Yawning: విపరీతంగా ఆవలిస్తున్నారా.. ఈ వ్యాధులకు సంకేతం కావొచ్చు.. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం..
ఆవలించడం అనేది చాలా సాధారణ విషయం. ఆవలిస్తున్నప్పుడు మనం నోరు తెరిచి దీర్ఘంగా శ్వాస తీసుకుంటాం. ఆవలింత తరచుగా అలసట లేదా నిద్రపోవడంతో సంబంధం కలిగి ఉంటుంది. ఆవలించడానికి చాలా కారణాలు ఉండవచ్చు.

తరచుగా అలసిపోయినప్పుడు లేదా నిద్రపోతున్నప్పుడు ఆవలిస్తుంటాం. ఆవలించడం పూర్తిగా సాధారణం. ప్రతి వ్యక్తి ఒక రోజులో 5 నుంచి 19 సార్లు ఆవలిస్తుంటాడు. అయితే, స్లీప్ ఫౌండేషన్ ప్రకారం, రోజుకు 10 సార్లు కంటే ఎక్కువ ఆవలించే వారు చాలా మంది ఉన్నారంట. కొన్ని అధ్యయనాల ప్రకారం, రోజుకు 100 సార్లు ఆవలించే వారు చాలా మంది ఉన్నారంట. దీనికి ఒక సాధారణ కారణం నిర్దిష్ట సమయానికి ముందే మేల్కొలపడం. కొన్నిసార్లు అధిక ఆవలింత కూడా కొన్ని తీవ్రమైన వ్యాధిని సూచిస్తుంది. మెడికల్ న్యూస్ టుడే ప్రకారం, విపరీతంగా ఆవులించడం లేదా తరచుగా ఆవలించడం కూడా కొన్ని ఔషధాల దుష్ప్రభావం కావచ్చంట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
విపరీతంగా ఆవలింత రావడానికి ఇవే కారణాలు..
విపరీతమైన ఆవలింత కొన్నిసార్లు కొన్ని తీవ్రమైన అనారోగ్యం లేదా అసాధారణతలకు సంకేతం కావచ్చు. అటువంటి పరిస్థితిలో, మీరు కారణాలు తెలుసుకోవడం ముఖ్యం. ఇది అధిక పగటి నిద్రకు కారణమయ్యే అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా వంటి స్లీప్ డిజార్డర్‌కు సంకేతం కావచ్చు. మెటబాలిజానికి సంబంధించిన వ్యాధులకు అతిగా ఆవులించడం కూడా ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు.
నిద్ర లేకపోవడం- తరచుగా చాలా మందికి పగటిపూట ఎక్కువ నిద్ర వస్తుంది. దీని కారణంగా వారు అధిక ఆవలించే సమస్యను ఎదుర్కొంటారు. కొన్ని కారణాల వల్ల రాత్రి సమయంలో మీ నిద్ర పూర్తి కానప్పుడు ఇది సాధారణంగా జరుగుతుంది. రాత్రి నిద్ర లేకపోవడం వల్ల, మరుసటి రోజు మీరు బాగా అలసిపోయినట్లు అనిపిస్తుంది. అలాంటప్పుడు ఎక్కువగా ఆవులిస్తుంటారు.




మధుమేహం- ఆవలించడం అనేది హైపోగ్లైసీమియా ప్రారంభ సంకేతం. రక్తంలో తక్కువ గ్లూకోజ్ స్థాయి కారణంగా, ఆవలింత ప్రారంభమవుతుంది.
స్లీప్ అప్నియా- స్లీప్ అప్నియా ఉన్న రోగులు రాత్రి నిద్రపోయేటప్పుడు చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. దానివల్ల వారికి రాత్రి నిద్ర సరిగా పట్టదు. దానివల్ల మరుసటి రోజు బాగా అలసిపోయి ఆవులిస్తూనే ఉంటాడు. ఈ వ్యాధిలో శ్వాస రుగ్మత సమస్య ఉంది. స్లీప్ అప్నియాలో, నిద్రపోతున్నప్పుడు శ్వాస పదేపదే ఆగి కదులుతుంది. ప్రమాదకరమైన విషయం ఏమిటంటే, నిద్రలోనే శ్వాస ఆగిపోతుంది. వ్యక్తికి దాని గురించి కూడా తెలియదు.
నార్కోలెప్సీ- నార్కోలెప్సీ అనేది ఒక రకమైన నిద్ర సంబంధిత సమస్య. దీనిలో ఒక వ్యక్తి ఎప్పుడైనా, ఎక్కడైనా హఠాత్తుగా నిద్రపోవచ్చు. ఈ వ్యాధిలో, రోగి పగటిపూట చాలాసార్లు నిద్రపోతున్నట్లు అనిపిస్తుంది. దీని కారణంగా ఎక్కువగా ఆవలిస్తుంటారు.
నిద్రలేమి- నిద్రలేమి కూడా నిద్రకు సంబంధించిన వ్యాధి. ఈ వ్యాధిలో ఒక వ్యక్తికి రాత్రి నిద్ర రాదు లేదా ఒకసారి మేల్కొన్నట్లయితే మళ్లీ నిద్రపోవడం చాలా కష్టంగా మారుతుంది. రాత్రి నిద్ర లేకపోవడం వల్ల, ప్రజలు పగటిపూట ఎక్కువ నిద్రపోవడం చూడొచ్చు. దీని కారణంగా ఎక్కువగా ఆవలిస్తుంటారు.
గుండె జబ్బులు- విపరీతమైన ఆవలింతతో సంబంధం వాగస్ నరాల వల్ల కావచ్చు. ఇది మనస్సు నుంచి గుండె, కడుపుకు వెళుతుంది. కొన్ని పరిశోధనల ప్రకారం, అధిక ఆవలింత గుండె చుట్టూ రక్తస్రావం లేదా గుండెపోటు వచ్చే అవకాశాన్ని కూడా సూచిస్తుంది.
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
