AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FEATURED

సింగిల్-హెడ్ ఎంబ్రాయిడరీ మెషీన్‌ను పరిచయం చేసిన HSW.. ‘టర్బో 1.5’ ప్రత్యేకతలు ఇవే..

ఎంబ్రాయిడరీ వ్యాపారాలు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటున్న కొద్దీ, పెద్ద ఇండస్ట్రియల్ సెటప్ అవసరం లేకుండా వేగంగా పనిచేసే కుట్టు మెషీన్లకు మార్కెట్‌లో డిమాండ్ పెరుగుతోంది. ఈ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని HSW ‘టర్బో 1.5’ అనే కొత్త సింగిల్-హెడ్ ఎంబ్రాయిడరీ మెషీన్‌ను పరిచయం చేసింది. దీని ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం..

సింగిల్-హెడ్ ఎంబ్రాయిడరీ మెషీన్‌ను పరిచయం చేసిన HSW.. ‘టర్బో 1.5’ ప్రత్యేకతలు ఇవే..
HSW Turbo 1.5 Specifications
Shaik Madar Saheb
|

Updated on: Mar 26, 2026 | 5:06 PM

Share

ఎంబ్రాయిడరీ వ్యాపారాలు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటున్న కొద్దీ, పెద్ద ఇండస్ట్రియల్ సెటప్ అవసరం లేకుండా వేగంగా పనిచేసే కుట్టు మెషీన్లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని HSW ‘టర్బో 1.5’ అనే కొత్త సింగిల్-హెడ్ ఎంబ్రాయిడరీ మెషీన్‌ను పరిచయం చేసింది. ఇది నిమిషానికి 1500 RPM వరకు పనిచేసే సామర్థ్యంతో భారతదేశంలోనే అత్యంత వేగవంతమైన సింగిల్-హెడ్ ఎంబ్రాయిడరీ మెషీన్ గా పరిచయం చేశారు. ఈ మెషీన్‌ను బెంగళూరులో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో నటి ప్రణీత సుభాష్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఎంబ్రాయిడరీ రంగానికి చెందిన నిపుణులు, వ్యాపారులు, పరిశ్రమ భాగస్వాములు హాజరయ్యారు.

సింగిల్-హెడ్ ఎంబ్రాయిడరీ మెషీన్లు సాధారణంగా కస్టమైజ్డ్ గార్మెంట్స్ తయారీకి, చిన్న స్థాయి ఉత్పత్తి పనులకు విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి. బుటిక్ ఆర్డర్లు, ఫ్యాషన్ గార్మెంట్స్, వ్యక్తిగతీకరించిన టెక్స్టైల్ ఉత్పత్తులను తయారు చేసే వ్యాపారాల కోసం వేగవంతమైన ఉత్పత్తి సామర్థ్యం చాలా ముఖ్యమైనది. ఈ అవసరాలను దృష్టిలో పెట్టుకుని టర్బో 1.5 మెషీన్‌ను రూపొందించారు. అధిక వేగంతో పనిచేసే సామర్థ్యంతో పాటు కస్టమైజ్డ్ ఎంబ్రాయిడరీ పనులకు అవసరమైన సౌలభ్యాన్ని కూడా ఇది అందిస్తుంది.

హెచ్‌ఎస్‌డబ్ల్యూ టర్బో 1.5 ప్రత్యేకతలు (HSW Turbo 1.5 Specifications)..

• 10-ఇంచ్ టచ్ స్క్రీన్ కంప్యూటర్ సిస్టమ్

• 12 నీడిల్ కాన్ఫిగరేషన్

• గరిష్ట వేగం: 1500 RPM

• ఆటోమేటిక్ – మాన్యువల్ థ్రెడ్ ట్రిమ్మర్

• ఆటోమేటిక్ – మాన్యువల్ కలర్ చేంజ్

• పెద్ద ఎంబ్రాయిడరీ వర్కింగ్ ఏరియా

• టీ-షర్ట్లు, బ్లౌజులు, లెహంగా కాలి వర్క్‌కు అనుకూలం

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మెషీన్ డెమోలను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం పొందారు. అలాగే HSW బృందంతో మాట్లాడి తమ ఉత్పత్తి అవసరాలకు ఈ మెషీన్ ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకున్నారు.

HSW వ్యవస్థాపకుడు తపన్ కపాడియా (Tapan Kapadia) మాట్లాడుతూ, చిన్న స్థాయి సెటప్‌తోనే ఎంబ్రాయిడరీ వ్యాపారాన్ని ప్రారంభించి విస్తరించాలనుకునే వారి నుంచి డిమాండ్ పెరుగుతోందని తెలిపారు. “మా కస్టమర్లలో చాలా మంది ఒకే మెషీన్‌తో ప్రారంభించి, ఆర్డర్లు పెరిగే కొద్దీ తమ ఉత్పత్తిని విస్తరించుకుంటున్నారు.. వేగం, సౌలభ్యం కలిగిన మెషీన్లు చిన్న వ్యాపారాల అభివృద్ధికి మరింత సహాయపడతాయి.” అని ఆయన చెప్పారు.

గత దశాబ్దంలో HSW భారత్‌తో పాటు పలు అంతర్జాతీయ మార్కెట్లలో 6000 మందికి పైగా కస్టమర్లను సంపాదించింది. బుటిక్ యజమానులు, గార్మెంట్ తయారీదారులు, స్వతంత్ర ఎంబ్రాయిడరీ వ్యాపారులు ఈ కంపెనీ మెషీన్లను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.

వారిలో చాలా మంది తమ ఇళ్లలో లేదా చిన్న వర్క్‌షాప్‌లలోనే ఎంబ్రాయిడరీ యూనిట్లను నిర్వహిస్తూ బుటిక్‌లు, డిజైనర్లు, స్థానిక దుస్తుల వ్యాపారాలకు ఉత్పత్తులను సరఫరా చేస్తున్నారు. టర్బో 1.5తో పాటు HSW ఈ కార్యక్రమంలో మరో రెండు మెషీన్లను కూడా పరిచయం చేసింది. HSW 5G ప్లాట్‌ఫారమ్ ఆధారంగా రూపొందించిన Ultra మోడల్, నిరంతర ఉత్పత్తి పనులకు స్థిరమైన పనితీరును అందించేలా రూపొందించబడింది.

హెచ్‌ఎస్‌డబ్ల్యూ ఆల్ట్రా ప్రత్యేకతలు (HSW Ultra Specifications)

* 10-ఇంచ్ టచ్ స్క్రీన్ కంప్యూటర్ సిస్టమ్

* 12 నీడిల్ సెటప్

* గరిష్ట వేగం: 1200 RPM

* ఆటోమేటిక్ – మాన్యువల్ థ్రెడ్ ట్రిమ్మర్

* ఆటోమేటిక్ – మాన్యువల్ కలర్ చేంజ్

* గార్మెంట్స్ – కస్టమైజ్డ్ టెక్స్టైల్ పనులకు అనుకూలమైన పెద్ద ఎంబ్రాయిడరీ ఏరియా

కంపెనీ Neo అనే కాంపాక్ట్ సింగిల్-హెడ్ ఎంబ్రాయిడరీ మెషీన్‌ను కూడా పరిచయం చేసింది. ఇది చిన్న స్థాయి ఎంబ్రాయిడరీ యూనిట్లతోపాటు.. మొదటిసారి ఈ వ్యాపారంలోకి అడుగుపెడుతున్న వారికి అనుకూలంగా రూపొందించబడింది.

హెచ్‌ఎస్‌డబ్ల్యూ నియో ప్రత్యేకతలు (HSW Neo Specifications)

• 12-నీడిల్ ఎంబ్రాయిడరీ సిస్టమ్

• గరిష్ట వేగం: 1200 RPM

• చిన్న వర్క్‌స్పేస్‌లకు అనుకూలమైన కాంపాక్ట్ డిజైన్

• ఆటోమేటిక్ – మాన్యువల్ థ్రెడ్ ట్రిమ్మింగ్

• ఆటోమేటిక్, మాన్యువల్ కలర్ చేంజ్

• క్యాప్స్, టీ-షర్ట్లు, బ్లౌజులు, లెహంగా కాలి ఎంబ్రాయిడరీకి అనుకూలం

HSW కస్టమర్లకు ఆన్‌లైన్ ట్రైనింగ్, సర్వీస్ సపోర్ట్ కూడా అందిస్తోంది. దీని ద్వారా వినియోగదారులు మెషీన్ ఆపరేషన్, ఎంబ్రాయిడరీ టెక్నిక్స్‌ను రిమోట్‌గా నేర్చుకునే అవకాశం పొందుతున్నారు. టర్బో 1.5 ప్రారంభంతో, చిన్న, మధ్య స్థాయి ఎంబ్రాయిడరీ వ్యాపారాలకు వేగవంతమైన ఉత్పత్తి సామర్థ్యాన్ని అందించే దిశగా HSW మరో ముందడుగు వేయడంతోపాటు.. ఎన్నో ప్రత్యేకతలను అందిస్తోంది.

Follow Us
Disclaimer: ఇది స్పాన్సర్ చేయబడిన కథనం. ఇక్కడ ఉన్న సమాచారం, క్లెయిమ్‌లు పూర్తిగా ప్రకటనల కంపెనీకి చెందినవి. ఈ కథనంలోని కంటెంట్ లేదా క్లెయిమ్‌లకు tv9telugu.com బాధ్యత వహించదు. దయచేసి దాన్ని ఉపయోగించే ముందు మీ సొంత సమాచారాన్ని ధృవీకరించండి.
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న 'దివానా' మూవీ సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న 'దివానా' మూవీ సాంగ్..
శ్రీరామనవమి శుభాకాంక్షలు మీ స్నేహితులకు ఇలా పంపండి
శ్రీరామనవమి శుభాకాంక్షలు మీ స్నేహితులకు ఇలా పంపండి
ఇంట్లోని సిలిండర్‌లో గ్యాస్ ఎంత ఉందో సులభంగా తెలుసుకోవడం ఎలా.?
ఇంట్లోని సిలిండర్‌లో గ్యాస్ ఎంత ఉందో సులభంగా తెలుసుకోవడం ఎలా.?
హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. ఈ రూట్స్‌లో ట్రాఫిక్ మళ్లింపు
హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. ఈ రూట్స్‌లో ట్రాఫిక్ మళ్లింపు
అలర్ట్: పూజ గదిలో ఈ వస్తువు ఉంటే దురదృష్టం తప్పదు! వెంటనే..
అలర్ట్: పూజ గదిలో ఈ వస్తువు ఉంటే దురదృష్టం తప్పదు! వెంటనే..
ఏపీలో కొత్త పథకం.. ప్రతీ ఏడాది అకౌంట్లోకి రూ.2,400
ఏపీలో కొత్త పథకం.. ప్రతీ ఏడాది అకౌంట్లోకి రూ.2,400
గుంటూరు–విజయవాడ రూట్‌లో ట్రాఫిక్ డైవర్షన్
గుంటూరు–విజయవాడ రూట్‌లో ట్రాఫిక్ డైవర్షన్
సింగిల్-హెడ్ ఎంబ్రాయిడరీ మెషీన్‌ ‘టర్బో 1.5’ను పరిచయం చేసిన HSW..
సింగిల్-హెడ్ ఎంబ్రాయిడరీ మెషీన్‌ ‘టర్బో 1.5’ను పరిచయం చేసిన HSW..
ఈ ఫొటోలోని అమ్మాయిని గుర్తు పట్టారా? ఇప్పుడు తెలుగులో ఫేమస్ నటి..
ఈ ఫొటోలోని అమ్మాయిని గుర్తు పట్టారా? ఇప్పుడు తెలుగులో ఫేమస్ నటి..
డిమార్ట్ vsరిలయన్స్ మధ్యతరగతి వారి బడ్జెట్ షాపింగ్‌కు ఏది బెస్ట్?
డిమార్ట్ vsరిలయన్స్ మధ్యతరగతి వారి బడ్జెట్ షాపింగ్‌కు ఏది బెస్ట్?