Health tips: జ్ఞాపకశక్తిని పెంచే సూపర్ ఫుడ్స్ ఇవి.. తింటే బ్రైయిన్ మరింత ఫాస్ట్ గా పనిచేస్తుంది..!
ఆహారంలో అన్ని పోషకాలతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారాలను చేర్చడం వలన మీ జ్ఞాపకశక్తిని బలోపేతం చేయడం, మీ మేధస్సును పదును పెట్టడంలో సహాయపడుతుంది.
Health tips: మనం ప్రతిరోజూ తినే ఆహారం (హెల్తీ ఫుడ్) మన ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. ఇది మన జ్ఞాపకశక్తి, తెలివితేటలను కూడా ప్రభావితం చేస్తుంది. చాలా మందికి కొన్ని విషయాలు గుర్తుండవు. వీరిలో కొందరికి మతిమరుపు ఉంటుంది.. కాబట్టి వారికి విషయాలు గుర్తుండవు. మరికొందరు తమ జ్ఞాపకశక్తిని పెంచుకోవాలని కోరుకుంటారు. శరీరానికి కావాల్సిన ఆహారంతో పాటు మెదడుకు కావాల్సిన ఆహారం కూడా చాలా ముఖ్యం. ఇందుకోసం పౌష్టికాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. మీ ఆహారంలో అన్ని పోషకాలతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారాలను చేర్చడం వలన మీ జ్ఞాపకశక్తిని బలోపేతం చేయడం, మీ మేధస్సును పదును పెట్టడంలో సహాయపడుతుంది. మీ రోజువారీ ఆహారంలో ఈ ఆహారాలను చేర్చుకోండి కొవ్వు చేపలు.. సాల్మన్, ట్యూనా, కాడ్ వంటి కొవ్వు చేపలు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలకు మంచి మూలాలు. ఒమేగా-3 జ్ఞాపకశక్తిని పదును పెట్టడంలో మానసిక స్థితిని మెరుగుపరచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మీ శరీరం ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలను ఉత్పత్తి చేయదు. కానీ ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు మెదడుకు ముఖ్యమైన పోషకాలు.
గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్.. లీఫీ వెజిటేబుల్స్ లో విటమిన్స్, ఐరన్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి, ఇవి శరీరంలోని పోషకాల లోపాన్ని భర్తీ చేస్తాయి. బచ్చలికూర, బ్రోకలీ, ఆకు కూరలు, ఎరుపు రంగు కూరగాయలు తెలివికి చాలా మేలు చేస్తాయి. వాటి వినియోగం మెదడుకు పదును పెట్టడంలో సహాయపడుతుంది.
గుడ్లు.. గుడ్లు తింటే మెదడు పదును పెడుతుందని చిన్నప్పటి నుంచి చెబుతుంటారు. కాబట్టి ప్రతిరోజూ కనీసం ఒక గుడ్డు తినడం అవసరం. మీరు ఏ రూపంలోనైనా గుడ్లు తినవచ్చు. గుడ్లలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఫోలేట్, కోలిన్, విటమిన్లు ఉంటాయి. కోలిన్ మెదడుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీని అధిక వినియోగం జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
గింజలు,నట్స్.. బాదం, వాల్‌నట్‌లు, ఎండుద్రాక్షలలో కాల్షియం, విటమిన్లు, శక్తి చాలా ఉన్నాయి. ఈ ఆహారాలను రోజూ నానబెట్టుకుని తినడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. గుమ్మడికాయను గింజలు, అనేక రకాల విత్తనాలు తినడం వల్ల మెదడుకు పదును పెడుతుంది. మీ తెలివికి పదును పెట్టడానికి ఇది ఉత్తమమైన ఆహారం.
సుగంధ ద్రవ్యాలు.. ఆయుర్వేద నివారణలలో పసుపు బాగా ప్రాచుర్యం పొందింది. పసుపులో కర్కుమిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది మెదడు కణాలకు మేలు చేస్తుంది.ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది కాకుండా అనేక గరం మసాలాలు కూడా మెదడుకు మంచివి. అనేక మూలికలు, సుగంధ ద్రవ్యాలు యాంటీఆక్సిడెంట్ల యొక్క మంచి మూలాలు మెదడు పనితీరును పెంచడంలో సహాయపడతాయి.
మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి