AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Garlic: వెల్లుల్లి తింటే మగవారికి సూపర్ బెనిఫిట్స్.. వీర్యం..

ఎక్కువ ప్రయోజనాలు పొందడానికి, వెల్లుల్లిని పచ్చిగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. పచ్చి వెల్లుల్లి తింటే.. శరీరంలో ఉంటే ఫ్రీ రాడికల్స్‌ తొలగుతాయి. వెల్లుల్లి లివర్‌ ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడంలో వెల్లుల్లి ప్రభావవంతంగా పనిచేస్తుంది. పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

Garlic: వెల్లుల్లి తింటే మగవారికి సూపర్ బెనిఫిట్స్.. వీర్యం..
Garlic
Ram Naramaneni
|

Updated on: Apr 05, 2024 | 6:30 PM

Share

వెల్లుల్లి అందరి వంటిళ్లలో ఎప్పుడూ కనిపించేదే. అది లేకుండా ఏ కర్రీ చేయరు. వెల్లుల్లిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని మనం తరచుగా వింటూ ఉంటాం. శరీరంలో కొలెస్ట్రాల్ క్లియర్ చేయడంలో వెల్లుల్లి బెస్ట్ అని చెబుతుంటారు. పచ్చి వెల్లుల్లిలో అల్లిసిన్‌ మన బాడీకి చాలా మేలు చేస్తుంది. మన పేగులో ఉండే మంచి బ్యాక్టీరియా పోషణకు ఇది చాలా అవసరమైనది. ఫాస్ఫరస్, జింక్, పొటాషియం, సల్ఫర్ కూడా వెల్లుల్లిలో లభిస్తాయి. అలానే వెల్లుల్లిలో యాంటీమైక్రోబయల్, యాంటీవైరల్, యాంటీఫంగల్ లక్షణాలు ఉంటాయి. పురీషనాళం, రొమ్ము, పెద్దపేగు, ప్రొస్టేట్ వంటి క్యాన్సర్లకు చెక్ పెట్టడంతో ఇది సాయపడుతుంది. అందుకే మీ ఆహారంలో వెల్లుల్లి ఉండేలా చూసుకోవడం కీలకం.

  • వెల్లుల్లి జలుబుని నివారిస్తుందని చాలా అధ్యయనాల్లో స్పష్టమైంది
  • ఇన్ఫెక్షన్ల నివారణకు వెల్లుల్లి ఉపయోగపడుతుంది
  • ఉదయం ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లి తిని, నీళ్లు తాగితే హైబీపీ లక్షణాలు తగ్గుతాయట
  •  వెల్లుల్లిలోని సమ్మేళనాలు కాలేయంలోని చెడు పదార్థాలను బయటకు పంపుతాయి
  •  వెల్లుల్లి మీ ఒత్తిడి స్థాయిలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది
  • రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో వెల్లుల్లి సాయపడుతుంది
  • ఇమ్యూనిటీ పెరగడాలంటే ఉదయాన్నే పచ్చి వెల్లుల్లిని నమలడం మంచిది
  • వెల్లుల్లి పురుషులలో శక్తిని పెంచుతుంది. వీర్యంలోని నాణ్యతను కూడా రక్షిస్తుంది.
  • వెల్లుల్లిలోని అల్లిసిన్ లైంగిక అవయవాలకు రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడంలో ఉపకరిస్తుంది.

(ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ స్టోరీ కేవలం మీ అవగాహన కోసమే)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి