Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కలోంజి గింజలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. కళ్లు బైర్లు కమ్మాల్సిందే..!

కలోంజి సీడ్స్‌ యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల నుండి రోగనిరోధక శక్తిని పెంచే, బరువు తగ్గించే మద్దతు వరకు ఆరోగ్య ప్రయోజనాలకు పవర్ హౌస్‌గా పిలుస్తారు.. ఈ చిన్న విత్తనాలను మీ రోజువారీ ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వల్ల మొత్తం ఆరోగ్యాన్ని, శ్రేయస్సును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కలోంజి దాని సహజ లక్షణాలకు ప్రసిద్ది చెందింది. కలోంజి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..

కలోంజి గింజలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. కళ్లు బైర్లు కమ్మాల్సిందే..!
Kalonji Seeds
Jyothi Gadda
|

Updated on: Jun 14, 2025 | 10:03 PM

Share

నల్ల జీలకర్ర దీనినే కలోంజి అని కూడా పిలుస్తారు. కలోంజి గింజలు వాటి ఔషధ లక్షణాల కోసం ఆయుర్వేదంలో శతాబ్దాలుగా ఉపయోగించబడుతున్నాయి. కలోంజి సీడ్స్‌ యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల నుండి రోగనిరోధక శక్తిని పెంచే, బరువు తగ్గించే మద్దతు వరకు ఆరోగ్య ప్రయోజనాలకు పవర్ హౌస్‌గా పిలుస్తారు.. ఈ చిన్న విత్తనాలను మీ రోజువారీ ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వల్ల మొత్తం ఆరోగ్యాన్ని, శ్రేయస్సును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కలోంజి దాని సహజ లక్షణాలకు ప్రసిద్ది చెందింది. కలోంజి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..

చర్మ సమస్యలకు ఇందులోని ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ గుణాలు చర్మ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. బరువు తగ్గడానికి ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు బరువు తగ్గడానికి దోహదం చేస్తాయి. థైరాయిడ్ కోసం వీటిని తినడం వల్ల టీఎస్ హెచ్, థైరాయిడ్ యాంటీబాడీస్ తగ్గుతాయి. కొలెస్ట్రాల్ కోసంకొలెస్ట్రాల్ ను తగ్గించడంలో కలోంజి సహాయపడుతుంది. క్యాన్సర్ తో పోరాడాలంటే.. కలోంజి రొమ్ము క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించగలదు.

కాలేయాన్ని కాపాడుకోవాలంటే.. కలోంజి శరీరంలోని హానికరమైన రసాయనాలను తగ్గించడానికి, కాలేయం దెబ్బతినకుండా రక్షించడానికి సహాయపడుతుంది. మీరు ఉదయమే కొంచెం లెమన్ గ్రాస్ టీ తీసుకోండి.. బరువు తగ్గడంతో పాటు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కలోంజి గింజలు జీవక్రియను పెంచడం, ఆకలిని తగ్గించడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడతాయి.

ఇవి కూడా చదవండి

(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..