AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రయాణికులకు అలర్ట్.. రైలులో తినేటప్పుడు ఈ తప్పులు చేశారో అంతే సంగతులు

రైలు ప్రయాణం అంటే చాలా మంది ఇష్టం. కానీ కొన్నిసార్లు మీరు చేసే పొరపాట్లు మీ జేబుకు చిల్లు పడేలా చేస్తుంది. ఇకపై భోజనం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిందే. లేకపోతే మీరు పారవేసే చెత్తకు పడే జరిమానానే ఇప్పుడు చాలా ఖరీదుగా మారింది. మన రైలు-మన పరిశుభ్రత అంటూ రంగంలోకి దిగిన అధికారులు.. ఒక్కరోజే 1400 మందికి పైగా చెక్ పెట్టి లక్షల్లో జరిమానా వసూలు చేశారు.

ప్రయాణికులకు అలర్ట్.. రైలులో తినేటప్పుడు ఈ తప్పులు చేశారో అంతే సంగతులు
Indian Railways Fine For Littering
Krishna S
|

Updated on: Apr 19, 2026 | 9:42 PM

Share

రైలు ప్రయాణం అంటేనే ఒక సందడి.. ముఖ్యంగా ఇంటి నుంచి వండుకు వచ్చిన భోజనాన్ని ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయడం మనందరికీ అలవాటు. అయితే ఇకపై అలా భోజనం చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మీరు తిన్న భోజనం కంటే మీరు చెల్లించే జరిమానానే చాలా ఖరీదైనదిగా మారుతుంది. రైల్వే ప్రాంగణాల్లో, రైలు బోగీల్లో పరిశుభ్రత విషయంలో భారతీయ రైల్వే ఇప్పుడు కఠినంగా వ్యవహరిస్తోంది.

ఒక్కరోజే రూ.2.89 లక్షల జరిమానా

రైల్వే స్టేషన్లను, రైళ్లను క్లీన్‌గా ఉంచేందుకు రైల్వే శాఖ క్లీన్ రైల్వే కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టింది. ఇందులో భాగంగా కేవలం ఒక్క రోజులోనే వివిధ రైల్వే స్టేషన్లలో తనిఖీలు నిర్వహించగా.. ఏకంగా 1,447 మంది నిబంధనలు ఉల్లంఘిస్తూ పట్టుబడ్డారు. వీరి నుంచి రైల్వే అధికారులు మొత్తం రూ.2,89,400 జరిమానా వసూలు చేశారు. అంటే సగటున ప్రతి ఒక్కరి నుంచి రూ.200 వరకు ఫైన్ వసూలు చేస్తున్నారన్నమాట.

ఫ్యామిలీతో కలిసి తిన్నారా? చెత్త అక్కడే పడేశారా?

ఇటీవల ఒకే కుటుంబానికి చెందిన సభ్యులు ఇంట్లో వండిన ఆహారాన్ని రైలులో తిని, ఆ తర్వాత మిగిలిపోయిన వ్యర్థాలను, ప్లాస్టిక్ కవర్లను తమ సీట్ల కింద పారవేశారు. ఇది గమనించిన రైల్వే సిబ్బంది తక్షణమే వారికి భారీ జరిమానా విధించారు. మీరు భోజనం ఎక్కడిది తిన్నా పర్వాలేదు.. కానీ చెత్తను మాత్రం డస్ట్‌బిన్‌లోనే వేయాలి అని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

రైల్వే శాఖ హెచ్చరికలు

రైల్వే ప్రాంగణాల్లో సీసీటీవీ కెమెరాలు, సివిల్ డ్రెస్‌లో ఉన్న సిబ్బంది ప్రయాణికుల కదలికలను గమనిస్తుంటారు. ప్లాస్టిక్ వ్యర్థాలు, మిగిలిపోయిన ఆహారం వల్ల పర్యావరణానికే కాకుండా.. ఇతర ప్రయాణికుల ఆరోగ్యానికి కూడా ముప్పు కలుగుతుంది. రైల్వే ఆక్ట్ ప్రకారం రైల్వే ప్రాంగణాలను అపరిశుభ్రం చేయడం శిక్షార్హమైన నేరం. మీరు భోజనం చేసిన తర్వాత వచ్చే వ్యర్థాలను ఒక కవర్‌లో వేసి, మీ బోగీ చివరన ఉండే డస్ట్‌బిన్‌లో మాత్రమే వేయండి. తద్వారా మీ ప్రయాణం హాయిగా ఉండటమే కాకుండా మీ జేబుకు కూడా చిల్లు పడదు.

Follow Us
ప్రయాణికులకు అలర్ట్.. రైలులో తినేటప్పుడు ఈ తప్పులు చేశారో..
ప్రయాణికులకు అలర్ట్.. రైలులో తినేటప్పుడు ఈ తప్పులు చేశారో..
కిడ్నీలో రాళ్లను కరిగించే హెల్తీ వడలు.. తింటే, ఫ్యాన్ అయిపోతారు
కిడ్నీలో రాళ్లను కరిగించే హెల్తీ వడలు.. తింటే, ఫ్యాన్ అయిపోతారు
ఎలాంటి కథ అయిన చేసే సత్తా ఉన్న హీరో.. సీతారామం డైరెక్టర్..
ఎలాంటి కథ అయిన చేసే సత్తా ఉన్న హీరో.. సీతారామం డైరెక్టర్..
Most Expensive Over: ఐపీఎల్ హిస్టరీలోనే చెత్త ఓవర్.. ఎవరో తెలుసా?
Most Expensive Over: ఐపీఎల్ హిస్టరీలోనే చెత్త ఓవర్.. ఎవరో తెలుసా?
హర్మూజ్ జలసంధిలో భారత నౌకలపై ఇరాన్ కాల్పులు.. కేంద్రం సీరియస్..
హర్మూజ్ జలసంధిలో భారత నౌకలపై ఇరాన్ కాల్పులు.. కేంద్రం సీరియస్..
రాజకీయాల్లో కీలక పరిణామం.. ఒకేరోజు సీఎం రేవంత్, కేసీఆర్ సభలు..
రాజకీయాల్లో కీలక పరిణామం.. ఒకేరోజు సీఎం రేవంత్, కేసీఆర్ సభలు..
సబ్‌స్క్రిప్షన్ వివాదంపై క్లారిటీ ఇచ్చిన అనన్య నాగళ్ల..
సబ్‌స్క్రిప్షన్ వివాదంపై క్లారిటీ ఇచ్చిన అనన్య నాగళ్ల..
విరిగిన ఎముకలకు ఈ పచ్చడి ఓ వరం.. తింటే లేచి పరిగెత్తుతారు
విరిగిన ఎముకలకు ఈ పచ్చడి ఓ వరం.. తింటే లేచి పరిగెత్తుతారు
బంగారం, వెండి కాదు.. ఇప్పుడు దీనిదే హవా.. కాసుల వర్షం..
బంగారం, వెండి కాదు.. ఇప్పుడు దీనిదే హవా.. కాసుల వర్షం..
19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో తొలిసారి.. ఆర్చర్ సరికొత్త రికార్డ్..
19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో తొలిసారి.. ఆర్చర్ సరికొత్త రికార్డ్..