AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRR OTT: మూవీ లవర్స్‌కు గుడ్‌న్యూస్‌ చెప్పిన జీ5.. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా చూడాలంటే..

RRR OTT: మొదట ట్రాన్సాక్షనల్‌ వీడియో ఆన్‌ డిమాండ్‌ (టీవీవోడీ) పద్ధతిలో ఆర్‌ఆర్‌ఆర్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు జీ5 తెలిపింది. అంటే సబ్‌స్ర్కైబర్లు కూడా ఈ మూవీని చూడాలంటే అదనంగా రూ. 100 చెల్లించాలి.

RRR OTT: మూవీ లవర్స్‌కు గుడ్‌న్యూస్‌ చెప్పిన జీ5.. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా చూడాలంటే..
Rrr
Basha Shek
|

Updated on: May 19, 2022 | 1:51 PM

Share

RRR OTT: మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ (Ramcharan), యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ (JR.NTR)లు హీరోలుగా నటించిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR). దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ పీరియాడికల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైన్‌లో బాలీవుడ్‌ బ్యూటీ అలియాభట్‌, హాలీవుడ్‌ ముద్దుగుమ్మ ఓలివియా మోరీస్‌, శ్రియాశరణ్‌, అజయ్‌ దేవ్‌గణ్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన వసూళ్ల వర్షం కురిపించింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.1100 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. కాగా నేటికీ థియేటర్లలో సందడి చేస్తోన్న ఈ చిత్రం మరికొన్ని గంటల్లో ఓటీటీలో అడుగుపెట్టనుంది. రేపు (మే 20) నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ జీ5లో స్ట్రీమింగ్‌ కానుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ వెర్షన్స్‌లోఈ సినిమా ప్రసారం కానుంది.

కాగా మొదట ట్రాన్సాక్షనల్‌ వీడియో ఆన్‌ డిమాండ్‌ (టీవీవోడీ) పద్ధతిలో ఆర్‌ఆర్‌ఆర్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు జీ5 తెలిపింది. అంటే సబ్‌స్ర్కైబర్లు కూడా ఈ మూవీని చూడాలంటే అదనంగా రూ. 100 చెల్లించాలి. అయితే ఈ నిర్ణయంపై సబ్‌స్ర్కైబర్లతో పాటు అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. దీంతో జీ5 వెనక్కి తగ్గింది. సబ్ సబ్‌స్ర్కైబర్లందరికీ ఈ సినమాను ఉచితంగా చూసేలా వెసులు బాటు కల్పించింది. తమ అధికారిక సోషల్‌ మీడియా ద్వారా తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

IPL 2022: ఒంటిచేత్తో అద్భుతమైన క్యాచ్‌ పట్టాడు.. కోల్‌కతాకు గుండెకోత మిగిల్చాడు..

Aadhi Pinisetty: పెళ్లిపీటలెక్కిన ప్రేమపక్షులు.. వేడుకగా ఆది, నిక్కీల వివాహం.. సందడి చేసిన టాలీవుడ్‌ హీరోలు..

Cannes Film Festival 2022: కేన్స్‌లో తళుక్కుమంటోన్న భారతీయ ముద్దుగుమ్మలు.. కళ్లు తిప్పుకోనివ్వని అందంతో..