తలపట్టుకుంటున్నారు. దీనిని పరిష్కరించాలంటే మీ మెదడుకు పని చెప్పాల్సి ఉంటుంది.
ఈ విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. చిన్నతనంలో ఇంగ్లీషు నేర్చుకునేటప్పుడు b, d అక్షరాలు రాసేటప్పుడు చాలా గందరగోళంగా అనిపించేది. ఎందుకంటే అవి ఒకేరకంగా ఉంటాయి. వాటితో ఉన్న ఈ ఫజిల్ అందరికీ సవాల్ విసురుతోంది. ఎందుకంటే ఇక్కడ ‘d’ అక్షరాలున్న ఈ పజిల్‌లో ‘b’ అక్షరాలు దాగి ఉన్నాయి. వీటిని ఎంత వెతికినా సులభంగా దొరకవు. పైన ఫోటోలో ఉన్న b లను కనుగొనేందుకు 20 సెకన్ల సమయం ఇచ్చారు. 10 సెకన్లలో కనిపెడితే జీనియస్ అంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఈ ఫోటోను జాగ్రత్తగా పరిశీలించండి.
ఫొటో చూడండి
ఈ చిత్రాన్ని 2017లో క్విజ్ యాప్ ప్లేబజ్ షేర్ చేసింది. ఇది మరోసారి వైరల్ అవుతోంది. అయితే.. చాలా తక్కువ మంది మాత్రమే దీన్ని చేయడంలో విజయం సాధించారు. ఈ పజిల్‌లో మొత్తం 4 bలు కనిపిస్తున్నాయి.
ఆప్టికల్ ఇల్యూషన్ వైరల్ ఫోటో
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి