AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lung Health: కరోనాతో మీ లంగ్స్ ఎఫెక్ట్ అయ్యాయా… అయితే వీటిని మీ డైట్ లో చేర్చితే..ఈజీగా రికవరీ అవుతారు..

కరోనావైరస్ యుగంలో ఆరోగ్యకరమైన ఊపిరితిత్తుల ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ తెలుసుకున్నారు. వైరస్‌లు ఊపిరితిత్తులపై దాడి చేయడంతో చాలా మంది ఆసుపత్రి పాలయ్యారు. అంతేకాదు ఊపిరితిత్తులు చాలా వీక్ అయ్యాయి.

Lung Health: కరోనాతో మీ లంగ్స్ ఎఫెక్ట్ అయ్యాయా... అయితే వీటిని మీ డైట్ లో చేర్చితే..ఈజీగా రికవరీ అవుతారు..
Lungs
Madhavi
| Edited By: |

Updated on: Mar 27, 2023 | 3:36 PM

Share

కరోనావైరస్ యుగంలో ఆరోగ్యకరమైన ఊపిరితిత్తుల ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ తెలుసుకున్నారు. వైరస్‌లు ఊపిరితిత్తులపై దాడి చేయడంతో చాలా మంది ఆసుపత్రి పాలయ్యారు. అంతేకాదు ఊపిరితిత్తులు చాలా వీక్ అయ్యాయి. అందుకే ఆరోగ్యకరమైన, బలమైన ఊపిరితిత్తుల కోసం ప్రతిరోజూ వ్యాయామం చేయాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. పెరుగుతున్న కాలుష్య సమస్య కారణంగా ఊపిరితిత్తులకు స్వచ్ఛమైన గాలి లభించడం లేదు , అవి బలహీనంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఊపిరితిత్తులను ఆరోగ్యంగా కాపాడుకోవాలంటే రన్నింగ్, శ్వాస వ్యాయామాలు, ఆరోగ్యకరమైన దినచర్య మొదలైనవి చాలా అవసరం. దీనితో పాటు, ఊపిరితిత్తుల మంచి ఆరోగ్యం కోసం, మీరు మీ ఆహారంపై కూడా శ్రద్ధ వహించాలి.

యాపిల్స్ ఎక్కువగా తినండి:

రోజూ ఒక యాపిల్ తీసుకోవడం ద్వారా, మీరు డాక్టర్‌ను దూరం చేయవచ్చు. ఆపిల్‌ను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా, అనేక వ్యాధుల బారిన పడకుండా శరీరాన్ని కాపాడుకోవచ్చు. యాపిల్ మీ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.దీనిలో ఉండే విటమిన్ ఎ, విటమిన్ సి , బీటా కెరోటిన్ శరీరానికి చాలా మేలు చేస్తాయి. ఇందులో పుష్కలంగా ఉండే యాంటీఆక్సిడెంట్లు ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.

ఇవి కూడా చదవండి

ఎర్రటి టమోటాలు తప్పనిసరిగా తినాలి:

టమోటాలు తినడం వల్ల ఊపిరి తిత్తులకు సంబంధిత వ్యాధులు దూరంగా ఉంటాయి. టమోటాలలో లభించే లైకోపీన్ ఊపిరితిత్తులకు మేలు చేసే మూలకంగా పరిగణిస్తారు. యాంటీఆక్సిడెంట్లు కెరోటినాయిడ్స్ లైకోపీన్ కలిగిన ఆహారాలలో పుష్కలంగా కనిపిస్తాయి ఎందుకంటే అవి ఊపిరితిత్తులను ఆరోగ్యంగా, బలంగా ఉంచడంలో ప్రభావవంతంగా ఉంటాయి.

వెల్లుల్లి ఉపయోగించండి:

రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో వెల్లుల్లిని తీసుకోవడం చాలా ప్రయోజనకరం అని చెప్పాలి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల ఊపిరితిత్తులకు ఎలాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. ఛాతీలో గడ్డకట్టిన కఫం క్లియర్ చేయడానికి వెల్లుల్లిని ప్రతిరోజూ తినమని ఆయుర్వేద నిపుణులు చెబుతుంటారు.

ఎండుద్రాక్షలు:

నీటిలో నానబెట్టిన ఎండుద్రాక్షలను తినడం వల్ల కూడా ఊపిరితిత్తులకు ఉపయోగకరంగా ఉంటుంది. ప్రతి రోజు ఎండుద్రాక్షలను తీసుకోవడం ద్వారా, మీరు మీ ఊపిరితిత్తులను ప్రమాదకరమైన వ్యాధుల నుండి దూరంగా ఉంచవచ్చు.

అలాగే బ్రోకలీ వంటి కూరల్లో ఉండే ఫోలేట్ కేర్టోనాయిడ్, ఫైటోకెమికల్స్, విటమిన్ సి ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్లు సోకకుండా కాపాడుతాయి. ఇవి ఊపిరితిత్తుల మెరుగైన ఆరోగ్యానికి అవసరమని డాక్టర్లు నమ్ముతారు. బ్రోకలీలో ఫైటోకెమికల్స్ ఉన్నాయి. బ్రోకలీలో ఉండే ఫైటోకెమికల్స్ శరీరం నుండి టాక్సిన్స్ తొలగించడంలో కూడా సహాయపడతాయి.

(గమనిక: పైన పేర్కొన్న సమాచారం నిపుణులు తెలిపిన, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు. ఏవైనా ఆరోగ్య సంబంధిత సమస్యలుంటే ముందుగా వైద్యులను సంప్రదించడం ఉత్తమం.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..