AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మామిడిపండు తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెట్టినట్టే

పండ్ల రాజు రుచిలో అద్భుతం అనే విషయంలో ఎటువంటి సందేహం లేదు. చాలా మంది రుచిగా ఉన్నాయి కదా అని గంపలు గంపలు తినేస్తూ ఉంటారు. కానీ ఈ తప్పు చేయకూడదు. ఈ పండులో షుగర్ లెవల్స్ ఇంకా కేలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ పండ్లు ఎక్కువగా తినడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ పెరుగుతాయి. దీనివల్ల బరువు పెరిగే ప్రమాదం ఉంది. ప్రకృతి ప్రసాదించిన ఈ అద్భుతమైన పండును సరైన పద్ధతిలో తీసుకోవడం వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఆస్వాదించవచ్చు.

మామిడిపండు తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెట్టినట్టే
Common Mistakes To Avoid While Eating Mangoes.jpg
Nikhil
|

Updated on: Apr 19, 2026 | 10:26 PM

Share

వేసవి కాలం వచ్చిందంటే చాలు పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఎదురుచూసేది పండ్ల రాజు మామిడి పండు కోసమే. కేవలం ఈ సీజన్‌లో మాత్రమే లభించే ఈ పండును ఆస్వాదించడానికి ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. అయితే, రుచిగా ఉన్నాయి కదా అని మామిడి పండ్లను తినే క్రమంలో మనం చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం పండును తినడమే కాదు, ఏ సమయంలో, ఎంత మోతాదులో, ఎలా తినాలో కూడా తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. మామిడి పండ్లను ఆస్వాదించేటప్పుడు మనం సాధారణంగా చేసే ఐదు ప్రధాన తప్పుల గురించి వివరంగా తెలుసుకుందాం.

అతిగా తినడం..

చాలా మంది మామిడి పండు రుచికి ముగ్ధులై పరిమితికి మించి తినేస్తుంటారు. దీనివల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అకస్మాత్తుగా పెరిగి బరువు పెరగడం లేదా విరేచనాలు వంటి సమస్యలు రావచ్చు. అందుకే రోజుకు ఒక పండు కంటే ఎక్కువగా తినకపోవడమే మంచిది. అలాగే మామిడి పండును ఒంటరిగా కాకుండా బాదం పప్పులు, పెరుగు లేదా పన్నీర్ వంటి ప్రోటీన్ కలిగిన ఆహారంతో కలిపి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా నియంత్రణలో ఉంటాయి. ప్రోటీన్ తో కలపడం వల్ల మామిడిలోని పోషకాలు శరీరానికి మెరుగ్గా అందుతాయి ఇంకా జీర్ణక్రియ కూడా సాఫీగా జరుగుతుంది.

భోజనం చేసిన వెంటనే మామిడి పండును డెజర్ట్ లా తీసుకోవడం చాలామందికి అలవాటు. ముఖ్యంగా బిర్యానీ వంటి హెవీ ఫుడ్ తిన్న తర్వాత మామిడి పండు తింటే జీర్ణక్రియపై విపరీతమైన భారం పడి అజీర్తి, గ్యాస్ సమస్యలు తలెత్తుతాయి. భోజనానికి, పండు తినడానికి మధ్య కనీసం రెండు గంటల సమయం ఉండాలి. అలాగే మామిడిని జ్యూస్ రూపంలో కాకుండా పండులాగే నమిలి తినాలి. జ్యూస్ చేయడం వల్ల అందులోని కీలకమైన ఫైబర్ (పీచు పదార్థం) కోల్పోతాము. ఫైబర్ లేకపోతే షుగర్ లెవల్స్ వేగంగా పెరుగుతాయి. పండును నిదానంగా నమిలి ఆస్వాదిస్తూ తింటేనే శరీరానికి కావాల్సిన పూర్తి పోషకాలు లభిస్తాయి.

Follow Us