AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes Tips: అన్నం తింటే బ్లడ్ షుగర్ పెరుగుతుందా..? తాజా పరిశోధనల్లో సరికొత్త విషయాలు..

మధుమేహ(Diabetes) వ్యాధిగ్రస్తుల సంఖ్య దేశంలో.. ప్రపంచంలో వేగంగా పెరుగుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం..

Diabetes Tips: అన్నం తింటే బ్లడ్ షుగర్ పెరుగుతుందా..? తాజా పరిశోధనల్లో సరికొత్త విషయాలు..
Eating White Rice
Sanjay Kasula
|

Updated on: Mar 14, 2022 | 2:07 PM

Share

మధుమేహ(Diabetes) వ్యాధిగ్రస్తుల సంఖ్య దేశంలో.. ప్రపంచంలో వేగంగా పెరుగుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, ఈ వ్యాధి భారతదేశంలో చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. దాని రోగుల సంఖ్య 50 మిలియన్లకు చేరుకుంది. సరికాని ఆహారం, సరైన జీవనశైలి కూడా మధుమేహానికి కారణంగా మారుతోంది. ఈ వ్యాధిగ్రస్తులు డైట్‌ను నియంత్రించుకోకపోతే.. వారి సమస్యలు రోజు రోజుకు పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డయాబెటిక్ పేషెంట్లు ఆహారంలో పిండి పదార్ధాలను తక్కువగా తీసుకోవాలి.. లేకుంటే వారికి సమస్యలు పెరుగుతాయి. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి, ఆహారంలో అలాంటి వాటిని తీసుకోవడం అవసరం. ఇది చక్కెరను నియంత్రణలో సహాయ పడుతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ ఆహారపు అలవాట్లను మెరుగుపరుచుకుంటే.. ఈ వ్యాధిని చాలా వరకు నియంత్రించవచ్చు.

మధుమేహ వ్యాధిగ్రస్తులు అన్నం తినాలా? షుగర్ పేషెంట్లు మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలంటే డైట్ నుంచి రైస్ మానేయాలని నిపుణులు చెబుతున్నారు. మీరు అన్నం తినాలనుకుంటే, కొన్ని ప్రత్యేకమైన బియ్యం తినండి. అన్నం తీసుకోవడం ఆరోగ్యానికి ఎంత హానికరమో, దానికి బదులు ఎలాంటి బియ్యాన్ని ఉపయోగించవచ్చో తెలుసుకుందాం.

అన్నం చక్కెరను ఎలా పెంచుతుంది? బ్రిటిష్ మెడికల్ జర్నల్ ప్రకారం.. వైట్ రైస్ టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది. బియ్యంలో అధిక గ్లైసెమిక్ సూచిక ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని వేగంగా పెంచడానికి కారణమవుతుంది. బియ్యంలో ఉండే అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ రక్తంలో చక్కెర స్థాయిని వేగంగా పెంచుతుంది. ఇందులో సూక్ష్మపోషకాలు, ఫైబర్, పాలీఫెనాల్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఇవి షుగర్ రోగులకు ప్రాణాంతకం.

షుగర్ పేషెంట్లు ఎంత అన్నం తీసుకోవాలి: షుగర్ పేషెంట్లు రోజుకు 45 నుండి 60 గ్రాముల కార్బోహైడ్రేట్ల మధ్య మాత్రమే తీసుకోవచ్చు. కానీ బియ్యంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటికి దూరంగా ఉండటం మంచిది. పాపులేషన్ హెల్త్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, హామిల్టన్ హెల్త్ సైన్సెస్ , కెనడాలోని మాక్‌మాస్టర్ యూనివర్శిటీ షుగర్‌ని పెంచే ఆహారాలపై పదేళ్లపాటు పరిశోధనలు నిర్వహించగా, దక్షిణాసియా వాసులు రోజుకు 630 గ్రాముల బియ్యం తింటారని, దీని వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఉందని తేలింది. అనేక రెట్లు పెరుగుతుంది.

బియ్యానికి బదులుగా ఏ ఆహారాలు తీసుకోవాలి: తెల్ల బియ్యం తెల్లగా.. మెరిసేలా చేయడానికి పాలిషింగ్ చేయబడుతుంది, ఇది అవసరమైన విటమిన్లు మరియు పోషకాలను తొలగిస్తుంది. మీరు అన్నం తినాలనుకుంటే బ్రౌన్ రైస్‌ను ఎంచుకోండి. బ్రౌన్ రైస్‌లో ఫైబర్, విటమిన్లు, మినరల్స్, న్యూట్రీషియన్స్ పుష్కలంగా ఉంటాయి, ఇవి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి.

బ్రౌన్ రైస్ లో స్టార్చ్ తక్కువగా ఉంటుంది . తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. షుగర్ రోగులు బ్రౌన్ రైస్ తినవచ్చు. ఇది కాకుండా, మీరు రోల్డ్, స్టీల్-కట్ వోట్స్, బార్లీ, బల్గర్, మిల్లెట్ , బుక్వీట్ యొక్క పిండిని ఉపయోగించవచ్చు.

ఇవి కూడా చదవండి: Telangana: మంత్రి కావాలన్న ఆయన కల కలేనా..? సీఎం కేసీఆర్ అనూహ్య నిర్ణయంతో శాస‌న మండ‌లి చైర్మన్‌గా మళ్లీ..