విశాల్‌ ఓ విలన్‌.. నా దగ్గర ఆధారాలున్నాయి: రమ్య

యాక్షన్ హీరో విశాల్‌ మరో వివాదంలో చిక్కుకున్నారు. విశాల్‌ సినిమాల్లోనే హీరో అని, రియల్‌ లైఫ్‌లో విలన్‌ అని అతడి నిర్మాణ సంస్థలో పని చేసిన రమ్య అనే మహిళ సంచలన ఆరోపణలు చేశారు.

విశాల్‌ ఓ విలన్‌.. నా దగ్గర ఆధారాలున్నాయి: రమ్య
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 06, 2020 | 5:11 PM

యాక్షన్ హీరో విశాల్‌ మరో వివాదంలో చిక్కుకున్నారు. విశాల్‌ సినిమాల్లోనే హీరో అని, రియల్‌ లైఫ్‌లో విలన్‌ అని అతడి నిర్మాణ సంస్థలో పని చేసిన రమ్య అనే మహిళ సంచలన ఆరోపణలు చేశారు. ఇటీవల రమ్యపై విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ మేనేజర్‌ హరి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. గత ఆరు సంవత్సరాలుగా తమ సంస్థలో పనిచేస్తున్న రమ్య, నకిలీ డాక్యుమెంట్లతో సంస్థలోని డబ్బులను తన ఫ్యామిలీ అకౌంట్‌లోకి వేసుకుందని హరి ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ డబ్బులతోనే ఇటీవల ఇల్లు కొన్నట్లు ఆయన ఆరోపించారు.

ఈ ఆరోపణలపై రమ్య మాట్లాడింది. ”ఇలాంటివి జరుగుతాయని నాకు ముందే తెలుసు. నేను మహిళను అవ్వడం వలన బలవంతంగా సైలెంట్‌గా ఉండి పోవల్సి వచ్చింది. ఆఫీసులో నా ముందే ఎన్నో విషయాలు జరిగాయి. సినిమాల్లో చూసిన విధంగా విశాల్‌ హీరో కాదు, అతడో విలన్‌. నేను మోసం చేయలేదు. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి” అని అన్నారు. ఇక రమ్య సోదరుడు రాజేష్ మాట్లాడుతూ.. ఈ విషయంపై పోలీస్‌ స్టేషన్‌కి వెళితే అక్కడే చంపేస్తామని తమను బెదిరించారని వెల్లడించారు. మరి ఈ వివాదం ఎంతవరకు వెళుతుందో చూడాలి.