AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Child Care: మీ పిల్లల చర్మం పొడిబారిపోతోందా? మరేం దిగులు పడకండి.. ఈ టిప్స్‌తో సంరక్షించండి..

చలికాలంలో పొడి చర్మం అనేది సహజం. ఈ సీజన్‌లో ఎక్కువ నీరు తాగలేకపోవడం వల్ల కూడా పొడి చర్మం సమస్య వస్తుంది. డీహైడ్రేట్ అయినప్పుడు చర్మం పొడిబారడం..

Child Care: మీ పిల్లల చర్మం పొడిబారిపోతోందా? మరేం దిగులు పడకండి.. ఈ టిప్స్‌తో సంరక్షించండి..
Child Care Tips
Shiva Prajapati
|

Updated on: Nov 06, 2022 | 6:21 AM

Share

చలికాలంలో పొడి చర్మం అనేది సహజం. ఈ సీజన్‌లో ఎక్కువ నీరు తాగలేకపోవడం వల్ల కూడా పొడి చర్మం సమస్య వస్తుంది. డీహైడ్రేట్ అయినప్పుడు చర్మం పొడిబారడం సర్వసాధారణం. అదే సమయంలో, పిల్లలలోనూ పొడి చర్మం సమస్య తీవ్రంగా ఉంటుంది. పిల్లలలో డ్రై స్కిన్ సమస్యను అధిగమించడానికి హోం రెమెడీస్ ను పాటించవచ్చు. ఈ చిట్కాలు అద్భుతంగా పని చేస్తాయి.

సున్నితమైన చర్మాన్ని ప్రభావితం చేస్తుంది..

పిల్లల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. అకస్మాత్తుగా వాతావరణం మారడం, హీటర్ లేదా ఏసీ ఎక్కువగా వాడటం, బిగుతుగా ఉన్న దుస్తులు ధరించడం లేదా నీటి కొరత కారణంగా డీహైడ్రేషన్‌కు గురికావడం వల్ల పిల్లల చర్మం పొడిబారుతుంది. పొడి చర్మం కారణంగా, అలెర్జీలు, చర్మం పొలుసులుగా మారడం, పెదవులు పగిలిపోవడం లేదా దురద వంటి సమస్యలు తలెత్తుతాయి.

పొడి చర్మాన్ని ఎలా నివారించాలి..

1. పొడి చర్మం నుండి మీ బిడ్డను రక్షించే చర్యల్లో భాగంగా ముందుగా వారు డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి. శరీరానికి అవసరమైన మొత్తంలో నీటిని తాపాలి. లేదంటే.. శిశువు చర్మం పొడిబారుతుంది.

ఇవి కూడా చదవండి

2. పిల్లల్లో పొడిబారిన చర్మం పోవాలంటే.. నూనెతో మసాజ్ చేయాలి. ఇది అద్భుతంగా పని చేస్తుంది.

3. మారుతున్న సీజన్లలో పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వేసవి లేదా శీతాకాలం ఏదైనా సరే.. హఠాత్తుగా మారుతున్న వాతావరణం పిల్లలపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. అందుకే వారిని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం.

4. మీ పిల్లలకు గోరువెచ్చని నీటితో మాత్రమే స్నానం చేయించాలి. అలాగే పిల్లలకు తాగడానికి గోరువెచ్చని నీరు ఇవ్వాలి. ఈ కారణంగా, పిల్లల శరీరంలో నీరు నిల్వ ఉంటుంది. చర్మం తేమగా ఉంటుంది.

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ అంచనాల మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు. పిల్లలకు సంబంధించి ఏదైన సమస్య తలెత్తితే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..