‘సరిలేరు’ ఈవెంట్‌కు రాని ప్రకాశ్ రాజ్.. కారణమిదేనా..!
సినిమాలపై ప్రకాశ్ రాజ్ ఆసక్తిగా లేరా..? ఇప్పుడు ఇదే ప్రశ్న అందరిలో మెదులుతోంది. విలక్షణ నటుడిగా పేరొందిన ప్రకాశ్ రాజ్ డైరీ ఒకప్పుడు బిజీగా ఉండేది. పాత్ర ఏదైనా సరే దానికి ప్రకాశ్ రాజ్ తప్ప మరెవరు న్యాయం చేయలేరన్న గట్టి నమ్మకం అందరిలో ఉండేది. అందుకే అతడిని తమ సినిమాల్లో పెట్టుకునేందుకు స్టార్ దర్శకులు సైతం పోటీ పడేవారు. భాషలకు అతీతంగా ఆయన సంవత్సరానికి కనీసం పది చిత్రాల్లో నటించేవారు. ఒకానొక సంవత్సరంలో 23 సినిమాలు […]
సినిమాలపై ప్రకాశ్ రాజ్ ఆసక్తిగా లేరా..? ఇప్పుడు ఇదే ప్రశ్న అందరిలో మెదులుతోంది. విలక్షణ నటుడిగా పేరొందిన ప్రకాశ్ రాజ్ డైరీ ఒకప్పుడు బిజీగా ఉండేది. పాత్ర ఏదైనా సరే దానికి ప్రకాశ్ రాజ్ తప్ప మరెవరు న్యాయం చేయలేరన్న గట్టి నమ్మకం అందరిలో ఉండేది. అందుకే అతడిని తమ సినిమాల్లో పెట్టుకునేందుకు స్టార్ దర్శకులు సైతం పోటీ పడేవారు. భాషలకు అతీతంగా ఆయన సంవత్సరానికి కనీసం పది చిత్రాల్లో నటించేవారు. ఒకానొక సంవత్సరంలో 23 సినిమాలు కూడా చేశారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ప్రతి భాషలోనూ వైవిధ్య నటులు పుట్టుకొస్తున్నారు. ఎంతోమంది ప్రకాశ్ రాజ్‌కు ప్రత్యామ్నాయంగా తమ నటనతో ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయనకు అవకాశాలు సన్నగిల్లుతూ వచ్చాయి. అయితే మరోవైపు ఆయనే సినిమాలకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.
గత కొన్ని సంవత్సరాలుగా సామాజిక సమస్యలపై పోరాటం చేస్తూ వస్తోన్న ప్రకాశ్ రాజ్.. ఇప్పుడు రాజకీయాలపై దృష్టి పెట్టినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆ మధ్యన బెంగళూరు సౌత్ నుంచి ఎంపీగా కూడా పోటీ చేసి ఓడిపోయారు. అయినా అంతటితో తన పోరాటాన్ని ఆపలేదు. ఇప్పటికీ ట్విట్టర్ వేదికగా ప్రజా సమస్యలపై ప్రభుత్వాలను ప్రశ్నిస్తుంటారు ప్రకాశ్ రాజ్. ముఖ్యంగా పలు సమస్యలపై మోదీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఆయన తన ప్రశ్నలను సంధిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో సినిమాలను కేవలం పార్ట్ టైమ్‌గా మాత్రమే భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే సినిమాలను ఒప్పుకున్నా.. కేవలం అందులో నటించి మాత్రమే వెళుతున్నారు ప్రకాశ్ రాజ్. ఆ తరువాత ప్రమోషన్లలో ఆయన కనిపించడం లేదు. ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఆయన రాలేదన్న టాక్. అయితే ఇదొక్కటే కాదు గత కొన్నేళ్లుగా చాలా ప్రీ రిలీజ్ ఈవెంట్లకు ప్రకాశ్ రాజ్ గైర్హాజరయిన విషయం తెలిసిందే.