పీవీ సింధు హోటల్ బిల్లు కట్టిన హీరో
భారత్ బాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకి సర్‌ప్రైజ్ చేశాడు హీరో మంచు విష్ణు. యూఎస్ కౌన్సిల్ జనరల్ క్యాథరిన్ హడ్డా తో కలిసి ఓ ప్రముఖ హోటల్‌కి వెళ్లింది సింధు. అయితే వారి బిల్లును ఆమెకు తెలియకుండానే చెల్లించి ఆశ్చర్యపరిచాడు. పీవీ సింధు వెళ్లిన హోటల్‌కే హీరో విష్ణు కూడా వెళ్లాడు. ఈ విషయాన్ని స్వయంగా పీవీ సింధు తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేసింది. హీరో మంచు విష్ణుని కలవడం ఎంతో ఆనందంగా ఉందని, […]

భారత్ బాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకి సర్‌ప్రైజ్ చేశాడు హీరో మంచు విష్ణు. యూఎస్ కౌన్సిల్ జనరల్ క్యాథరిన్ హడ్డా తో కలిసి ఓ ప్రముఖ హోటల్‌కి వెళ్లింది సింధు. అయితే వారి బిల్లును ఆమెకు తెలియకుండానే చెల్లించి ఆశ్చర్యపరిచాడు. పీవీ సింధు వెళ్లిన హోటల్‌కే హీరో విష్ణు కూడా వెళ్లాడు. ఈ విషయాన్ని స్వయంగా పీవీ సింధు తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేసింది. హీరో మంచు విష్ణుని కలవడం ఎంతో ఆనందంగా ఉందని, మా బిల్ చెల్లించినందుకు మీకు కృతఙ్ఞతలు అని ట్విట్టర్‌లో స్పందించింది సింధు. దీనికి మంచు విష్ణు కూడా బదులిచ్చాడు. మీలాంటి లవ్లీ లేడీస్ లంచ్ బిల్ చెల్లించడం మా అదృష్టంగా భావిస్తున్నాం, ఐనా ఆడవారి చేత బిల్ కట్టించడం పురుష లక్షణం కాదు, సింధు నువ్వు చాలా పొడగరి అని ట్వీట్ చేశాడు.