ప్రభాస్ నిర్మాతల అసంతృప్తి…ఎందుకో తెలుసా..?

యూవీ క్రియేషన్స్..’బాహుబలి’ ప్రభాస్ హోం బ్యానర్. టాలీవుడ్‌లో పలు మంచి సినిమాలను తీసిన ఈ బ్యానర్ అధినేతలు ప్రమోద్, వంశీ..ఇటీవలే ‘సాహో’ చిత్రంతో నష్టాలను అందుకున్నారు. అదే ప్రభాస్‌తో హిట్ కొట్టి నష్టాలను క్లియర్ చేసుకోవడంతో పాటు మరో రెండు సినిమాలను నిర్మించేంత డబ్బును జేబులో వేసుకునేందుకు మరోసారి యంగ్ రెబల్ స్టార్‌తో సినిమాని ప్రారంభించారు. ప్రస్తుతం రాధాకృష్ణకుమార్ డైరెక్షన్‌లో ఓ రొమాంటిక్ మూవీలో నటిస్తున్నాడు ప్రభాస్. దీన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుంది. ఇటీవల ఈ మూవీ […]

ప్రభాస్ నిర్మాతల అసంతృప్తి...ఎందుకో తెలుసా..?
Ram Naramaneni

|

Feb 12, 2020 | 8:39 PM

యూవీ క్రియేషన్స్..’బాహుబలి’ ప్రభాస్ హోం బ్యానర్. టాలీవుడ్‌లో పలు మంచి సినిమాలను తీసిన ఈ బ్యానర్ అధినేతలు ప్రమోద్, వంశీ..ఇటీవలే ‘సాహో’ చిత్రంతో నష్టాలను అందుకున్నారు. అదే ప్రభాస్‌తో హిట్ కొట్టి నష్టాలను క్లియర్ చేసుకోవడంతో పాటు మరో రెండు సినిమాలను నిర్మించేంత డబ్బును జేబులో వేసుకునేందుకు మరోసారి యంగ్ రెబల్ స్టార్‌తో సినిమాని ప్రారంభించారు. ప్రస్తుతం రాధాకృష్ణకుమార్ డైరెక్షన్‌లో ఓ రొమాంటిక్ మూవీలో నటిస్తున్నాడు ప్రభాస్. దీన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుంది. ఇటీవల ఈ మూవీ షూటింగ్ పలుసార్లు వాయిదా పడటం చర్చలకు తావిచ్చింది. అవన్నీ సెట్ అయ్యి మళ్లీ తిరిగి ఆన్ సెట్స్‌పైకి వెళ్లడంతో అందరూ సంతోషించారు.

అయితే తాజాగా యూవీ క్రియేషన్స్ నిర్మాతలు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. తెల్లాపూర్ శివార్లలో ఆరు సెట్లకు పైగా నిర్మించి..వాటిని అన్నపూర్ణ స్టూడియోకు ప్లోర్‌కు తరలించారు నిర్మాతలు. అయితే ఈ విషయం మీడియాకు లీకవ్వడంతో వాటిపై కథనాలు వచ్చాయి. ఈ సెట్స్‌కి సినిమాలో మంచి ఇంపార్టెన్స్ ఉందట. అలాంటివి ఇలా ఈజీగా జనానికి తెలిసిపోతే ఆడియెన్స్ థ్రిల్ మిస్సవ్వుతారని నిర్మాతలు హైరానా పడుతున్నారట. ట్రైన్ సెట్, బోట్ సెట్‌తో పాటు యూరప్ వాతావరణాన్ని ప్రతిబింబించేలా సెట్స్ డిజైన్ చేసినట్టు యూనిట్ నుంచి సమాచారం అందుతోంది. అయినా ప్రస్తుత కంప్యూటర్ యుగంలో చిన్న గుండు పిన్ను కదిలిస్తేనే తెలిసిపోతుంది. అలాంటిది అంత పెద్ద సెట్స్ తరలిస్తుంటే తెలియకుండా ఎలా ఉంటుంది బాసూ..!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu