Health Tips: నోరు తెరిచి నిద్రపోతున్నారా.? ఈ వ్యాధులను రారమ్మన్నట్టే.. బీ కేర్‌ఫుల్.!
మనకి వివిధ రకాలుగా నిద్ర అలవాట్లు ఉంటాయి. కొంతమంది తల కింద ఎత్తైన పిల్లో పెట్టుకుని నిద్రపోతాం. మరికొందరు ఎలాంటి ఎత్తు అవసరం లేకుండా నిద్ర పోతారు. మరికొందరికి వాతావరణం ఎలా ఉన్నా దుప్పటి కప్పుకోకపోతే నిద్ర అసలు పట్టదు... ఇలా చాలా రకాలుగా చాలామందికి అలవాటు ఉంటుంది.

మనకి వివిధ రకాలుగా నిద్ర అలవాట్లు ఉంటాయి. కొంతమంది తల కింద ఎత్తైన పిల్లో పెట్టుకుని నిద్రపోతాం. మరికొందరు ఎలాంటి ఎత్తు అవసరం లేకుండా నిద్ర పోతారు. మరికొందరికి వాతావరణం ఎలా ఉన్నా దుప్పటి కప్పుకోకపోతే నిద్ర అసలు పట్టదు… ఇలా చాలా రకాలుగా చాలామందికి అలవాటు ఉంటుంది. అయితే నిద్ర లోకి వెళ్లిన తర్వాత కూడా మనకు తెలియకుండా కొన్ని పనులు చేస్తుంటాం. వీటిలో నోరు తెరుచుకొని నిద్రపోవడం ఒకటి. మరి నోరు తెరిచి నిద్రపోవడం దేనికి కారణం ఇదేమైనా ఆరోగ్య ప్రమాదాలకు కారణం అవుతుందా?
చాలాసార్లు శ్రమతో కూడిన లేదా బరువైన పనులు చేస్తున్నప్పుడు మనుషులకు ఎక్కువ ఆక్సిజన్ అవసరం అవుతుంది. దీనికోసం నోరు ముక్కు రెండిటికి ద్వారా గాలి పీలుస్తాం. పరిగెడుతున్నప్పుడు, ఆటలు ఆడేటప్పుడు మనుషులు నోటి ద్వారా గాలి పీల్చడం కనిపిస్తుంది. కానీ చాలామంది నిద్రపోతున్నప్పుడు నోరు తెరిచి నోటి ద్వారానే శ్వాస తీసుకుంటున్నారు. దీని వెనక అనేది కారణాలు ఉన్నాయి. నోరు తెరచి నిద్రపోవడం సాధారణమైన విషయమని ఇది ఏ వ్యాధికి సంకేతం కాదని నిపుణులు తెలిపారు.
ముక్కులో ఏదైనా సమస్య ఉన్న లేదా ముక్కు మూసుకుపోయిన నోటిని ఉపయోగించి శ్వాస తీసుకుంటారు అని వారు తెలుపుతున్నారు. అయితే నిద్రపోవడానికి సెప్టెంబర్ కార్టిలేజ్ కూడా ఒక కారణం అయి ఉండొచ్చు అని నిపుణుల అభిప్రాయం. ముక్కు నాలంలో ఒక ముఖ్యమైన భాగం సెప్టమ్. దీన్ని సెప్టెం కార్టిలేజ్ అంటారు. ఇది సహజంగా నీటర్ గా ఉండదు కొద్దిగా వంకరగా ఉంటుంది. ఎక్కువ వంకరగా ఉన్నప్పుడు నోటి ద్వారా శ్వాస తీసుకోవడం అవసరమవుతుంది. ఈ సమస్య తీవ్రమైతే సెప్టో ప్లాస్టి ఆపరేషన్ ద్వారా నయం చేయవచ్చని నిపుణులు అంటున్నారు. కానీ వ్యక్తి నిద్రపోతున్నప్పుడు నోరు తెరిచి ఉంచి పెద్ద శబ్దం చేస్తూ స్వాస తీసుకుంటున్న లేదా గురక పెడుతున్న వైద్యులను సంప్రదించడం మంచిదని నిపుణుల సలహా.




