Alcohol: మద్యం తాగితే పిల్లలు పుట్టరా.? ఇందులో నిజమెంత.. నిపుణులు ఏం చెప్పారంటే..
మద్యపానం, ఉరుకుల పరుగుల జీవితం యువతలో సంతాన సమస్యలకు కారణమవుతోంది. ఆర్ధిక ఇబ్బందులు, నిద్రలేమి ఒత్తిడిని పెంచి హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయి. సరైన నిద్ర, ఆరోగ్యకరమైన జీవనశైలి సంతానోత్పత్తి, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఆ వివరాలు ఇలా..

ఆడ, మగ అనే తేడా లేకుండా ఈ మధ్యకాలంలో ప్రతీ ఒక్కరూ మద్యం సేవించడం ఎక్కువైపోయింది. అయితే ఈ అలవాటు వారి జీవనశైలిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అయితే ఈ మద్యం పురుషులలో సంతానలేమికి(మెన్ ఇన్ఫెర్టిలిటీ), స్త్రీలలో పీసీఓడీ లాంటి సమస్యలకు ఒక ముఖ్య కారణమవుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కేవలం మద్యపానంతోనే ఇది జరుగుతోందని అనుకోవడం కరెక్ట్ కాదని.. మారిన హ్యాబిట్స్ కూడా దీనికి కారణమని అంటున్నారు. ఇటీవల యువత లేట్ నైట్ పార్టీలకు బాగా అలవాటుపడింది. పార్టీలు అర్ధరాత్రి ప్రారంభమై, తెల్లవారుజామున 2-3 గంటల వరకు కొనసాగుతున్నాయి. ఇది మెదడులో ఒత్తిడిని గణనీయంగా పెంచుతుంది. చాలామంది వీటిని రిలాక్సేషన్ అని భావించినప్పటికీ.. ఒక హానికరం అలవాటుగా మారి అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందన్నారు.
ఇది చదవండి: ‘ఒక్కపూట అన్నం పెట్టినందుకు.. నన్ను పెట్టి రూ. 3 కోట్ల సినిమా తీశాడు..’
ఒత్తిడి స్థాయిలను తగ్గించడానికి రాత్రి త్వరగా నిద్రపోవడం చాలా ముఖ్యం. చాలామంది నిర్లక్ష్యం చేసే విషయం ఏమిటంటే, సరైన నిద్ర శరీరంలో హార్మోన్ల సమతుల్యతను అదుపులో ఉంచుతుంది. ఇది ఒత్తిడిని తగ్గించి, శరీర కార్యకలాపాలను మెరుగుపరుస్తుంది. అవయవాల పనితీరును వృద్ధి చేస్తుంది. సంతానోత్పత్తి సమస్యలు కేవలం మద్యపానంపై మాత్రమే ఆధారపడి ఉండవు. వ్యక్తుల సాధారణ ఆరోగ్యం, రోగనిరోధక శక్తి, శరీరంలో పోషకాహార విలువలు, విటమిన్ లోపాలు లాంటి అనేక అంశాలు సంతాన రేటును ప్రభావితం చేస్తాయి. అలాగే, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు కూడా సంతానోత్పత్తిని దెబ్బతీసే అవకాశం ఉంది. ఇది తెలియగానే అవసరమైన చికిత్స అందించడం ద్వారా సంతానోత్పత్తి సమస్యలను పరిష్కరించవచ్చు.
మద్యపానానికి బానిసలైన వారికి రిహాబిలిటేషన్ సెంటర్లు ఎంతగానో సహాయపడతాయి. అయితే, కొంతమంది వ్యసనం నుంచి బయటపడలేక, విత్డ్రా సిండ్రోమ్‌తో బాధపడతారు. ఈ సమస్యను అధిగమించడానికి కుటుంబం మద్దతు చాలా అవసరం. కుటుంబ సభ్యుల నుంచి మద్దతుతో పాటు, సైకాలజిస్టుల సహాయం, సైకలాజికల్ మెడిసిన్స్ వాడటం, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ తీసుకోవడం, పరిస్థితులకు అనుగుణంగా మారే సామర్థ్యాన్ని పెంచుకోవడం లాంటివి దీర్ఘకాలిక సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సహాయపడతాయి.
ఇది చదవండి: సామాన్య వ్యక్తిని కూడా కోటీశ్వరుడిని చేయొచ్చు..! ఇది తెలిస్తే శాలరీ లేకపోయినా హ్యాపీగా బ్రతికేయొచ్చు
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.




