సుశాంత్ చివరి మూవీ ‘దిల్ బేచారా’ ట్రైలర్ విడుదల.. కన్నీళ్లు పెట్టిస్తున్న డైలాగ్స్

బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్ ఆత్మ‌హ‌త్య‌ యావ‌త్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీని, ఆయ‌న అభిమానుల‌ను షాక్ కి గురి చేసిన విష‌యం తెలిసిందే. ఈ హీరో చివరిగా నటించిన ‘దిల్‌ బేచారా’ ట్రైలర్ తాజాగా రిలీజ‌య్యింది.

సుశాంత్ చివరి మూవీ ‘దిల్ బేచారా’ ట్రైలర్ విడుదల.. కన్నీళ్లు పెట్టిస్తున్న డైలాగ్స్
Follow us
Ram Naramaneni

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 06, 2020 | 5:13 PM

బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్ ఆత్మ‌హ‌త్య‌ యావ‌త్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీని, ఆయ‌న అభిమానుల‌ను షాక్ కి గురి చేసిన విష‌యం తెలిసిందే. ఈ హీరో చివరిగా నటించిన ‘దిల్‌ బేచారా’ ట్రైలర్ తాజాగా రిలీజ‌య్యింది. ఈ సినిమాలో సుశాంత్‌కు జోడిగా సంజనా సంఘి క‌నిపించ‌నున్నారు. సంజనా కూడా ట్రైలర్ రీలీజ్ కు సంబంధించిన పోస్టర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. తనకు ఎంతో ఇష్టమైన సన్నివేశాల్లో ఆ పోస్ట‌ర్ లో ఉన్న‌ది ప్ర‌ధాన‌మైనది అని పేర్కొన్నారు.

ఇక ట్రైలర్ చూస్తుంటే సుశాంత్ జీవితమే సినిమాగా తీశారా అన్నట్లుగా తోస్తుంది. సుశాంత్ ట్రైల‌ర్ లో చూస్తుంటే మ‌న‌సులో తెలియ‌ని బాధ వెంటాడుతుంది. ఇంత మంచి యాక్ట‌ర్..ఎందుకు అంద‌రికీ దూరం అయ్యాడా అని ఆవేద‌న క‌లుగుతుంది. ఇందులో సుశాంత్ ప‌లి‌కే ప్రతీ డైలాగ్ కూడా మ‌న‌సుల‌ను తాకుతుంది. ‘ఎలా పుట్టాలి ఎప్పుడు చావాలి అన్నది మనం నిర్ణ‌యించ‌లేదం.. కానీ ఎలా బతకాలన్నది మాత్రం మన చేతుల్లో ఉంటుంది’ అంటూ ట్రైలర్‌లో సుశాంత్ ప‌లికిన సంభాష‌ణ‌లు క‌న్నీళ్లు పెట్టిస్తున్నాయి. ఇక ఈ చిత్రం జూలై 24న ఓటీటీ ఫ్లాట్ ఫామ్ డిస్నీ హాట్‌స్టార్‌లో రిలీజ్ కానుంది. అయితే ఎలాంటి సబ్‌స్క్రిప్షన్‌ చార్జీలు లేకుండా ఫ్రీగా అందరికి అందుబాటులో ఉండనుంది.