Coconut Sugar: షుగర్ పేషేంట్స్‌కు దివ్య వరం కొబ్బరి చక్కెర… పంచదారకు బదులు దీనిని ఎంపిక చేసుకోమంటున్న నిపుణులు..
Coconut Sugar: చక్కెర ను ఎక్కువగా తింటే అనేక అనారోగ్యాలు కలుగుతున్నాయి. దీంతో ఇప్పుడు ఎక్కువ మంది చక్కెర కు బదులు ప్రత్యామ్నాయం వైపు దృష్టి సారిస్తున్నారు. తీపి కోసం చక్కెరకు..
Coconut Sugar: చక్కెర ను ఎక్కువగా తింటే అనేక అనారోగ్యాలు కలుగుతున్నాయి. దీంతో ఇప్పుడు ఎక్కువ మంది చక్కెర కు బదులు ప్రత్యామ్నాయం వైపు దృష్టి సారిస్తున్నారు. తీపి కోసం చక్కెరకు బదులుగా రసాయనతో కూడిన వాటిని తీసుకుంటున్నారు. అయితే చక్కెర కు బదులు కొబ్బరి చక్కెర ను వంటఇంట్లోకి చేర్చుకోమని.. పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఈ కొబ్బరి చక్కెర సాధారణ చక్కెర కంటే ఎంతో మెరుగైనది. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది కొబ్బరి చక్కెర.
కొబ్బరి చక్కెర:
కొబ్బరికాండం నుంచి తీసిన ఓ ప్రత్యేక ద్రవంతో చక్కెరను తయారు చేస్తారు. ఎటువంటి రసాయనాలను కలపకుండా సజమైన పద్దతిలో కొబ్బరి చక్కెర ను తయారు చేస్తారు. కొంచెం మూడు బ్రౌన్ కలర్‌లో ఉంటుంది. అయితేనేమి ఇది సాధారణ చక్కెర కంటే ఆరోగ్యకరమైంది. దీనిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా కొబ్బరి చక్కెరలో ఫ్రక్టోజ్ , గ్లూకోజ్ రెండూ ఉంటాయి. అయితే సాధారణ చక్కెరలో గ్లూకోజ్ మాత్రమే ఉంటుంది. కొబ్బరి చక్కెరలో ఐరన్, జింక్, పొటాషియం, పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్లు , ఫైబర్ అధికంగా ఉంటాయి. కానీ సాధారణ చక్కెరలో వీటిల్లో ఒక్కటి కూడా ఉండదు. అందుకే ఆరోగ్యాన్ని పెంచే శక్తి కొబ్బరి చక్కెరకు ఉంది. దీన్ని వంటలకు, బేకరీ పదార్థాలను తయారు చేసేందుకు కూడా ఉపయోగిస్తున్నారు. కొబ్బరి చక్కెరను అధికంగా తిన్నా క్యాలరీలు వస్తాయన్న బెంగ ఉండదు. భేషుగ్గా తినవచ్చ. ఈరోజు కొబ్బరి చక్కెరతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..
ఆరోగ్య ప్రయోజనాలు:
*సాధారణ చక్కెర గ్లైసీమిక్ ఇండెక్స్ 65. కొబ్బరి చక్కెర జీఐ విలువ 35 మాత్రమే. దీంతో షుగర్ వ్యాధి గ్రస్తులకు కొబ్బరి చక్కెర మంచి ఎంపిక. దీనిని ఎంత తిన్నా షుగర్ లెవల్స్ పై ప్రభావం చూపించదు. షుగర్ లెవెల్స్ కంట్రోల్ లోనే ఉంటాయి.
*కొబ్బరి చక్కెర మీ జీర్ణాశయానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఉన్న ప్రీబయోటిక్స్ జీర్ణక్రియను అదుపులో ఉంచుతాయి.
*శాఖాహారికి మంచి ఎంపిక కొబ్బరి చక్కెర. కోకో షుగర్ ని ఎటువంటి పదార్ధాలు కలపకుండా సహజంగా తయారు చేస్తారు. ఇది నూటికి నూరుశాతం శాఖాహారం. ఎదుకంటే సాధారణ చక్కెరలో కొన్ని సార్లు తక్కువ స్థాయిలో నైనా జంతు సంబంధ పదార్థాలు కలుస్తాయి. ఇవి కొందరికి హాని కలిగిస్తాయి.
* కొబ్బరి చక్కెరలో సాధారణ చక్కెర కంటే దాదాపు 400 రెట్లు ఎక్కువ పొటాషియం అధికంగా ఉంది. గుండె, నరాల , కండరాల పనితీరును నియంత్రిస్తుంది. అంతేకాదు బీపీని తగ్గిస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
*కొబ్బరి చక్కెర పెద్ద పేగు క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది. మెటబాలిజం క్రమబద్దీకరించబడుతుంది.
* కొబ్బరి చక్కెరలో ఉండే విటమిన్ సి, నైట్రోజన్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. గుండె జబ్బులు రాకుండా చూస్తాయి.
*కొబ్బరి చక్కెరలో ఇనుము, జింక్ , కాల్షియం ఉన్నాయి. దీంతో కొబ్బరి చక్కెర తినడంవలన ఎముకలు బలపడతాయి. అంతేకాదు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది.
Also Read: బిపిన్ రావత్ మరణంపై ఓ వ్యక్తి సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు.. అరెస్ట్ చేసిన పోలీసులు..