ఇట్స్ అమేజింగ్.. మెట్లు ఎక్కడం వల్ల క్రియేటివ్‌గా ఆలోచిస్తారట.. తాజా సర్వేలో నమ్మలేని నిజాలు..
కాలం మారింది.. ఆధునిక యుగంలో సాంకేతికంగా అన్నీ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి.. శారీరక శ్రమకు బదులుగా స్మార్ట్‌గా ఆలోచిస్తున్నారు. మెట్లను ఎక్కడం కంటే లిఫ్ట్ లేదా ఎస్కలేటర్ లో వెళ్లడానికి చాలామంది ఇష్టపడుతుంటారు.. ఎస్కలేటర్, లిఫ్ట్ ఉపయోగించకుండా.. మెట్లు ఎక్కడం వల్ల ఎన్నో లాభాలున్నాయంటున్నారు వైద్య నిపుణులు..

కాలం మారింది.. ఆధునిక యుగంలో సాంకేతికంగా అన్నీ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి.. శారీరక శ్రమకు బదులుగా స్మార్ట్‌గా ఆలోచిస్తున్నారు. మెట్లను ఎక్కడం కంటే లిఫ్ట్ లేదా ఎస్కలేటర్ లో వెళ్లడానికి చాలామంది ఇష్టపడుతుంటారు.. ఎస్కలేటర్, లిఫ్ట్ ఉపయోగించకుండా.. మెట్లు ఎక్కడం వల్ల ఎన్నో లాభాలున్నాయంటున్నారు వైద్య నిపుణులు.. దీనికి సంబంధించి ఎన్నో పరిశోధనలు జరిగాయి.. అయితే, రోజుకు కొన్ని మెట్లు ఎక్కిన అది మన శరీరానికి, మనసుకు సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. రోజు మెట్లు ఎక్కి – దిగడం వల్ల గుండె ఆరోగ్యాన్ని, మెదడు శక్తిని మెరుగుపరుస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.. కొన్ని మెట్లు ఎక్కిన అది జ్ఞాపకశక్తితో పాటు క్రియేటివిటీ ఆలోచనలకు సహాయపడుతుందని తాజాగా మరో సర్వే రిపోర్ట్ వెల్లడించింది.
సీనియర్ సిటిజన్స్ మెట్లు ఎక్కితే అది వారి బ్యాలెన్స్, శరీర బలాన్ని మెరుగుపరచడంలో సహాయ పడుతుందని.. వారు పడిపోయే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని పరిశోధకులు అంటున్నారు. మెట్లు ఎక్కడం అనేది ఒక వ్యాయామం. చిన్నచిన్న కదలికలు కూడా గుండె, ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇంట్లో, ఆఫీసులలో ఇలా మెట్లు ప్రతిచోట ఉంటాయి. ప్రతిచోట లిఫ్ట్ తో పాటు ఎస్కలేటర్ కూడా ఉంటుంది.. కానీ మెట్లు ఎక్కడం – దిగడం చేస్తే మనకు చాలా ఈజీగా వ్యాయామాన్ని చేసినట్టు అవుతుంది.
ఇతర వ్యాయామాలు చేయడం కంటే మెట్లు ఎక్కడం వల్ల కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయని కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియాలో ఆరోగ్య పరిశోధకుడు అలెక్సిస్ తెలిపారు. మన శరీరాన్ని మెట్లను ఎక్కడం – దిగడం కోసం మాత్రమే ఉపయోగిస్తే.. ఒక గంట పాటు వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉండదని ఆయన తెలిపారు. వేగంగా నడవడంతో పోలిస్తే మెట్లు ఎక్కడం వల్ల హృదయ స్పందన రేటు పెరుగుతుంది. ఆక్సిజన్ ఎక్కువ వినియోగించేలా చేస్తుంది. ఎందుకంటే మెట్లు ఎక్కడ గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా పనిచేయడం అని అలెక్సిస్ తెలిపారు. ఇది ప్రధానంగా బాడీలోని కింది భాగానికి బాగా పనిచేస్తుంది. నడుము కింది భాగం బలంగా ఉంటే మంచి ఆరోగ్యానికి సంకేతమని ఆయన తెలిపారు. తొడ కండరాలు మెట్లు ఎక్కడం వల్ల కుచించక పోతాయి. కిందికి దిగితే కండరాలు సాగుతాయని వివరించారు.. దీనివల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు.
యంగ్ ఏజ్‌లో ఉన్నవారు మెట్లు ఎక్కిన తర్వాత అది వారి ఆలోచన నైపుణ్యాలను ఎలా ప్రభావితం చేస్తుందో స్వీడన్ లోని హోమియా వర్సిటీ సైకాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ ఆండ్రియాస్ బృందం పరిశీలించింది. మెట్లు ఎక్కడం వల్ల సామర్థ్యం మెరుగుపడుతుందని వారు కనుగొన్నారు. జపాన్‌లో జరిపిన మరో అధ్యయనంలో లిఫ్ట్ ఉపయోగించిన వారి కంటే రెండు మూడు ఫ్లోర్లు మెట్లు ఎక్కిన వ్యక్తులు.. వారి వారి అనారోగ్య సమస్యలను త్వరగా పరిష్కరించుకుంటారని తేలింది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




