AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీ తాగే ముందు ఈ పని చేయకపోతే మీ ఆరోగ్యం పని అయిపోయినట్లే.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

ఉదయం నిద్రలేవగానే వేడివేడి టీ కప్పు పడకపోతే చాలామందికి రోజు గడవదు. అయితే మీరు అమృతంలా తాగే ఆ టీ, మీ శరీరంలో విషంగా మారుతోందని మీకు తెలుసా? టీ తాగే ముందు లేదా తర్వాత మీరు తాగే నీళ్ల విషయంలో చిన్న పొరపాటు చేసినా.. అది మీ పళ్లను, కడుపును తీవ్రంగా దెబ్బతీస్తుంది. అసలు టీ తాగే ముందు నీళ్లు ఎందుకు తాగాలి? అనే విషయాలు తెలుసుకుందాం..

టీ తాగే ముందు ఈ పని చేయకపోతే మీ ఆరోగ్యం పని అయిపోయినట్లే.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
Water Before Or After Tea
Krishna S
|

Updated on: Apr 19, 2026 | 10:02 PM

Share

భారతీయులకు టీ అంటే కేవలం ఒక డ్రింక్ కాదు.. ఒక ఎమోషన్.. ఉదయం నిద్ర లేవగానే వేడివేడి టీ కప్పు పడకపోతే చాలామందికి రోజు గడవదు. పని ఒత్తిడిలో ఉన్నా, స్నేహితులతో కబుర్లు చెబుతున్నా టీ ఉండాల్సిందే. అయితే టీ తాగే పద్ధతిలో మనం తెలియకుండా చేసే కొన్ని పొరపాట్లు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయని ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా టీ తాగే ముందు లేదా తర్వాత నీళ్లు ఎప్పుడు తాగాలనే విషయంలో చాలామందికి స్పష్టత లేదు.

ఆయుర్వేదం ఏం చెబుతోంది..?

మన ప్రాచీన ఆయుర్వేద శాస్త్రం ప్రకారం.. ఏదైనా పదార్థాన్ని తీసుకునేటప్పుడు దాని గుణాన్ని బట్టి నీటిని తీసుకోవాలి. టీ అనేది స్వతహాగా ఆమ్ల గుణం కలిగినది. మన కడుపులో ఆహారం జీర్ణం కావడానికి సహజంగానే యాసిడ్స్ ఉంటాయి. కానీ ఖాళీ కడుపుతో టీ తాగినప్పుడు, ఆ ఆమ్లత స్థాయి అకస్మాత్తుగా పెరిగిపోయి శరీరంలోని పిత్త దోషాన్ని అసమతుల్యం చేస్తుంది.

టీ తాగడానికి 15 నిమిషాల ముందే నీళ్లు ఎందుకు తాగాలి?

మీరు టీ తాగడానికి కనీసం 10 నుండి 15 నిమిషాల ముందు ఒక గ్లాసు నీళ్లు తాగడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే..

కడుపులో రక్షణ కవచం: టీ తాగే ముందు నీళ్లు తాగడం వల్ల మీ కడుపు లోపలి భాగంలో ఒక నీటి పొర ఏర్పడుతుంది. ఇది టీలోని అధిక ఆమ్ల ప్రభావం నుంచి కడుపు గోడలను రక్షిస్తుంది. తద్వారా ఎసిడిటీ, గ్యాస్ మరియు గుండెల్లో మంట వంటి సమస్యలు దరిచేరవు.

దంతాల ఆరోగ్యం: టీలో టానిన్ అనే రసాయనం ఉంటుంది. ఇది దంతాల ఎనామెల్‌పై పేరుకుపోయి పళ్లు పసుపు రంగులోకి మారేలా చేస్తుంది. టీకి ముందు నీళ్లు తాగితే, పళ్లపై ఏర్పడే తేమ పొర టానిన్ ప్రభావం నుంచి దంతాలను కాపాడుతుంది.

డీహైడ్రేషన్ నివారణ: టీ ఒక డైయూరెటిక్. అంటే ఇది శరీరంలోని నీటిని బయటకు పంపిస్తుంది. దీనివల్ల బాడీ డీహైడ్రేషన్ బారిన పడే అవకాశం ఉంది. ముందుగా నీళ్లు తాగడం వల్ల శరీరంలో నీటి నిల్వలు సమతుల్యంగా ఉంటాయి.

టీ తాగిన వెంటనే నీళ్లు తాగడం ఎందుకు ప్రమాదకరం?

చాలామంది టీ తాగిన వెంటనే చల్లని నీళ్లు తాగుతుంటారు. ఇది అత్యంత ప్రమాదకరమైన అలవాటు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు..

దంతాలలో జలదరింపు: టీ చాలా వేడిగా ఉంటుంది, నీళ్లు సాధారణంగా చల్లగా ఉంటాయి. ఈ అకస్మాత్తు ఉష్ణోగ్రత మార్పు వల్ల దంతాల ఎనామెల్ దెబ్బతింటుంది. దీనివల్ల భవిష్యత్తులో దంతాల్లో విపరీతమైన జలదరింపు మొదలవుతుంది.

జీర్ణ వ్యవస్థకు ఆటంకం: వేడి టీ తాగిన వెంటనే నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియకు అవసరమైన వేడి అకస్మాత్తుగా తగ్గిపోతుంది. దీనివల్ల తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాక కడుపు ఉబ్బరం, గ్యాస్ట్రైటిస్ వంటి ఇబ్బందులు వస్తాయి.

ముక్కు నుంచి రక్తం కారడం: కొంతమందిలో ఉష్ణోగ్రతలో వచ్చే ఈ ఆకస్మిక మార్పుల వల్ల ముక్కులోని సున్నితమైన రక్తనాళాలు ప్రభావితమై రక్తస్రావం అయ్యే అవకాశం కూడా ఉందని ఆయుర్వేదం హెచ్చరిస్తోంది.

సరైన పద్ధతి ఏంటి..?

  • ఉదయం లేవగానే ముందుగా గ్లాసు గోరువెచ్చని నీళ్లు తాగండి.
  • ఆ తర్వాత 15-20 నిమిషాల గ్యాప్ ఇచ్చి మీ టీని ఆస్వాదించండి.
  • ఒకవేళ టీ తాగిన తర్వాత నీళ్లు తాగాలనిపిస్తే, కనీసం 30 నిమిషాల తర్వాత మాత్రమే తాగండి.

Follow Us
టీ తాగే ముందు ఈ పని చేయకపోతే మీ ఆరోగ్యం పని అయిపోయినట్లే..
టీ తాగే ముందు ఈ పని చేయకపోతే మీ ఆరోగ్యం పని అయిపోయినట్లే..
ముల్లన్‌పూర్‌లో రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకుల హిస్టరీ బ్రేక్
ముల్లన్‌పూర్‌లో రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకుల హిస్టరీ బ్రేక్
2023లో బ్లాక్ బస్టర్ హిట్.. ఇప్పటికీ ఓటీటీలో ట్రెండింగ్..
2023లో బ్లాక్ బస్టర్ హిట్.. ఇప్పటికీ ఓటీటీలో ట్రెండింగ్..
ప్రయాణికులకు అలర్ట్.. రైలులో తినేటప్పుడు ఈ తప్పులు చేశారో..
ప్రయాణికులకు అలర్ట్.. రైలులో తినేటప్పుడు ఈ తప్పులు చేశారో..
కిడ్నీలో రాళ్లను కరిగించే హెల్తీ వడలు.. తింటే, ఫ్యాన్ అయిపోతారు
కిడ్నీలో రాళ్లను కరిగించే హెల్తీ వడలు.. తింటే, ఫ్యాన్ అయిపోతారు
ఎలాంటి కథ అయిన చేసే సత్తా ఉన్న హీరో.. సీతారామం డైరెక్టర్..
ఎలాంటి కథ అయిన చేసే సత్తా ఉన్న హీరో.. సీతారామం డైరెక్టర్..
Most Expensive Over: ఐపీఎల్ హిస్టరీలోనే చెత్త ఓవర్.. ఎవరో తెలుసా?
Most Expensive Over: ఐపీఎల్ హిస్టరీలోనే చెత్త ఓవర్.. ఎవరో తెలుసా?
హర్మూజ్ జలసంధిలో భారత నౌకలపై ఇరాన్ కాల్పులు.. కేంద్రం సీరియస్..
హర్మూజ్ జలసంధిలో భారత నౌకలపై ఇరాన్ కాల్పులు.. కేంద్రం సీరియస్..
రాజకీయాల్లో కీలక పరిణామం.. ఒకేరోజు సీఎం రేవంత్, కేసీఆర్ సభలు..
రాజకీయాల్లో కీలక పరిణామం.. ఒకేరోజు సీఎం రేవంత్, కేసీఆర్ సభలు..
సబ్‌స్క్రిప్షన్ వివాదంపై క్లారిటీ ఇచ్చిన అనన్య నాగళ్ల..
సబ్‌స్క్రిప్షన్ వివాదంపై క్లారిటీ ఇచ్చిన అనన్య నాగళ్ల..