జబర్దస్త్‌ షోలో కరోనా కలకలం.. హైపర్ ఆది టీంలో ఒకరికి!

ఇప్పుడు జబర్దస్త్‌ షోలో కూడా కరోనా కలకలం రేగిందని సమాచారం. ప్రభుత్వం షూటింగ్స్‌కు పర్మిషన్ ఇవ్వడంతో ఈ మధ్యే పలు టీవీ షోలు, సీరియల్స్, కొన్ని సినిమా షూటింగ్‌లు జరుగుతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా ఈ కోవిడ్ ఎఫెక్ట్ చూపిస్తూనే..

జబర్దస్త్‌ షోలో కరోనా కలకలం.. హైపర్ ఆది టీంలో ఒకరికి!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 06, 2020 | 5:53 PM

తెలంగాణలో కరోనా వైరస్ హడలెత్తిస్తోన్న సంగతి తెలిసిందే. రోజురోజుకీ విపరీతంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇక ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని కంటైన్‌మెంట్ జోన్‌లలో జులై 31 వరకూ లాక్‌డౌన్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. అలాగే పలువురు ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసు సిబ్బంది, నటులపై కూడా ఈ వైరస్ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర స్టార్స్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో పలు సీరియల్స్ షూటింగ్స్‌ కూడా రద్దు చేశారు.

ఇప్పుడు జబర్దస్త్‌ షోలో కూడా కరోనా కలకలం రేగిందని సమాచారం. ప్రభుత్వం షూటింగ్స్‌కు పర్మిషన్ ఇవ్వడంతో ఈ మధ్యే పలు టీవీ షోలు, సీరియల్స్, కొన్ని సినిమా షూటింగ్‌లు జరుగుతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా ఈ కోవిడ్ ఎఫెక్ట్ చూపిస్తూనే ఉంది. తాజాగా హైపర్‌ ఆది టీంలో ఒకరికి కరోనా సోకినట్టు పలు వార్తలు వస్తున్నాయి. ఈ మధ్య ఆరోగ్యం సరిగా లేక.. టెస్టుకు వెళ్తే కరోనా పాజిటివ్ అని రిపోర్ట్స్ వచ్చాయి. దీంతో అతనికి కలిసి పనిచేసిన హైపర్ ఆది టీం మెంబర్స్ హోమ్ క్వారంటైన్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక జబర్దస్త్ షూటింగ్‌ని కూడా మధ్యలోనే నిలిపివేసినట్లు సమాచారం.

Read More: 

బ్రేకింగ్: కరోనాతో కాంగ్రెస్ సీనియర్ నేత మృతి

గోల్డ్ కొనాలనుకునే వారికి ఆర్బీఐ బంపర్ ఆఫర్..

ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే?