AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uric Acid Control Tips: యూరిక్ యాసిడ్‌తో బాధపడుతున్నారా.. ఇలాంటి తప్పు అస్సులు చేయకండి.. లేకుంటే సమస్య మరింత పెరుగుతుంది..

యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగడాన్ని తేలికగా తీసుకోకూడదు.. ఎందుకంటే ఇది పాదాలు, కీళ్లలో నొప్పిని పెంచుతుంది. అయినప్పటికీ జీవనశైలిలో మార్పులు చేయడం ద్వారా కూడా దీనిని తగ్గించవచ్చు.

Uric Acid Control Tips: యూరిక్ యాసిడ్‌తో బాధపడుతున్నారా.. ఇలాంటి తప్పు అస్సులు చేయకండి.. లేకుంటే సమస్య మరింత పెరుగుతుంది..
Uric Acid In Male And Femal
Sanjay Kasula
|

Updated on: Sep 19, 2022 | 9:04 PM

Share

ఈ మధ్యకాలంలో యూరిక్ యాసిడ్ సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మన రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయి చాలా ఎక్కువ అయినప్పుడు ఇటువంటి ఇబ్బంది బాగా పెరుగుతుంది. ఇది పాదాలు, కీళ్ళు, వేళ్లలో స్ఫటికాలు ఏర్పడటానికి దారితీస్తుంది. ఇది నొప్పి, వాపును పెంచుతుంది. శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగితే.. మీరు కొన్ని తప్పులు చేయకుండా ఉండటం చాలా ముఖ్యం. లేకపోతే సమస్య పెరిగిపోతుంది. ఎలాంటివాటికి దూరంగా ఉండాలో తెలుసుకుందాం..

యూరిక్ యాసిడ్ తగ్గించడం ఎలా?

1. బరువు పెరగవద్దు..

యూరిక్ యాసిడ్ మీ పెరుగుతున్న బరువుకు సంబంధించినది. కాబట్టి సమస్య పెరగకూడదని మీరు కోరుకుంటే.. బరువును అదుపులో ఉంచుకోండి. మీరు ఫిట్‌గా ఉంటే గౌట్ నొప్పి తగ్గుతుంది.

2. విటమిన్ సి లోపం..

రక్తంలో యూరిక్ యాసిడ్ పరిమాణం పెరగకూడదనుకుంటే.. విటమిన్ సి లోపం లేని ఆహారాన్ని ఖచ్చితంగా తినండి. ఈ పోషకం సహాయంతో.. యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గించవచ్చుకోవచ్చు. అందువల్ల, నారింజ, నిమ్మకాయలను ఖచ్చితంగా తినండి.

3. తీపి పదార్థాలకు దూరంగా..

మీరు స్వీట్లు, తీపి వంటకాలు లేదా తీపి పానీయాలు అధికంగా తీసుకుంటే మంచిది. స్వీట్స్ తీసుకుంటే యూరిక్ యాసిడ్ స్థాయి మరింత పెరుగుతుంది. గౌట్ ప్రమాదం పెరుగుతుంది. ఇందులో క్యాలరీలు ఎక్కువగా ఉండటం వల్ల ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు.

4. తక్కువ ప్యూరిన్ ఆహారాలు తినండి

యూరిక్ యాసిడ్ సమస్యను తగ్గించడానికి.. మీరు రోజువారీ ఆహారంలో అధిక ప్యూరిన్ కంటెంట్ ఉన్న ఆహారాలకు బదులుగా తక్కువ ప్యూరిన్ ఆహారాన్ని తినండి. దీని కోసం మీరు పాల ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలు తినండి. 

5. ఆల్కహాల్ కు నో చెప్పండి..

ఆల్కహాల్ ఆరోగ్యానికి హానికరం అని అందరికి తెలిసిన సంగతే.. అయినా చాలా మంది దానికి బనిసగా మారుతారు. ఇది శరీరంలోని అనేక భాగాలపై ప్రభావం చూపుతుంది. అయితే ఇది యూరిక్ యాసిడ్ స్థాయిని కూడా పెంచుతుందని చాలా తక్కువ మందికి తెలుసు, కాబట్టి ఇది చెడు, మీరు ఎంత త్వరగా ఆ అలవాటును వదిలేస్తారు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం