Constipation: కడుపు ఉబ్బరంగా ఉందా.. అయితే ఇలా చేయండి.. తగ్గిపోతుంది..
కడుపుబ్బరం(constipation) అనేది చాలా మంది తరచూ ఎదుర్కొనే సమస్య. అందరూ ఎప్పుడో అప్పుడు దీంతో ఇబ్బంది పడ్డవారే...
కడుపుబ్బరం(constipation) అనేది చాలా మంది తరచూ ఎదుర్కొనే సమస్య. అందరూ ఎప్పుడో అప్పుడు దీంతో ఇబ్బంది పడ్డవారే. దీనికి ప్రధాన కారణం అతిగా తినటం(Food). అనారోగ్యకర ఆహారం, గబగబా తినటం, బద్ధకంగా కూర్చోవటం వంటివీ కడుపుబ్బరానికి దారితీస్తుంది. తేలికైన మార్పులు, చిట్కాలతో దీని బాధలను తగ్గించుకోవచ్చు.
పెరుగు, మజ్జిగ
ఇవి పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందేలా చేస్తాయి. ఇలా జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయటానికి తోడ్పడతాయి.
బాగా నమిలి తినటం
ఆహారాన్ని ఆస్వాదిస్తూ, బాగా నమిలి తినటం ఎవరికైనా మంచిదే. ఇది తృప్తిని కలిగించటమే కాదు.. ఆహారం బాగా జీర్ణం కావటానికీ తోడ్పడుతుంది.
తక్కువ తక్కువగా తినటం
ఒకేసారి ఎక్కువెక్కుగా తింటే కడుపు ఉబ్బి ఇబ్బంది కలిగిస్తుంది. అదే తక్కువ తక్కువగా ఎక్కువసార్లు తింటే కడుపు తేలికగా ఉంటుంది. తిన్నది బాగా ఒంట పడుతుంది.
పప్పులు నానబెట్టటం
కందిపప్పు వంటి వాటిని వండటానికి ముందు నానబెట్టటం మంచిది. దీంతో పప్పులు త్వరగా ఉడుకుతాయి. తేలికగా జీర్ణమవుతాయి. కడుపుబ్బరమూ తగ్గుతుంది.
పీచు పదార్థలు
పీచు జీర్ణక్రియ సజావుగా సాగేలా చూస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. తిన్నది బాగా జీర్ణమైతే కడుపుబ్బరమూ తగ్గుతుంది.
గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి
Read Also… Dragon Fruit: ఈ 3 వ్యాధులను దూరం చేసే దివ్య ఔషధం.. తింటే తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!