వేసవిలో ప్రతి మార్కెట్‌లో దండిగా కనిపించే మామిడి పండ్లు ప్రతి ఒక్కరినీ ఊరిస్తూ ఉంటాయి. ముఖ్యంగా దక్షిణాదిలో పండించే మామిడి పండ్లు ఎంతో ప్రసిద్ధి
TV9 Telugu
ప్రపంచంలో మరెక్కడా లభించనన్ని రకాల మామిడి పండ్లు భారత్‌లో లభిస్తాయి. అంతేకాదు దేశంలోని మామిడిపండ్లు రకరకాల రుచుల్లో అందుబాటులో ఉంటాయి
TV9 Telugu
ఈ మామిడి పండ్లను నేరుగా తినొచ్చు. జ్యూస్‌లుగా చేసుకుని తాగవచ్చు. మామిడి తాండ్ర, మామిడి కరేలా లాంటి పదార్థాలు తయారు చేసుకుని కూడా తినొచ్చు
TV9 Telugu
అయితే ఈ మామిడిపండ్లు తిన్న తర్వాత ఓ ఐదు రకాల పదార్థాల జోలికి అస్సలు పోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మామిడి పండ్లు తిన్న తర్వాత కొంతసేపటి వరకు మంచినీళ్లను అస్సలు తాగొద్దు. నీళ్లు తాగితే కడపు నొప్పి, అసిడిటీ, కడుపు ఉబ్బరం లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది
TV9 Telugu
మామిడి పండు తినగానే పెరుగు తీసుకుంటే శరీరం డీహైడ్రేట్ అవుతుందట. అందువల్ల అలాంటి అలవాటు ఉంటే తక్షణమే మానుకోవాలట. లేదంటే వడదెబ్బ తగిలే ప్రమాదం ఉందట. అంతేగాక చర్మ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉన్నదట
TV9 Telugu
మామిడి పండ్లు తిన్న తర్వాత కాకరకాయ తీసుకోవడం కూడా మంచిది కాదట. అలా చేయడంవల్ల వికారం, వాంతులు, శ్వాస తీసుకోవడంలో సమస్యలు వస్తాయట
TV9 Telugu
మామిడి పండ్లు తిన్న తర్వాత ఘాటు పదార్థాలుగానీ, కారం పదార్థాలుగానీ తీసుకుంటే ఉదర సంబంధ సమస్యలు, చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉందట. అంతేగాక ముఖంపై మొటిమలు వచ్చే ప్రమాదం కూడా ఉంది
TV9 Telugu
మామిడి పండ్లతోపాటు చల్లటి పానీయాలు తీసుకోవడం కూడా ఆరోగ్యానికి హానికరమట. చల్లటి పానీయాలతో మామిడి పండ్లను తీసుకోవడంవల్ల షుగర్ లెవల్స్ మరింత పెరుగుతాయి