AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మఖానా తింటే ఆరోగ్యానికి మంచిదని తెలుసు.. కానీ ఎవరూ తినకూడదో తెలుసా..?

మఖానా ఆరోగ్యానికి మేలు చేస్తుందని తెలిసినా.. ప్రతి ఒక్కరికీ ఇది ఉపయోగపడుతుందా అనే విషయంపై స్పష్టత అవసరం. ఇది తక్కువ కొవ్వుతో ఆరోగ్యకరమైన స్నాక్ అయినప్పటికీ.. కొన్ని ఆరోగ్య సమస్యలున్నవారు జాగ్రత్తగా తినాలి. మఖానా తినడంలో ఉండే అపాయాలు.. సరైన మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మఖానా తింటే ఆరోగ్యానికి మంచిదని తెలుసు.. కానీ ఎవరూ తినకూడదో తెలుసా..?
మఖానా తినడం వల్ల కొలెస్ట్రాల్ నియంత్రణలో సహాయపడుతుంది. మఖానాలో పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. రక్తపోటును నియంత్రిస్తాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మఖానాలో ఫ్లేవనాయిడ్లు, ఆల్కలాయిడ్లు కూడా ఉన్నాయి. ఇవి వాపును నియంత్రిస్తాయి. దీనికి క్యాన్సర్-నిరోధక లక్షణాలు కూడా ఉన్నాయి.
Prashanthi V
|

Updated on: Aug 01, 2025 | 8:11 AM

Share

మఖానా ఆరోగ్యానికి మేలు చేస్తాయని చాలా మంది నమ్ముతారు. ఇందులో తక్కువ కొవ్వు, మంచి ప్రోటీన్ ఉండడం వల్ల ఇది ఆరోగ్యకరమైన చిరుతిండిగా గుర్తింపు పొందింది. కొంత మంది పోషక నిపుణులు దీనిని సూపర్ ఫుడ్ అని కూడా అంటారు. అయితే ప్రతి ఒక్కరికీ ఇది మంచిదే అనుకోవడం తప్పు. మఖానా తినడంలో కొన్ని నియమాలు పాటించకపోతే కొన్ని సమస్యలను ఎదుర్కొనే ప్రమాదం ఉంది. ఇటీవల ఒక పోషక నిపుణురాలు దీని గురించి ముఖ్య సూచనలు చేసింది.

మలబద్ధకంతో బాధపడేవారు జాగ్రత్త

మఖానాలో ఫైబర్ తక్కువగా మాత్రమే ఉంటుంది. దీని వల్ల ఎప్పటికప్పుడు మలబద్ధకం సమస్యలు ఉన్నవారు దీనిని తరచూ తీసుకుంటే పరిస్థితి మరింత కష్టం కావచ్చు. పోషక నిపుణురాలు చెప్పినట్లు ఈ గింజలు ఫైబర్ తక్కువగా ఉండడం వల్ల మలబద్ధకాన్ని ఇంకా పెంచే అవకాశం ఉంది. కాబట్టి ఎలాంటి ఆరోగ్య సమస్య ఉన్నవారు మఖానాను తక్కువగా తినాలనేదాని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

పొటాషియం డైట్‌

మఖానాలో సహజంగా పొటాషియం ఎక్కువగా ఉంటుంది. కిడ్నీ సమస్యలతో బాధపడేవారు.. ముఖ్యంగా ఎక్కువ కాలం కిడ్నీ జబ్బు ఉన్నవారు తక్కువ పొటాషియం తీసుకోవాలి. అలాంటి వారు మఖానాను తింటే శరీరంలో పొటాషియం స్థాయిలు ప్రమాదకరంగా పెరగవచ్చు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మఖానా పూర్తిగా తినకూడని వాటిలో ఒకటిగా చూడాలి.

అధిక బరువు

మీరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నట్లయితే.. మఖానాను ఎక్కువగా తినడం మంచిది కాదు. 100 గ్రాముల మఖానా వరకూ ఓకే. కానీ అంతకంటే ఎక్కువ తింటే కేలరీలు ఎక్కువై బరువు తగ్గే లక్ష్యానికి అడ్డు పడవచ్చు. దీనికి కారణం.. మఖానాలో కొవ్వు తక్కువైనా, కార్బోహైడ్రేట్లు మాత్రం చాలా ఉంటాయి. కాబట్టి దీన్ని తక్కువగా అవసరమైనప్పుడు మాత్రమే తినడం మంచిది.

మూడు మంచి మార్గాలు

పైన చెప్పిన ఆరోగ్య సమస్యలు లేని వారు మఖానాను భద్రంగా తినవచ్చు. అయితే దానిని ఎలా తింటున్నాం అన్నది ముఖ్యం. మఖానాను ఆరోగ్యకరంగా తినాలంటే ఈ మూడు మార్గాలు బాగా సహాయపడతాయి.

  • కాల్చిన మసాలా మఖానా సలాడ్.. పాన్ లేదా ఎయిర్ ఫ్రైయర్‌లో మఖానాను వేపి కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి చల్లి తినవచ్చు. దీనిని క్యారెట్ తురుము, దానిమ్మ గింజలు, బాదం, వాల్‌నట్‌ లతో కలిపి పోషకమైన సలాడ్‌గా తయారు చేయవచ్చు. ఇది ప్రోటీన్, ఫైబర్ ఖనిజాలు ఎక్కువగా ఉన్న ఆరోగ్యకరమైన ఎంపిక.
  • మఖానా ఖీర్.. ఇది తీపి పదార్థం కావచ్చు. కానీ తక్కువగా తీసుకుంటే ఆరోగ్యకరంగా ఉంటుంది. తరిగిన మఖానాలను నెమ్మదిగా వేయించి పాలలో ఉడికించి, బాదం, ఖర్జూరం లేదా తక్కువ చక్కెరతో తీపి తక్కువ కేలరీల ఖీర్‌ గా తయారు చేయవచ్చు.
  • మఖానా కర్రీ.. ఈ కూర వేళ్ళతో తినేంత రుచిగా ఉంటుంది. ఉల్లిపాయ, టమాటా గ్రేవీలో సుగంధ ద్రవ్యాలతో మఖానాను వండితే మంచి ప్రధాన భోజనం అవుతుంది. ఇది రుచితో పాటు శక్తినిచ్చే ఆహారంగా ఉపయోగపడుతుంది.

కచ్చితంగా మఖానా ఒక ఆరోగ్యకరమైన ఆహారం. కానీ కొన్ని ప్రత్యేక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దీన్ని తక్కువగా తినాల్సిన అవసరం ఉంది. కొత్త కొత్త మార్గాల్లో మఖానాను తింటే ఇది ఆరోగ్యానికే కాదు.. రుచికి కూడా మేలు చేస్తుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)