చెన్నై ‘నీటి ఎద్దడి’పై గళమెత్తిన ‘టైటానిక్’ హీరో

నీటి ఎద్దడితో తమిళనాడు రాజధాని చెన్నై నగరం అల్లాడుతోన్న విషయం తెలిసిందే. చెన్నైకి నీరందించే నాలుగు ప్రధాన రిజర్వాయర్లతో పాటు భూగర్భ జలాలు కూడా అడుగంటడంతో నగరవాసులు గత కొన్ని రోజులుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీస అవసరాలకు పక్కనపెడితే తాగేందుకు కూడా కొందరికి నీరు దొరకడం లేదు. దీంతో స్కూళ్లు, ప్రముఖ హోటళ్లు కొన్ని మూతపడ్డాయి. అలాగే ఐటీ కార్యాలయాలు సైతం తమ సంస్థల నుంచి క్యాంటిన్లను రద్దు చేశారు. కొందరైతే ఎంప్లాయిస్‌కు ‘వర్క్ ఫ్రమ్ […]

చెన్నై ‘నీటి ఎద్దడి’పై గళమెత్తిన ‘టైటానిక్’ హీరో
Follow us

| Edited By:

Updated on: Jun 26, 2019 | 2:42 PM

నీటి ఎద్దడితో తమిళనాడు రాజధాని చెన్నై నగరం అల్లాడుతోన్న విషయం తెలిసిందే. చెన్నైకి నీరందించే నాలుగు ప్రధాన రిజర్వాయర్లతో పాటు భూగర్భ జలాలు కూడా అడుగంటడంతో నగరవాసులు గత కొన్ని రోజులుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీస అవసరాలకు పక్కనపెడితే తాగేందుకు కూడా కొందరికి నీరు దొరకడం లేదు. దీంతో స్కూళ్లు, ప్రముఖ హోటళ్లు కొన్ని మూతపడ్డాయి. అలాగే ఐటీ కార్యాలయాలు సైతం తమ సంస్థల నుంచి క్యాంటిన్లను రద్దు చేశారు. కొందరైతే ఎంప్లాయిస్‌కు ‘వర్క్ ఫ్రమ్ హోమ్‌’ ఆఫ్షన్‌ను ఇచ్చారు. ఇక ఈ పరిస్థితిపై ఇప్పటికైనా అందరూ మేలుకోకపోతే రానున్న సంవత్సరాలు మరింత నీటి ఎద్దడిని ఎదుర్కోవాల్సి వస్తుందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో చెన్నై నీటి ఎద్దడిపై ప్రముఖ హాలీవుడ్ నటుడు లియోనార్డో డికాప్రియో కూడా సోషల్ మీడియాలో స్పందించారు.

‘‘చెన్నై ప్రస్తుత పరిస్థితులను వర్షం ఒక్కటే కాపాడగలదు. బావులన్నీ ఎండిపోయాయి. నగరానికి నీరందించే నాలుగు ప్రధాన రిజర్వాయర్లు ఎండిపోవడంతో చెన్నై నగరం తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. గవర్నమెంట్ నీటి ట్యాంకుల నుంచి నీటిని పొందేందుకు అక్కడి ప్రజలు గంటలు గంటలుగా ఎదురుచూస్తున్నారు. నీరు లేకపోవడంతో అక్కడి హోటళ్లు, రెస్టారెంట్లు పాక్షికంగా మూతపడ్డాయి. అక్కడి అధికారులు నీటి కోసం ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతున్నారు. అక్కడి వారు వాన కోసం ప్రార్థనలు చేస్తున్నారు. ప్రపంచాన్ని మనమే మార్చాలి’’ అని కామెంట్ చేశారు. కాగా ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులపై పలు డాక్యుమెంటరీలలో సైతం నటించిన లియోనార్డో.. ఐక్యరాజ్య సమితిలోనూ దీనిపై గళం విప్పిన విషయం తెలిసిందే.

https://www.instagram.com/p/BzJYT-XF3cK/

Latest Articles