AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ananya Nagalla: నా ఉద్దేశ్యం అది కాదు.. అలాంటి కంటెంట్ ఉండదు.. సబ్‌స్క్రిప్షన్ వివాదంపై క్లారిటీ ఇచ్చిన అనన్య నాగళ్ల..

టాలీవుడ్ హీరోయిన్ అనన్య నాగళ్ళ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అయితే ఇటీవల ఆమె ఇన్‌స్టాగ్రామ్ లో సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఫీచర్‌పై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై స్పందించి స్పష్టతనిచ్చారు. తన ఉద్దేశ్యం అది కాదని.. కేవలం రోటిన్ విషయాలే అంటూ క్లారిటీ ఇచ్చింది.

Ananya Nagalla: నా ఉద్దేశ్యం అది కాదు.. అలాంటి కంటెంట్ ఉండదు.. సబ్‌స్క్రిప్షన్ వివాదంపై క్లారిటీ ఇచ్చిన అనన్య నాగళ్ల..
Ananya Nagalla
Rajitha Chanti
|

Updated on: Apr 19, 2026 | 9:04 PM

Share

తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అనన్య నాగళ్ళ. మల్లేశం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఆమె.. వకీల్ సాబ్ మూవీతో గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తుంది. అయితే ప్రస్తుతం ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఒక చర్చనీయాంశంగా మారారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ప్రారంభించిన ‘సబ్‌స్క్రిప్షన్’ ఫీచర్‌పై కొందరు నెటిజన్లు తప్పుగా అర్థం చేసుకుని విమర్శలు చేయడంతో, ఆమె ఈ విషయంపై ఘాటుగా స్పందించారు. సాధారణంగా సెలబ్రిటీలు తమ అభిమానులతో మరింత సన్నిహితంగా ఉండటానికి, ఎక్స్‌క్లూజివ్ కంటెంట్‌ను పంచుకోవడానికి ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ ఫీచర్‌ను వాడుతుంటారు. అనన్య కూడా ఇటీవల ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : చేసిందే ఒక్క సినిమా.. దెబ్బకు తెలుగు కుర్రాళ్లను పిచ్చెక్కించేసింది.. ఈ కేరళ అందాన్ని గుర్తుపట్టారా.. ?

ఇదివరకు ఇదే వివాదంపై విష్ణుప్రియపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇక అనన్య కూడా డబ్బులు చెల్లించి చూసే ఈ కంటెంట్‌లో ఆమె ‘అడల్ట్’ లేదా ‘బూతు’ కంటెంట్ పోస్ట్ చేస్తోందని కొందరు సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు. ఈ ఆరోపణలను అనన్య నాగళ్ళ తీవ్రంగా ఖండించారు. తాను సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లో పోస్ట్ చేస్తున్నది కేవలం భక్తికి సంబంధించిన కంటెంట్ అని ఆమె స్పష్టం చేశారు. “నేను నా పర్సనల్ లైఫ్ విశేషాలతో పాటు, నాకు ఇష్టమైన ఆధ్యాత్మిక విషయాలను, దేవాలయాల సందర్శన వీడియోలను అక్కడ పంచుకుంటున్నాను. అందులో ఎలాంటి అశ్లీలత లేదు. కేవలం భక్తి కంటెంట్ మాత్రమే ఉంది” అని ఆమె తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ సినిమా హిట్టుతో ఊళ్లో ఇల్లు కట్టేసా.. పుష్ప తర్వాత ఆస్తులు ఇవే.. టాలీవుడ్ నటుడు..

డబ్బులు తీసుకుని ఇలాంటి కంటెంట్ పెట్టడం ఏంటని ప్రశ్నించే వారికి సమాధానమిస్తూ.. ఇది ప్లాట్‌ఫామ్ కల్పించిన సౌకర్యమని, తన ప్రైవేట్ స్పేస్‌ను గౌరవించే అభిమానుల కోసం మాత్రమే దీనిని ఉద్దేశించినట్లు పేర్కొన్నారు. తప్పుడు ప్రచారాలు చేసే ముందు నిజానిజాలు తెలుసుకోవాలని ఆమె సూచించారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : తండ్రి సూపర్ స్టార్.. కొడుకు సెన్సేషనల్ హీరో.. సౌత్ ఇండస్ట్రీలో అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువే..

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఏఎన్నార్ ఛీ ఇదేం పాట అన్నారు.. అదే పాటతో చిరంజీవి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టారు..

Follow Us