Monsoon Diet: వర్షాకాలం జ్వరాలు దరి చేరకూడదంటే ఈ చికెప్‌ సూప్‌ తీసుకోవాల్సిందే.. తయారీ విధానం చాలా సింపుల్‌..

Monsoon Diet: వర్షాకాలం వచ్చిందటే చాలు ఎక్కడలేని వ్యాధులు గుప్పుమంటాయి. ప్రస్తుతం కురుస్తోన్న వర్షాలకు ప్రతీ ఇంట్లో జ్వరాలతో బాధపడుతున్నారు. డెంగ్యూ, జలుబు, ఫ్లూ, వైరల్‌ ఫీవర్స్‌తో ఇబ్బందులు పడుతున్నారు. మారిని కాలంతో పాటు సీజనల్‌ వ్యాధులు రావడం సర్వసాధారణమే విషయం తెలిసిందే...

Monsoon Diet: వర్షాకాలం జ్వరాలు దరి చేరకూడదంటే ఈ చికెప్‌ సూప్‌ తీసుకోవాల్సిందే.. తయారీ విధానం చాలా సింపుల్‌..
Follow us

|

Updated on: Jul 31, 2022 | 7:46 PM

Monsoon Diet: వర్షాకాలం వచ్చిందటే చాలు ఎక్కడలేని వ్యాధులు గుప్పుమంటాయి. ప్రస్తుతం కురుస్తోన్న వర్షాలకు ప్రతీ ఇంట్లో జ్వరాలతో బాధపడుతున్నారు. డెంగ్యూ, జలుబు, ఫ్లూ, వైరల్‌ ఫీవర్స్‌తో ఇబ్బందులు పడుతున్నారు. మారిని కాలంతో పాటు సీజనల్‌ వ్యాధులు రావడం సర్వసాధారణమే విషయం తెలిసిందే. అయితే రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వారికి వ్యాధులు వెంటనే సోకుతాయి. అలా కాకుండా రెసిస్టెన్స్‌ పవర్‌ ఉన్నవారు వ్యాధుల నుంచి తప్పుకోవచ్చు. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి.

మరి వర్షాకాలం వాతావరణం చల్లాగా ఉన్న సమయంలో వేడి వేడి సూప్‌ తాగితే ఆ మజానే వేరు కదూ. అందులోనూ చికెన్‌ సూప్‌ అయితే లొట్టలోసుకోవడం ఖాయం. ఈ నేపథ్యంలోనే చికెన్‌, పసుపుతో తయారు చేసే సూప్‌ తయారీ విధానం స్టెప్‌ బై స్టెప్‌ ప్రాసెస్‌ మీకోసం..

* ఇందుకోసం ముందుగా ఒక ప్యాన్‌ తీసుకొని అందులో నూనె వేయాలి. అనంతరం మీకు నచ్చిన కొన్ని రకాల కూరగాయలను వేసి వేయించాలి. ఉదాహరణకు క్యారెట్, బీన్స్, ఉల్లిగడ్డ వంటి వాటిని యాడ్ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

* అనంతరం కూరగాయలు వేగిన తర్వాత నల్ల మిరియాలు, గరం మసాలా, రుచికి సరిపడ ఉప్పును జోడించాలి.

* తర్వాత చికెన్‌ను శుభ్రంగా కడిగిన తర్వాత 2 – 3 నిమిషాలు నీటిలో ఉడికించాలి.

* చికెన్‌లో కొన్ని కొబ్బరి పాలు పోసి మూతపెట్టి మరో 3 నిమిషాల పాటు మగ్గనివ్వాలి.

* చివరిగా చికెన్‌ ముక్కలను ఒకటిన్నర టీస్పూన్‌ పసుపు వేసి, సరిపడ నీళ్లు పోసి ఉడికించాలి.

* చివరిగా కొత్తమీర వేసి దించుకోవాలి. నచ్చితే నిమ్మకాయ రసం కూడా యాడ్ చేసుకోవచ్చు. అనంతరం వేవి వేడిగా తీసుకుంటే రుచితో పాటు ఆరోగ్యం సొంతమవుతుంది.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..