AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మల విసర్జనలో ఈ మార్పులు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు..! ఎందుకో తెలుసా..?

ప్రతి రోజూ జరిగే మల విసర్జన అలవాట్లను చాలా మంది పట్టించుకోరు. కానీ వాటిలో వచ్చే కొన్ని మార్పులు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు సంకేతాలు కావచ్చు. ముఖ్యంగా క్యాన్సర్ వంటి సమస్యలు ప్రారంభదశలో ఇదే రూపంలో కనిపించవచ్చు. అలాంటి లక్షణాలను ఎలా గుర్తించాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

మల విసర్జనలో ఈ మార్పులు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు..! ఎందుకో తెలుసా..?
Constipation Issues
Prashanthi V
|

Updated on: Aug 01, 2025 | 8:14 AM

Share

మన శరీరంలో వచ్చే కొన్ని చిన్న గుర్తులను మనం తరచూ పట్టించుకోము. ముఖ్యంగా మల విసర్జన అలవాట్లలో చిన్న మార్పులను మామూలుగా తీసుకోవడం సహజమే. అయితే అలాంటి మార్పులు కొన్నిసార్లు తీవ్రమైన జబ్బులకు గుర్తు కావచ్చు. కొన్నిసార్లు ఇవి క్యాన్సర్ లాంటి ప్రమాదకర ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయని చూపించవచ్చు.

ఈ రకమైన ఆరోగ్య గుర్తులను ముందుగానే గుర్తించడం వల్ల సరైన సమయంలో పరీక్షలు, చికిత్సలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మల విసర్జన అలవాట్లలో కనిపించే కొన్ని ముఖ్యమైన లక్షణాల గురించి తెలుసుకుందాం.

మలంలో రక్తం

మీరు మూత్ర విసర్జన చేసేటప్పుడు లేదా మల విసర్జన చేసేటప్పుడు రక్తాన్ని చూస్తే.. వెంటనే జాగ్రత్తగా ఉండాలి. ఇది మూత్రాశయం, కిడ్నీలు లేదా పెద్దప్రేగుల సమస్యలకు గుర్తు కావచ్చు. ముఖ్యంగా ఇది పెద్దప్రేగు క్యాన్సర్ లేదా కిడ్నీ జబ్బుల సూచన కావచ్చు.

రాత్రిళ్లు మూత్ర విసర్జన

మీరు రాత్రి సమయంలో చాలా సార్లు మల విసర్జన చేయాల్సి వస్తుందా..? ఇది వృద్ధులలో మామూలుగా కనిపించేదే అయినా.. ప్రోస్టేట్ లేదా మూత్రాశయ సంబంధిత క్యాన్సర్లకు కూడా ఇది గుర్తు కావచ్చు. ముఖ్యంగా పురుషులు ఈ లక్షణాన్ని గమనిస్తే.. వెంటనే డాక్టర్లను కలవడం అవసరం.

మల ఆకారంలో మార్పులు

మీ మలం ఆకారం పెన్సిల్ లాంటి సన్నని రూపంలో మారితే.. అది పేగులలో అడ్డుకుందని అనుకోవచ్చు. ఇది పెద్దప్రేగు క్యాన్సర్ లాంటి సమస్యలను సూచించే మొదట్లోని లక్షణం కావచ్చు. ఈ మార్పులు రోజూ ఉంటే తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి.

మలబద్ధకం లేదా విరేచనాలు

ఆహారంలో మార్పులు వచ్చినప్పుడు అప్పుడప్పుడు జీర్ణ సమస్యలు రావడం సహజమే. అయితే ఎక్కువ కాలంగా మలబద్ధకం లేదా విరేచనాలు ఉంటే వాటిని సీరియస్‌ గా తీసుకోవాలి. ఇది పెద్దప్రేగు లేదా ప్యాంక్రియాస్ క్యాన్సర్‌ కు సంబంధించి ఉండవచ్చు. ఈ లక్షణాలను పట్టించుకోకపోవడం ఆరోగ్యానికి ప్రమాదం కావచ్చు.

మల విసర్జన సమయంలో నొప్పి

మీరు మల విసర్జన సమయంలో నొప్పిని అనుభవిస్తున్నారా..? అది చిన్న ఇన్ఫెక్షన్ కాకపోవచ్చు. ఇది కిడ్నీలు, మూత్రనాళ సంబంధిత ఇన్ఫెక్షన్ లేదా క్యాన్సర్లకు గుర్తు కావచ్చు. అలాగే మల విసర్జన సమయంలో మళ్లీ మళ్లీ బాధగా అనిపించడం కూడా మలద్వారం దగ్గర క్యాన్సర్ సూచన కావచ్చు.

బరువు తగ్గడం

మల విసర్జన అలవాట్లలో మార్పులతో పాటు బరువు వేగంగా తగ్గుతుంటే.. దీని వెనుక కొన్ని తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా పెద్దప్రేగు, ప్యాంక్రియాస్ లేదా పొట్ట క్యాన్సర్ లాంటి సమస్యలకు ఇది గుర్తు కావచ్చు.

మలం పూర్తిగా పోలేదన్న భావన

మీరు మల విసర్జనకి వెళ్ళిన తర్వాత కూడా మలం పూర్తిగా రాలేదన్న భావన కలుగుతుందా..? దీన్ని టెనెస్మస్ అంటారు. ఇది గ్యాస్, కడుపు ఉబ్బరం వల్ల మాత్రమే కాదు.. మలద్వారం లేదా పేగు ప్రాంతాలలో క్యాన్సర్ వల్ల కూడా రావచ్చు. ఇది చాలా మంది పట్టించుకోని మామూలు సమస్యలా అనిపించినా.. దీని వెనుక తీవ్రమైన కారణం ఉండే అవకాశం ఉంది.

మన శరీరంలో వచ్చే గుర్తులను పట్టించుకోకుండా ఉండడం కన్నా.. వాటిని గమనించి ముందుగానే డాక్టర్ సలహా తీసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా మల విసర్జన అలవాట్లలో మార్పులు రోజూ కొనసాగుతున్నాయంటే.. ఇది చిన్న సమస్యగా తీసుకోవడం మంచిది కాదు.