మైఖేల్ జాక్సన్ అభిమానులూ ! పూరీ ఇస్తున్నాడో బంపరాఫర్ !
పాప్ స్టార్ మైఖేల్ జాక్సన్ తన పాప్ గీతాలతో ప్రపంచాన్నే ఉర్రూతలూగించాడు. నలభై ఏళ్లకు పైగా సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న జాక్సన్ 1970 ప్రాంతంలో పాప్ మ్యూజిక్ కి రారాజే అయ్యాడు. ఇంతటి పాప్ స్టార్ 2009 జూన్ 25 న మరణించాడు. నిన్నటితో ఆయన కన్నుమూసి పదేళ్లు అయింది. ఈ సందర్భంగా ఆయనకు బిగ్ ఫ్యాన్ అయిన సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. ఆయన అభిమానులకు బంపరాఫర్ ఇచ్చాడు. మైఖేల్ కి […]
పాప్ స్టార్ మైఖేల్ జాక్సన్ తన పాప్ గీతాలతో ప్రపంచాన్నే ఉర్రూతలూగించాడు. నలభై ఏళ్లకు పైగా సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న జాక్సన్ 1970 ప్రాంతంలో పాప్ మ్యూజిక్ కి రారాజే అయ్యాడు. ఇంతటి పాప్ స్టార్ 2009 జూన్ 25 న మరణించాడు. నిన్నటితో ఆయన కన్నుమూసి పదేళ్లు అయింది. ఈ సందర్భంగా ఆయనకు బిగ్ ఫ్యాన్ అయిన సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. ఆయన అభిమానులకు బంపరాఫర్ ఇచ్చాడు. మైఖేల్ కి తాను వీరాభిమానినంటూ.. అతని వర్ధంతి సందర్భంగా ఆయన అభిమానులందరినీ ట్విట్టర్లో ఫాలో అవుతానని ప్రకటించాడు. అయితే నెటిజన్లు తన ట్వీట్ ని రీ-ట్వీట్ చేస్తే చాలని పూరీ పేర్కొన్నాడు. ఈ డైరెక్టర్ వింత ‘ అభిమానం ‘ నెటిజన్లను కట్టి పడేస్తోంది. అటు-మైఖేల్ జాక్సన్ వర్ధంతిని పురస్కరించుకుని అతనికి నివాళినిచ్చాయి పలు అభిమాన సంఘాలు.