సెన్సార్ పూర్తి చేసుకున్న ‘కల్కి’
సీనియర్ హీరో రాజశేఖర్ ప్రధాన పాత్రలో దర్శకుడు ప్రశాంత్ వర్మ రూపొందించిన చిత్రం ‘కల్కి’. ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికెట్ పొందింది. తాజాగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచిందన్న టాక్ వినిపిస్తోంది. 80వ దశకం తెలంగాణలోని కొల్లాపూర్‌లో జరిగిన కొన్ని వాస్తవిక కథనాల ఇతివృత్తంగా ఈ సినిమా తెరకెక్కింది. ఆదా శర్మ, నందితా శ్వేతా, పూజితా పొన్నాడ, స్కార్లెట్ విల్సన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ […]
సీనియర్ హీరో రాజశేఖర్ ప్రధాన పాత్రలో దర్శకుడు ప్రశాంత్ వర్మ రూపొందించిన చిత్రం ‘కల్కి’. ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికెట్ పొందింది. తాజాగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచిందన్న టాక్ వినిపిస్తోంది.
80వ దశకం తెలంగాణలోని కొల్లాపూర్‌లో జరిగిన కొన్ని వాస్తవిక కథనాల ఇతివృత్తంగా ఈ సినిమా తెరకెక్కింది. ఆదా శర్మ, నందితా శ్వేతా, పూజితా పొన్నాడ, స్కార్లెట్ విల్సన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా జూన్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.