AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vishwak Sen: అలరిస్తోన్న గోదావరి అల్లుడు.. విశ్వక్ సేన్ కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్..

మాస్‌ కథలతో పాటు వైవిధ్యమైన సినిమాలు ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటున్నాడు విశ్వక్‌సేన్‌ (Vishwak Sen).

Vishwak Sen: అలరిస్తోన్న గోదావరి అల్లుడు.. విశ్వక్ సేన్ కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్..
Basha Shek
|

Updated on: Feb 02, 2022 | 1:08 PM

Share

మాస్‌ కథలతో పాటు వైవిధ్యమైన సినిమాలు ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటున్నాడు విశ్వక్‌సేన్‌ (Vishwak Sen). 2017లో ‘వెళ్లిపోమాకే’ అంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ హీరో ‘ఈ నగరానికి ఏమైంది’, ‘ఫలక్‌నుమా దాస్‌’ సినిమాలతో మంచి క్రేజ్‌ తెచ్చుకున్నాడు. ఆతర్వాత ‘హిట్‌: ది ఫస్ట్‌ కేస్‌’ తో తనలోని అసలైన నటుడిని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ‘పాగల్‌’ (Pagal) సినిమాతో యువతను ఆకట్టుకున్న విశ్వక్‌.. ప్రస్తుతం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ Ashoka Vanamlo Arjuna kalynam) అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్, సాంగ్ కూడా రిలీజ్ అయి ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇటీవల ‘ఓ ఆడపిల్లా’ పాటతో  ​ రుక్సార్​ దిల్లాన్ ను సినిమా హీరోయిన్ గా పరిచయం చేశారు దర్శక నిర్మాతలు. తాజాగా ఈ సినిమా టీజర్ తో పాటు విడుదల తేదీని కూడా ఖరారు చేశారు.

కాగా  ‘ఇంటర్​క్యాస్ట్​ అరేంజ్డ్  మ్యారెజ్ సినిమాల్లో అయినా అయితాదిరా’ అంటూ ప్రారంభమైన ఈ సినిమా టీజర్​ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది.  వయసు పెరిగిపోయిన అబ్బాయికి పెళ్లి కుదిరితే, అది కూడా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ సెట్ అయితే ఎలాంటి పరిస్థితులు  ఎదుర్కొన్నాడు.. ఆ అమ్మాయితో ఎలా ఉన్నాడు అనే కథాంశానికి కామెడీని జోడించి ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు టీజర్  చివరలో ఎమోషనల్ సీన్లు కూడా ఆకట్టుకుంటున్నాయి. ‘తాగితే గానీ మా బతుకులకు ఏడుపు రాదు.. తాగినోడి ఏడుపుకు విలువ లేదు’ అంటూ విశ్వక్ చెప్పిన డైలాగులు బాగా పేలాయి.  కాగా రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి విద్యా సాగర్ చింతా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ సమర్పణలో ఆయన తనయుడు బాపినీడు సుధీర్ ఈదరతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా మార్చి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read:Amritha Aiyer: హ్యాకర్ల బారిన పడ్డ టాలీవుడ్ యంగ్ హీరోయిన్.. పోలీసులకు ఫిర్యాదు!

Son Of India: మళ్లీ మొదలైన సినిమా జోష్.. మోహన్ బాబు సినిమాకు కూడా ముహూర్తం ఫిక్స్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే..

Ananya Panday: రెడ్ కలర్ డ్రెస్ లో తళుక్కుమన్న లైగర్ ముద్దుగుమ్మ.. దీని ధర ఎంతంటే..