Constipation and IBS: పేగుల్లో గడబిడ, గందరగోళం.. ఇది మహిళల్లోనే అధికమట.. ఎందుకో తెలుసా?

పేగుల్లో గడబిడ, గందరగోళం, కడుపులో ఏదో జరుగుతున్న ఫీలింగ్. ఇది ఇర్రిటేటబుల్ బోవెల్ సిండ్రోమ్(ఐబీఎస్), మలబద్ధకం వల్ల వస్తుంది. ఇవి సాధారణంగా పురుషుల్లోనే అధికంగా చూస్తుంటాం. అయితే ఇటీవల యునైటెడ్ కింగ్ డమ్ లో చేసిన ఓ సర్వేలో ఈ వ్యాధులు మహిళల్లోనే ఎక్కువగా వస్తున్నట్లు గుర్తించింది.

Constipation and IBS: పేగుల్లో గడబిడ, గందరగోళం.. ఇది మహిళల్లోనే అధికమట.. ఎందుకో తెలుసా?
constipation in women
Follow us
Madhu

|

Updated on: Jul 01, 2023 | 6:19 PM

పేగుల్లో గడబిడ, గందరగోళం, కడుపులో ఏదో జరుగుతున్న ఫీలింగ్. ఇది ఇర్రిటేటబుల్ బోవెల్ సిండ్రోమ్(ఐబీఎస్), మలబద్ధకం వల్ల వస్తుంది. ఇవి సాధారణంగా పురుషుల్లోనే అధికంగా చూస్తుంటాం. అయితే ఇటీవల యునైటెడ్ కింగ్ డమ్ లో చేసిన ఓ సర్వేలో ఈ వ్యాధులు మహిళల్లోనే ఎక్కువగా వస్తున్నట్లు గుర్తించింది. దీనిలో వ్యాధిగల కారణాలను కనుగొనడంతో పాటు పరిష్కార మార్గాలు కనుగొనేందుకు పరిశోధన సాగించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

సర్వే ఇలా..

యునైటెడ్ కింగ్‌డమ్ లో 18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు ఈ సర్వేలో పాల్గొన్నారు. దాదాపు 142,768 మంది వ్యక్తులు పాల్గొన్నారు. వీరిలో110,627 మంది స్త్రీలు, 32,023 మంది పురుషులు,118 మంది ఇతరులు ఉన్నారు. ఈ సర్వే లో వారి వయస్సు, ఆహారం, జీవనశైలి, వారి ఆరోగ్య పరిస్థితులను గమనించి సర్వే నిర్వహించింది. ఈ సర్వే లో పురుషులు మలబద్ధకంతో 13% ఐబీఎస్ తో 10.1% మంది, ఆడవారిలో మలబద్ధకంతో 23%, ఐబీఎస్ తో 19.1% మంది బాధపడుతున్నారని తేలింది.

కారణాలు ఏంటి?

మలబద్దకం, ఐబీఎస్ రావడానికి ప్రధాన కారణాన్ని అన్వేషించడానికి వాటి బారిన పడిన వారి జీవనశైలిని అధ్యయనం చేశారు. అధిక కొవ్వు కలిగిన ఆహారం, శారీరక శ్రమలేని జీవన విధానం, ధూమపానం, మద్యం సేవించడం, కొన్ని రకాల మందులు తీసుకోవడం వంటి కారణాలు ఉన్నాయి. అలాగే అధిక బరువు లేదా ఊబకాయం కూడా ఈ మలబద్ధకం, ఐబీఎస్ కు కారణమని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మహిళల్లో ఎందుకు అధిక శాతం..

నిపుణుల అభిప్రాయం ప్రకారం పురుషుల్లో కన్నా మహిళల్లో ఈ రెండు ఇబ్బందులు అధికంగా ఉండటానికి కారణం వారి పేగుల్లో ఎక్కువ రవాణా సమయం ఉండటం నుంచి మహిళల్లో విడుదలయ్యే సెక్స్ హోర్మోన్లు వరకూ పేగు కదలికలను తక్కువ చేస్తాయని చెబుతున్నారు.

మలబద్ధకం తగ్గాలంటే ఏం చేయాలి..

మహిళల్లో మలబద్ధకం, ఐబీఎస్ ప్రమాదాన్ని తగ్గించడానికి, సమతుల్య ఆహారం తినడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ధూమపానం, అధిక మద్యపానాన్ని నివారించాలి. ఆరోగ్యకరమైన జీవనశైలిని నిర్వహించడం చాలా ముఖ్యం. మీ ఆహారంలో తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, గింజలు వంటి డైటరీ ఫైబర్‌ను చేర్చుకోవడం వల్ల ప్రేగు కదలికల క్రమబద్ధతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. పేగు ఆరోగ్యానికి తగినంత నీరు తీసుకోవడం కూడా చాలా అవసరం.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..