‘అర్జున్ రెడ్డి’కి త్రిబుల్ ధమాకా.. కన్నడంలో కూడా…

విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘అర్జున్ రెడ్డి’. ఈ సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇక ఈ చిత్రం హిందీ, తమిళ భాషల్లో రీమేక్ అయిన సంగతి తెలిసిందే. తమిళంలో ‘ఆదిత్య వర్మ’ పేరుతో రీమేక్ అవుతున్న ఈ చిత్రం హిందీలో ‘కబీర్ సింగ్’ పేరుతో రూపొందింది. ఇక రీసెంట్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘కబీర్ సింగ్’ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇది […]

'అర్జున్ రెడ్డి'కి త్రిబుల్ ధమాకా.. కన్నడంలో కూడా...
Follow us
Ravi Kiran

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 26, 2019 | 3:51 PM

విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘అర్జున్ రెడ్డి’. ఈ సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇక ఈ చిత్రం హిందీ, తమిళ భాషల్లో రీమేక్ అయిన సంగతి తెలిసిందే. తమిళంలో ‘ఆదిత్య వర్మ’ పేరుతో రీమేక్ అవుతున్న ఈ చిత్రం హిందీలో ‘కబీర్ సింగ్’ పేరుతో రూపొందింది. ఇక రీసెంట్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘కబీర్ సింగ్’ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది.

ఇది ఇలా ఉండగా ఇప్పుడు ‘అర్జున్ రెడ్డి’ని కన్నడంలో రీమేక్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారట. ప్రముఖ కన్నడ నిర్మాత ఎస్. నారాయణ్ ‘అర్జున్ రెడ్డి’ కన్నడ రీమేక్ రైట్స్‌ను దక్కించుకోగా.. ఈ ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.