‘ఆర్ఆర్ఆర్’పై అసంతృప్తిగా ఉన్న కొరటాల.. ఎందుకంటే..!

ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా జక్కన్న తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా ఇప్పుడు కొరటాలకు తలనొప్పిని తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. అదేంటంటే..! ఈ మూవీ వలన కొరటాల, చిరంజీవి మూవీ విడుదల మరింత ఆలస్యం కానుందట. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల చేత అగ్రిమెంట్ తీసుకున్నారట రాజమౌళి. ఆ […]

'ఆర్ఆర్ఆర్'పై అసంతృప్తిగా ఉన్న కొరటాల.. ఎందుకంటే..!
TV9 Telugu Digital Desk

| Edited By:

Feb 12, 2020 | 8:32 PM

ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా జక్కన్న తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా ఇప్పుడు కొరటాలకు తలనొప్పిని తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. అదేంటంటే..! ఈ మూవీ వలన కొరటాల, చిరంజీవి మూవీ విడుదల మరింత ఆలస్యం కానుందట.

అయితే ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల చేత అగ్రిమెంట్ తీసుకున్నారట రాజమౌళి. ఆ అగ్రిమెంట్ ప్రకారం ఆర్ఆర్ఆర్ విడుదలయ్యే వరకు మరో సినిమాలో వీరు కనిపించకూడదట. ఇక చిరంజీవితో కొరటాల శివ తెరకెక్కిస్తోన్న చిత్రంలో చెర్రీ నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ మూవీలో ఫ్లాష్‌బ్యాగ్ ఎపిసోడ్‌లో చిరంజీవి కారెక్టర్‌లో చెర్రీ కనిపించబోతున్నారట. ఈ నేపథ్యంలో ఈ మూవీని ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకుడు అనుకున్నారట. అయితే ఆర్ఆర్ఆర్ అగ్రిమెంట్ నేపథ్యంలో ఈ మూవీని వచ్చే ఏడాది వేసవి వరకు ఆపాలనుకుంటున్నారట చిరంజీవి. దీంతో కొరటాల ఇబ్బంది పడుతున్నారట.

చిరు కోసం 2018లోనే స్క్రిప్ట్‌ను పూర్తి చేసుకున్న కొరటాల.. గతేడాదే సెట్స్ మీదకు తీసుకెళ్లాలని అనుకున్నారట. అయితే అది కాస్త వాయిదా పడుతూ వస్తూ ఈ ఏడాది మొదటికి వచ్చింది. ఇక ఇప్పుడు ఆగష్టులో ఈ సినిమాను పూర్తి చేసేందుకు కొరటాల రెడీగా ఉన్నారట. అయితే పూర్తి చేసినా.. ఆర్ఆర్ఆర్ విడుదలయ్యే వరకు ఆగాల్సి వస్తుండటంతో కొరటాలకు అది కాస్త ఇబ్బందిగా మారిందట. పోని ఈ లోపు మరో సినిమా చేద్దామనుకున్నా.. స్టార్ హీరోలందరూ బిజీగా ఉన్నారు. అందుకే చిరు సినిమాను నిదానంగానే పూర్తి చేద్దామని కొరటాల అనుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ మూవీలో చిరు సరసన త్రిష నటిస్తుంది. మ్యాట్నీ ఎంటర్‌టైనర్‌మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఆచార్య అనే టైటిల్‌ను ఈ మూవీ కోసం రిజిస్టర్ చేయించినట్లు సమాచారం.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu