Sleeping Problems: నిద్ర లేమితో ఇబ్బంది పడుతున్నారా? అయితే బరువు పెరుగుతారు జాగ్రత్త!
ప్రస్తుతం ఇప్పుడు చాలా మంది నిద్ర లేమి సమస్యతో బాధ పడుతున్నారు. నిద్ర అనేది మనిషికి చా లా ముఖ్యం. ఒక రోజు భోజనం చేయకపోయినా పర్వా లేదు కానీ.. నిద్ర పోక పోతే మాత్రం అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఒక మనిషి కంటిన్యూస్ గా 11 రోజులు నిద్రపోకపోతే చనిపోతారు. మీరే గమనించవచ్చు ఒక రోజు సరిగ్గా నిద్ర లేకపోతే.. తెల్లవారే సరికి అసలట, నీరసం, వాంతులు, వికారంగా ఉంటుంది. మన ఆరోగ్యంపై నిద్ర అంతలా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఒక మనిషి అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే నిద్రనే ముఖ్యం. అయితే ప్రస్తుతం పని ఒత్తిడిలో సరిగ్గా నిద్ర..

ప్రస్తుతం ఇప్పుడు చాలా మంది నిద్ర లేమి సమస్యతో బాధ పడుతున్నారు. నిద్ర అనేది మనిషికి చా లా ముఖ్యం. ఒక రోజు భోజనం చేయకపోయినా పర్వా లేదు కానీ.. నిద్ర పోక పోతే మాత్రం అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఒక మనిషి కంటిన్యూస్ గా 11 రోజులు నిద్రపోకపోతే చనిపోతారు. మీరే గమనించవచ్చు ఒక రోజు సరిగ్గా నిద్ర లేకపోతే.. తెల్లవారే సరికి అసలట, నీరసం, వాంతులు, వికారంగా ఉంటుంది. మన ఆరోగ్యంపై నిద్ర అంతలా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఒక మనిషి అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే నిద్రనే ముఖ్యం. అయితే ప్రస్తుతం పని ఒత్తిడిలో సరిగ్గా నిద్ర పోలేకపోతున్నారు. మరికొంత మంది వచ్చే నిద్రను ఆపుకుని కూడా టీవీలు చూడటం, సెల్ ఫోన్లు చూస్తూంటారు. ఇది కూడా చాలా ప్రమాదకరమని హెచ్చరించారు నిపుణులు. ఇది కాస్తా పలు దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీస్తుంది. ముఖ్యంగా నిద్ర లేమితో బాధ పడేవారు బరువు పెరుగుతారని నిపుణులు చెబుతున్నారు.
నిద్రకి – బరువు పెరగడానికి మధ్య కనెక్షన్ ఏంటంటే:
నిద్రపై లెక్కలేనన్ని పరిశోధనలు చేశారు నిపుణులు. ఈ క్రమంలోనే నిద్ర లేమి సమస్యలతో ఇబ్బంది పడేవారు బరువు పెరుగుతారని గుర్తించారు. శరీరానికి సరైనంత విశ్రాంతి లభించనప్పుడు.. అనేక మార్పులకు చోటు చేసుకుంటుంది. ఫలితంగా ఆకలి అనేది ఎక్కువ అవుతుంది. జంక్ ఫుడ్ తినాలని కోరికలు ఎక్కువ అవుతాయి. సరిగ్గా నిద్రపోకపోతే జీర్ణ క్రియ కూడా తగ్గుతుంది. దీంతో తిన్న ఆహారం జీర్ణం కాక.. బరువు పెరిగేందుకు కారణం అవుతుందని వెల్లడించారు.
హార్మోన్ల సమతుల్యత:
బాడీకి సరైనంత రెస్ట్ ఇవ్వకపోవడం వల్ల హార్మోన్లు ఇన్ బ్యాలెన్స్ అవుతాయి. తగినంత నిద్ర లేకపోవడం వల్ల లెఫ్టిన్ స్థాయిలు తగ్గి.. గ్రెలిన్ అనే హార్మోన్ల స్థాయిలు పెరుగుతాయి. ఇవి ఆకలిని ప్రేరేపిస్తాయి.
దీర్ఘకాలిక వ్యాధులు:
నిద్ర లేమి సమస్యతో బాధ పడేవారు బరువు పెరగడమే కాకుండా.. డయాబెటీస్, క్యాన్సర్, రక్త పోటు, గుండె జబ్బులు, థైరాయిడ్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఇమ్యూనిటీ తగ్గుతుంది:
సరైన విధంగా నిద్రపోకపోతే బాడీలో రోగ నిరోధక శక్తి అనేది తగ్గుతుంది. దీంతో అనారోగ్య సమస్యలతో పోరాడే శక్తి తగ్గుతుంది. అలాగే ఎముక, కీళ్ల సమస్యలు ఎక్కువ అవుతాయి.
డిప్రెషన్ కు దారితీసే అవకాశాలు:
మనిషికి సరైన విధంగా నిద్ర లేకపోతే విచారంగా, కోపంగా, బాధగా ఉంటుంది. దీంతో ఒత్తిడి, ఆందోళనకు గురవుతారట. ఇది కాస్తా డిప్రెషన్ కు దారి తీసే అవకాశాలు ఉన్నాయట. కాబట్టి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా నిద్రకు ప్రాధాన్యత ఇవ్వాలి అంటున్నారు నిపుణులు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.