AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Leg Pain: మీ పాదాలలో నొప్పి వస్తుందా? ఈ వ్యాధికి సంకేతాం కావచ్చు.. జాగ్రత్త!

చాలా మంది బిజినెస్‌లు, ఇతర ఉద్యోగాలు నిలబడి పనులు చేసేవి ఉండటం మనం చూస్తూనే ఉంటాము. వృత్తి వల్ల నిరంతరం నిలబడి పని చేయడం వల్ల ఇబ్బందులు వస్తాయి. దీంతో కాళ్ల నొప్పులు, నడుము ఒత్తిడి వంటి పలు సమస్యలు వస్తాయి. చాలా మంది కాలు నొప్పిని తీవ్రమైన వ్యాధిగా పరిగణించరు. ఎక్కువ సేపు నిలబడి పని చేస్తే శరీరంలో సంక్లిష్ట వ్యాధులు గూడు కట్టుకుంటాయి. ఈ కాలునొప్పిలో ఏ వ్యాధి..

Leg Pain: మీ పాదాలలో నొప్పి వస్తుందా? ఈ వ్యాధికి సంకేతాం కావచ్చు.. జాగ్రత్త!
Leg Pain
Subhash Goud
|

Updated on: Aug 25, 2024 | 8:11 PM

Share

చాలా మంది బిజినెస్‌లు, ఇతర ఉద్యోగాలు నిలబడి పనులు చేసేవి ఉండటం మనం చూస్తూనే ఉంటాము. వృత్తి వల్ల నిరంతరం నిలబడి పని చేయడం వల్ల ఇబ్బందులు వస్తాయి. దీంతో కాళ్ల నొప్పులు, నడుము ఒత్తిడి వంటి పలు సమస్యలు వస్తాయి. చాలా మంది కాలు నొప్పిని తీవ్రమైన వ్యాధిగా పరిగణించరు. ఎక్కువ సేపు నిలబడి పని చేస్తే శరీరంలో సంక్లిష్ట వ్యాధులు గూడు కట్టుకుంటాయి. ఈ కాలునొప్పిలో ఏ వ్యాధి సంభవిస్తుందో తెలుసా?

  1. నిరంతరం నిలబడి పని చేయడం వల్ల వెన్నెముకపై చాలా ఒత్తిడి పడుతుంది. ఈ సందర్భంలో కటి వెన్నెముకలో దీర్ఘకాలిక నొప్పి ఉన్నట్లు చూడవచ్చు. ఆ నొప్పి క్రమంగా కాలికి వ్యాపించవచ్చు.
  2. నిరంతరం నిలబడి పని చేయడం వల్ల అరికాళ్ల నరాలపై ఒత్తిడి పడుతుంది. మంచి బూట్లు ధరించకపోవడం వల్ల ఈ సమస్య తీవ్రమవుతుంది. పాదంలోని వంపుని పాదాల వంపు అంటారు. ఎల్లవేళలా నిలబడే వారు ఆ వంపుపై ఒత్తిడి ఏర్పడుతుంటుంది. ఫలితంగా, పాదంలో నరాలపై ఒత్తిడి పడటం వల్ల దీర్ఘకాలిక నొప్పి ప్రారంభమవుతుంది.
  3. ఎక్కువ సేపు నిలబడి పని చేస్తే వెరికోస్ వెయిన్స్ కూడా రావచ్చు. కాలి ధమనులలోని వాల్వ్ నిరుపయోగంగా మారుతుంది. ఫలితంగా, రక్తం లెగ్ సిరల్లో చేరడం ప్రారంభమవుతుంది. అప్పుడు సిర ఉబ్బుతుంది. దీనినే వెరికోస్ వెయిన్స్ అంటారు. కొన్నిసార్లు తీవ్రమైన నొప్పితో పాటు కాలు ఉబ్బడం ప్రారంభించే విధంగా సిరలు నిరోధించబడతాయి.
  4. తుంటి అనగా తొడ వెనుక భాగపు నరములు మనిషి నడుము నుండి పాదాల వరకు ఉంటాయి. నిలబడి పని చేయడం కూడా ఈ నరాల మీద ఒత్తిడి పడుతుంది. కండరాలు బిగుతుగా మారినప్పుడు నొప్పి వస్తుంది. స్ట్రెచింగ్ వ్యాయామాల వల్ల ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు.
  5. ఇవి కూడా చదవండి

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నాము.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి